అతి విశ్వాసం వద్దు... | Do not want the faith | Sakshi
Sakshi News home page

అతి విశ్వాసం వద్దు...

Published Mon, Nov 2 2015 1:15 AM | Last Updated on Fri, Aug 30 2019 8:24 PM

అతి విశ్వాసం వద్దు... - Sakshi

అతి విశ్వాసం వద్దు...

ఉప ఎన్నికలో గెలుపు మనదే  
మెజారిటీ తగ్గితే విమర్శలొస్తాయ్..
 త్వరలో గ్రేటర్ కార్పొరేషన్ ఎన్నికలు  
పంచాయతీరాజ్ శాఖ మంత్రి కేటీఆర్
 

హన్మకొండ : ‘వరంగల్ లోక్‌సభ ఉప ఎన్నికలో గెలుపు మనదే.. అరుుతే అతి ధీమాకు పోవద్దు.. అలా జరిగి మెజారిటీ తగ్గితే విపక్షాల నుంచి విమర్శలు ఎదురవుతారుు.. ఈ విషయూన్ని దృష్టిలో ఉంచుకుని ప్రతీ కార్యకర్త తానే పోటీలో ఉన్నట్లు భావించి పార్టీ అభ్యర్థి పసునూరి దయూకర్ విజయూనికి కృషి చేయూలి’ అంటూ రాష్ట్ర పంచాయతీరాజ్, గ్రామీణాభివృద్ధి, ఐటీ శాఖ మంత్రి కల్వకుంట్ల తారకరామారావు(కేటీఆర్) ఉద్భోదించారు. హన్మకొండలోని శ్యామల గార్డెన్స్‌లో టీఆర్‌ఎస్ వరంగల్ పశ్చిమ నియోజకవర్గ విస్తృతస్థాయి  కార్యకర్తల సమావేశం ఆదివారం జరి గింది. ఈ సమావేశంలో ముఖ్యఅతిథిగా కేటీఆర్ మాట్లాడుతూ ఉపఎన్నికల్లో గెలుపు ఖాయమే అరుునా.. గెలుస్తామ ని అలసత్వం వహిస్తే మోసపోతామన్నా రు. సామాన్య కుటుంబానికి చెందిన పసునూరి దయాకర్‌ను పార్టీ అభ్యర్థిగా ప్రకటించడమే కాకుండా ఖర్చులు భరిం చిన ఘనత టీఆర్‌ఎస్‌కు, కేసీఆర్‌కు దక్కుతుందని పేర్కొన్నారు.
 
పథకాలను ప్రజల్లోకి తీసుకువెళ్లాలి
 టీఆర్‌ఎస్ అధికారంలోకి వచ్చిన పదహారు నెలల కాలంలో రాష్ట్రంలో అమలు చేస్తున్న అభివృద్ధి, సంక్షేమ పథకాలను ప్రజల్లోకి తీసుకువెళ్లాలని కేటీఆర్ సూచించారు. ఇదే క్రమంలో కాంగ్రెస్, టీడీపీ వైఫల్యాలను ఎండగట్టాలన్నారు. అలాగే, ప్రతీ కార్యకర్త తాను పోటీలో ఉన్నట్లుగా భావించి పసునూరి దయూకర్ విజయూనికి కృషి చేయూలని పిలుపునిచ్చారు. తెలంగాణ రాష్ట్రం ఏర్పాటైతే లక్షలాది మందికి మేలు జరుగుతుందని భావించగా.. ఆ కోణంలో టీఆర్‌ఎస్ ప్ర భుత్వం కృషి చేస్తుందన్నారు. 38 లక్షల మందికి పింఛన్లు ఇచ్చామని,  మిషన్ కా కతీయ, వాటర్‌గ్రిడ్ వంటి పథకాలు చేపట్టామని వివరించారు. తెలంగాణ ఉద్యమ సమయంలో ఉద్యమం నుంచి తప్పుకుంటే రాళ్లతో కొట్టండని.. ఇప్పు డు ఇంటింటికీ తాగునీరు అందించకపో తే ఓట్లు అడిగేది లేదని చెప్పిన దమ్మున్న నేత కేసీఆర్ అని కేటీఆర్ పేర్కొన్నారు. కాగా, వరంగల్ పశ్చిమ అసెంబ్లీ నియోజకవర్గంలో అత్యధిక మెజారిటీ సాధిస్తామని ధీమా వ్యక్తం చేశారు. అలాగే, ఇక వరంగల్ కార్పొరేషన్ ఎన్నికలు కూడా త్వరలో రానున్నాయని, కార్యకర్తలు ఇప్పటినుంచే సిద్ధం కావాలన్నారు.
 
గెలుపునకు ఢోకా లేదు..

 వరంగల్ ఎంపీ స్థానం ఉప ఎన్నికలో టీఆర్‌ఎస్ అభ్యర్థి పసునూరి దయూకర్ విజయూనికి ఢోకా లేదని.. మెజారిటీపై నే దృష్టి సారించాలని ఎంపీ ప్రొఫెసర్ సీతారాంనాయక్ సూచించారు. ఈ ఎన్ని కలు రాజకీయ ప్రయోజనాల కోసమా, ప్రజా ప్రయోజనాల కోసమా అనే చర్చ కు తెర లేపారని.. ఈ ఎన్నికలు ప్రజా ప్రయోజనాల కోసమేనన్నారు. కాంగ్రెస్ లో టికెట్ కావాలంటే రూ.కోట్లు నాయకులకు చెల్లించాల్సి ఉంటుందని ఆరోపించారు. టీఆర్‌ఎస్ మాత్రం పేద వారికి టికెట్ ఇచ్చి గెలిపించుకుంటుదని తెలిపారు. జెడ్పీ చైర్‌పర్సన్ గద్దల పద్మ మాట్లాడుతూ పార్టీ కార్యకర్తలు సైని కుల్లా పని చేసి దయాకర్‌ను భారీ మెజారిటీతో గెలిపించాలన్నారు. ఎమ్మెల్యే కొండా సురేఖ మాట్లాడుతూ దయాకర్ మొదటి నుంచి వినయ విధేయతలు కలిగి ఉన్నారని.. ఎంపీగా గెలిచాక కూ డా ఇలాగే వ్యవహరించాలని సూచించా రు. ఇక ఈ ఎన్నికలో పశ్చిమ, తూర్పు నియోజకవర్గాల కార్యకర్తలు మెజారిటీ సాధించడంలో పోటీ పడాలన్నారు. ఎమ్మెల్యే డీఎస్.రెడ్యానాయక్ మాట్లాడుతూ టీఆర్‌ఎస్‌ను చూసి విపక్షాల గుం డెల్లో రైళ్లు పరుగెడుతున్నాయని పేర్కొన్నారు. టీఆర్‌ఎస్ జిల్లా అధ్యక్షుడు రవీందర్‌రావు మాట్లాడుతూ ఈ నెల 4వ తేదీన పసునూరి దయాకర్ నామినేషన్ కార్యక్రమానికి కార్యకర్తలు భారీ ఎత్తున తరలిరావాలని పిలుపునిచ్చారు.

చివరగా టీఆర్‌ఎస్ ఎంపీ అభ్యర్థి దయాకర్ మాట్లాడుతూ టీఆర్‌ఎస్‌లో సామా న్య కార్యకర్తగా పని చేశానని.. ఏ పదవి ఉన్నా, లేకపోరుునా కేసీఆర్‌కు విధేయుడుగా ఉంటూ పార్టీ కార్యక్రమాల విజ యవంతానికి కృషి చేశానని తెలిపారు. తన వంటి పేదవాడిని పంపేలా టికెట్ ఇవ్వడం కేసీఆర్‌కే సాధ్యమన్నారు. పార్టీ నాయకులు, కార్యకర్తల తనను అధిక మెజారిటీతో గెలిపించాలని కోరారు. ఈ సమావేశంలో టీఆర్‌ఎస్ వరంగల్ గ్రేటర్ అధ్యక్షుడు నన్నపనేని నరేందర్, నాయకులు గుడిమల్ల రవికుమార్, జన్ను జకార్య, ప్రొఫెసర్ సాంబయ్య, బి.రవీంద్రకుమార్, మర్రి యాదవరెడ్డి, కె.సాంబయ్య, వాసుదేవరెడ్డి, జోరిక ర మేష్, నార్లగిరి రమేష్, అబూబకర్, శివశంకర్, నయూముద్దీన్‌తో పాటు స్ర వంతి, కృష్ణలత, జ్యోతి పాల్గొన్నారు.
 
 
 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement