నేడు రెవెన్యూ ఉద్యోగ సంఘాలతో ‘పొంగులేటి’ భేటీ | Ponguleti Srinivas Reddy met with the revenue employees on september 21 | Sakshi
Sakshi News home page

నేడు రెవెన్యూ ఉద్యోగ సంఘాలతో ‘పొంగులేటి’ భేటీ

Published Sat, Sep 21 2024 3:25 AM | Last Updated on Sat, Sep 21 2024 3:25 AM

Ponguleti Srinivas Reddy met with the revenue employees on september 21

సాక్షి, హైదరాబాద్‌: రెవెన్యూ ఉద్యోగ సంఘాలతో ఆ శాఖ మంత్రి పొంగులేటి శ్రీనివాస్‌రెడ్డి శనివారం సమా వేశం కానున్నారు. మధ్యాహ్నం 2 గంటలకు సచివాలయంలో జరగనున్న సమావేశానికి హాజరు కావాలని రెవెన్యూ శాఖ పరిధిలో పనిచేస్తున్న ఉద్యోగ సంఘాలకు ఆహ్వానం అందింది. సమావేశంలో వీఆర్వో వ్యవస్థ పునరుద్ధరణ, వీఆర్‌ఏల విలీనం, పెండింగ్‌ పదోన్నతులు, ఎన్నికల బదిలీలు తదితర అంశాలపై చర్చ జరిగే అవకాశముంది. 

ఎన్నికల బదిలీలు చేపట్టండి 
అసెంబ్లీ, పార్లమెంటు ఎన్నికల సందర్భంగా బదిలీ అయిన తహసీల్దార్లు, నాయబ్‌ తహసీల్దార్లను పూర్వ జిల్లాలకు బదిలీ చేయాలని తెలంగాణ రెవె న్యూ ఎంప్లాయీస్‌ సరీ్వసెస్‌ అసోసియేషన్‌ (ట్రెసా) మంత్రి పొంగులేటి శ్రీనివాస్‌రెడ్డిని కోరింది. ఈ మేరకు ట్రెసా అధ్యక్షుడు వంగ రవీందర్‌రెడ్డి, ప్రధాన కార్యదర్శి కె.గౌతమ్‌కుమార్‌లతో కూడిన బృందం శుక్రవారం సచివాలయంలో మంత్రికి వినతిపత్రం అందజేశారు.

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

 
Advertisement