15 లోపు ‘పంచాయతీ’ షెడ్యూల్‌! | Telangana Panchayat Election Schedule Before February 15 Says Minister Ponguleti Srinivas Reddy | Sakshi
Sakshi News home page

15 లోపు ‘పంచాయతీ’ షెడ్యూల్‌!

Published Mon, Feb 3 2025 5:45 AM | Last Updated on Mon, Feb 3 2025 5:45 AM

Telangana Panchayat Election Schedule Before February 15 Says Minister Ponguleti Srinivas Reddy

అర్హులందరికీ ఇందిరమ్మ ఇళ్లు: మంత్రి పొంగులేటి

వైరా: ఈనెల 15వ తేదీలోగా గ్రామ పంచాయతీల ఎన్నికల షెడ్యూల్‌ వస్తుందని రాష్ట్ర రెవెన్యూ, గృహ నిర్మాణ శాఖ మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి చెప్పారు. ఆదివారం ఖమ్మం జిల్లా వైరా మండలం విప్పలమడకలో ఆయన మాట్లాడారు. అర్హులైన ప్రతి ఒక్కరికీ ఇందిరమ్మ ఇళ్లు మంజూరు చేస్తామని చెప్పారు. లబ్ధిదారుల ఎంపికలో పొరపాట్లు జరగకుండా చూడాలని అధికారులకు సూచించారు. 

తాము పండించిన ధాన్యం కొనుగోలు చేయడం లేదని పలువురు రైతులు మంత్రి దృష్టికి తీసుకురాగా, వెంటనే కలెక్టర్‌ ముజమ్మిల్‌ ఖాన్‌తో ఫోన్‌లో మాట్లాడారు. చివరి గింజ వరకూ కొనుగోలు చేయాలని, రైతులు ఇబ్బంది పడకుండా చూడాలని ఆదేశించారు. కార్యక్రమంలో వైరా ఎమ్మెల్యే మాలో0త్‌ రాందాస్‌ నాయక్‌తో పాటు స్థానిక నేతలు పాల్గొన్నారు.

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

 
Advertisement