జిల్లా ప్రజలకు ఖమ్మం ఎంపీ పొంగులేటి శ్రీనివాసరెడ్డి దసరా శుభాకాంక్షలు తెలిపారు.
సాక్షి, ఖమ్మం: జిల్లా ప్రజలకు ఖమ్మం ఎంపీ పొంగులేటి శ్రీనివాసరెడ్డి దసరా శుభాకాంక్షలు తెలిపారు. ఈ మేరకు గురువారం ఆయన ఒక ప్రకటన విడుదల చేశారు. జిల్లా ప్రజలు అన్ని రంగాల్లో అభివృద్ధి చెందాలని ఆకాంక్షించారు.
తొమ్మిది రోజుల పాటు ఆడపడుచులు, చిన్నారులు ఉత్సాహంగా బతుకమ్మ వేడుకలలో పాల్గొన్నారని, మళ్లీ వచ్చే బతుకమ్మ పండుగను ఇంతకంటే ఘనంగా జరుపుకోవాలని పిలుపునిచ్చారు. అశ్వారావుపేట ఎమ్మెల్యే తాటి వెంకటేశ్వర్లు, పినపాక ఎమ్మెల్యే పాయం వెంకటేశ్వర్లు కూడా వేర్వేరు ప్రకటనల్లో జిల్లా ప్రజలకు దసరా శుభాకాంక్షలు తెలిపారు.