మాట్లాడుతున్న రాష్ట్ర మంత్రి పొంగులేటి. చిత్రంలో కలెక్టర్ గౌతమ్
సాక్షి ప్రతినిధి, ఖమ్మం: కాంగ్రెస్ పార్టీ ఇచ్చిన ఆరు గ్యారంటీల్లో ఇప్పటికే రెండు అమలవుతున్నాయని, ఈనెల 28న మరో రెండు, వచ్చే సంక్రాంతిలోగా మిగిలిన రెండు గ్యారంటీలు అమలు చేయనున్నట్లు రాష్ట్ర రెవెన్యూ, గృహ నిర్మాణ, సమాచార శాఖ మంత్రి పొంగులేటి శ్రీనివాస్‌రెడ్డి వెల్లడించారు. ఖమ్మం కలెక్టరేట్‌లో సోమవారం పాలేరు నియోజకవర్గ అభివృద్ధి, సమస్యలపై కలెక్టర్ వీపీ గౌతమ్, సీపీ విష్ణు వారియర్ సహా అధికారులతో మంత్రి సమీ క్షించారు.
అనంతరం ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో మాట్లాడుతూ తమది ప్రజా ప్రభు త్వమని తెలిపారు. రైతులకు ఇబ్బంది కలగకుండా, నష్టం లేకుండా ధరణిని ప్రక్షాళన చేయడంతోపాటు గత ప్రభుత్వం సామాన్యుల నుంచి లాక్కున్న ఆస్తులు తిరిగి ఇస్తామని చెప్పారు. వీఆర్‌ఓల సమస్యలను కూడా పరిష్కరిస్తామన్నారు. త్వరలో రెవెన్యూలో విప్లవాత్మక మార్పులు తీసు కొస్తామని.. ఇందులో అధికారులపై కక్ష సాధింపు చర్యలు ఉండవని పొంగులేటి స్పష్టం చేశారు.
ప్రభుత్వ ఆస్తులు దోచుకున్న, ప్రభుత్వ ఆస్తులు కొల్లగొట్టిన విషయంపై సమీక్షిస్తామని, ఖమ్మం, వరంగల్, హైదరాబాదే కాకుండా రాష్ట్రంలో ఎక్కడ ప్రభుత్వ భూముల ఆక్రమణ జరిగినా వదలబోమని తెలిపారు. గత ప్రభుత్వం రాష్ట్రాన్ని ఆర్థికంగా కొల్లగొట్టిందని, ఈనెల 20న అసెంబ్లీ సాక్షిగా శ్వేతపత్రాన్ని ప్రజల ముందు పెడతామని వెల్లడించారు.
విడతల వారీగా ఇళ్లు..
గృహ నిర్మాణ శాఖ మంత్రిగా ఇళ్ల నిర్మాణంపై ప్రత్యేక దృష్టి పెట్టానని, రాష్ట్రంలో రానున్న ఐదేళ్లలో ఎవరికీ ఇల్లు లేదని అనకుండా విడతల వారీగా నిర్మాణం చేస్తామని పొంగులేటి తెలిపారు. నీటి పా రుదల శాఖలో జరిగిన అవినీతి, కాళేశ్వరం ప్రాజె క్టుపై సిట్టింగ్ జడ్జితో ప్రభుత్వం విచారణ చేయించేందుకు పూనుకుందన్నారు. డ్రగ్స్, గంజాయిపై రాష్ట్రంలో ఉక్కుపాదం మోపేలా ఇప్పటికే సీఎం కఠిన చర్యలు తీసుకుంటున్నారని చెప్పారు.
Comments
Please login to add a commentAdd a comment