విద్యార్థులు శాస్త్రవేత్తలుగా ఎదగాలి
కేయూ క్యాంపస్, న్యూస్‌లైన్ : విద్యార్థులు సామాజిక శాస్త్రవేత్తలుగా ఎదగాలని కలెక్టర్ జి.కిషన్ కోరా రు. హన్మకొండలోని ఆర్ట్స్ అండ్ సైన్స్ క ళాశాలలో సోమవారం సెట్వార్ ఇంట ర్నల్ క్వాలిటీ అస్యూరెన్స్ సెల్, సోషల్ వర్క్ డిపార్‌టమెంట్ ఆధ్వర్యంలో కేయూ ఎంఎస్‌డబ్ల్యూ విద్యార్థులకు ఓరియెంటేషన్ నిర్వహించారు. ఈ సందర్భంగా కలెక్టర్ ముఖ్యఅతిథిగా హాజరై మాట్లాడారు. సంక్షేమ పథకాల ప్రాధాన్యతను లబ్ధిదారులకు తెలియజేసి వారిలో అపోహలను తొలగించాలని పేర్కొన్నారు.
విభజనకు ముందు రాష్ర్ట బడ్జెట్ ఒక లక్షా 15వేల కోట్లని, కేంద్రం ద్వారా రూ.15 లక్షల కోట్లతో పేదలకు సంక్షేమ పథకాలు అమ లు చేస్తున్నారని ఆయన వెల్లడించారు. ప థకాల అమలు కోసం విద్యార్థులు ప్రణాళికలు తయారు చేయాలన్నారు. ప్రజల కు ఆహారం, నీరు, విద్య, ఉపాధి, గూడు తదితర వసతులపై దృష్టిసారించాలని సూచించారు. నాగరికత పెరిగిన కొద్దీ అ లవాట్లు మారి ప్రజలు రోగాల బారిన పడుతున్నారన్నారు. మంచి అలవాట్లకు దూరమై మన ముందున్న మంచిని గ్రహించలేని పరిస్థితుల్లో ఉన్నామని ఆ వేదన వ్యక్తం చేశారు. గతంలో లక్ష మందిలో ఒకరికి కేన్సర్ ఉండగా.. ప్రస్తు తం ప్రతి వేయి మందిలో పది మందికి ఉంటుందన్నారు.
సామాజిక దురాచారాలు, పారిశుద్ధ్యంపై ప్రజలను చైతన్యం చేయాల్సిన అవసరముందని అభిప్రాయపడ్డారు. తొలుత గ్రామీణ నీటిపారుదల, గృహ నిర్మాణం, డీఆర్‌డీఏ, వెనుకబడిన తరగతుల సం క్షేమం, స్త్రీ, శిశు సంక్షేమం, వైద్య, ఆరోగ్యం తదితర శాఖల ద్వారా అమలయ్యే పథకాల గురించి పవర్‌పాయింట్ ప్రజం టేషన్ ద్వారా సంబంధిత అధికారులు విద్యార్థులకు వివరించారు. కార్యక్రమంలో సెట్వార్ సీఈఓ పురుషోత్తమ్, నెహ్రూ యువ కేంద్రం కోఆర్డినేటర్ మనోరంజన్, డీఆర్‌డీఏ పీడీ శంకరయ్య, మాస్టర్ ఆఫ్ సోషల్ వర్క్ (ఎంఎస్‌డబ్ల్యూ) విభాగం అధిపతి ప్రొఫెసర్ కె.రామానుజరావు మాట్లాడారు. యూనివర్సిటీ ఆర్ట్స్ అండ్ సైన్స్ కళాశాల, న్యూసైన్స్, గాయత్రి, మాస్టర్జీ, మహర్షి తదితర కళాశాలల ఎంఎస్‌డబ్ల్యూ విద్యార్థులు పాల్గొన్నారు.