revenue emloyeess
-
నేడు రెవెన్యూ ఉద్యోగ సంఘాలతో ‘పొంగులేటి’ భేటీ
సాక్షి, హైదరాబాద్: రెవెన్యూ ఉద్యోగ సంఘాలతో ఆ శాఖ మంత్రి పొంగులేటి శ్రీనివాస్‌రెడ్డి శనివారం సమా వేశం కానున్నారు. మధ్యాహ్నం 2 గంటలకు సచివాలయంలో జరగనున్న సమావేశానికి హాజరు కావాలని రెవెన్యూ శాఖ పరిధిలో పనిచేస్తున్న ఉద్యోగ సంఘాలకు ఆహ్వానం అందింది. సమావేశంలో వీఆర్వో వ్యవస్థ పునరుద్ధరణ, వీఆర్ఏల విలీనం, పెండింగ్ పదోన్నతులు, ఎన్నికల బదిలీలు తదితర అంశాలపై చర్చ జరిగే అవకాశముంది. ఎన్నికల బదిలీలు చేపట్టండి అసెంబ్లీ, పార్లమెంటు ఎన్నికల సందర్భంగా బదిలీ అయిన తహసీల్దార్లు, నాయబ్ తహసీల్దార్లను పూర్వ జిల్లాలకు బదిలీ చేయాలని తెలంగాణ రెవె న్యూ ఎంప్లాయీస్ సరీ్వసెస్ అసోసియేషన్ (ట్రెసా) మంత్రి పొంగులేటి శ్రీనివాస్‌రెడ్డిని కోరింది. ఈ మేరకు ట్రెసా అధ్యక్షుడు వంగ రవీందర్‌రెడ్డి, ప్రధాన కార్యదర్శి కె.గౌతమ్‌కుమార్‌లతో కూడిన బృందం శుక్రవారం సచివాలయంలో మంత్రికి వినతిపత్రం అందజేశారు. -
మహా దూకుడు
వరంగల్ అర్బన్ : ఆస్తి, నీటి పన్ను వసూళ్లపై గ్రేటర్ వరంగల్ మునిసిపల్ కార్పొరేషన్ దృష్టి పెట్టింది. పేద, మధ్య తరగతి అనే తేడా లేకుం డా అధికారులు, సిబ్బంది బకాయిదారుల ఆస్తులను జప్తు చేస్తూ, షాపులు, నల్లాలు సీజ్ చేస్తున్నారు. బకాయిలు చెల్లించకుండా మొండికేస్తున్న వారికి రెడ్ నోటీస్లతోపాటు వారెంట్లు జారీ చేస్తున్నారు. ఏళ్ల తరబడి పన్ను కట్టని వారికి లీగల్ నోటీసులు పంపించడానికి సన్నద్ధమవుతున్నారు. వారం రోజులుగా పోలీసుల సహకరంతో ప్రత్యేకంగా 13 బృందాలు రంగంలోకి దిగాయి. జీపులకు మైకులకు ఏర్పాటు చేసి పన్నులు చెల్లించాలని విస్త్రతంగా ప్రచారం చేస్తున్నారు. దీంతో పన్ను బకాయిదారులు ఆందోళన చెందుతున్నారు. ఆలస్యంగా మేల్కొన్న రెవెన్యూ సిబ్బంది వరంగల్ మహానగర పాలక సంస్థకు పన్నులే ప్రధాన వనరు. ఆదాయ పెంచుకునేందుకు ఆసక్తి చూపిస్తున్న యంత్రాంగం వసూళ్లపై శ్రద్ధ చూపడం లేదు. ఈ ఏడాది ఎలాగైనా వందశాతం పన్ను వసూలు చేయాలని రాష్ట్ర పురపాలక శాఖ ఉన్నతాధికారులు ఆదేశాలు జారీ చేశారు. దీంతో ఇంత కాలం చూసీచూడనట్లుగా వ్యవహరించిన పన్నుల విభాగం అధికారులు, సిబ్బంది ఇటీవల కాలంలో వేగం పెంచారు. ఫస్ట్ ఆఫ్‌లో పన్ను వసూళ్ల టార్గెట్‌లో బల్దియా విఫలం చెందింది. పదకొండు నెలల పాటు మీనిమేషాలు లెక్కిస్తూ వస్తున్న గ్రేటర్ రెవెన్యూ సిబ్బంది ఆర్థిక సంవత్సరానికి మార్చి నెల చివరిది కావడంతో స్పీడ్ పెంచారు. మొండిబకాయిదారులను డివిజన్ల వారీగా విభజించి వారం రోజులుగా తిరుగుతున్నారు. ‘ఆన్లైన్’లో టాప్ బకాయిదారుల పేర్ల ప్రదర్శన ఆస్తి, నీటి పన్నుల బడా బకాయిదారుల పేర్లను ఆన్లైన్లో ప్రదర్శిస్తున్నాయి. ఆయా డివిజన్లలో ప్లెక్సీలపై వారి పేర్లను ప్రదర్శించిన అధికార యంత్రాంగం మరో అడుగు ముందుకేసింది. టాప్–100 బడాబకాయిదారుల పేర్లను జీడబ్ల్యూఎంసీ వెబ్సైల్లో పెంటారు. 27 రోజులు.. రూ.30కోట్లు గ్రేటర్ పరిధిలో 18,106 ఆస్తులున్నాయి. పాత బకాయిలు రూ.5.56 కోట్లు ఉండగా 2018–19 ఆర్థిక సంవత్సరం కొత్త పన్ను రూ.56.10 కోట్లతో కలిపి రూ.61.66 కోట్లకు చేరింది. ఇప్పటి వరకు పాత, కొత్త బకాయిలు రూ.45 కోట్లు వసూలు చేశారు. రూ.16.66 కోట్లు వసూలు చేయాల్సి ఉంది. ఇకపోతే నల్లా కనెక్షన్లు 1,05,041 ఉన్నాయి. వీటి పాత బకాయిలు రూ.9.70కోట్లు ఉండగా కొత్త బకాయిలు రూ.15.72 కోట్లు కలిపి మొత్తం ఈ ఏడాది రూ.25.42కోట్లకు చేరింది. పాత, కొత్త బకాయిలు కలిపి రూ.10.88 కోట్లు వసూలు చేశారు. ఇంకా రూ.13.34 కోటుŠల్ వసూలు చేయాల్సి ఉంది. మరో 24 రోజులైతే ఈ ఆర్థిక సంవత్సరం ముగియనున్న నేపథ్యంలో ఆస్తి, నీటి పన్నులు రూ.30కోట్లు వసూలు చేసి లక్ష్యం సాధించాలని అధికారులు భావిస్తున్నారు. వసూళ్లల్లో ఎలాంటి నిర్లక్ష్యం వహించొద్దని, వందశాతం పూర్తి చేయడానికి కార్యాచరణ రూపొందించాలని సూచిస్తున్నారు. అధికారులు సైతం ప్రత్యేక బృందాలుగా 13 ఏరియాల వారీగా ఆర్ఐలు, బిల్ కలెక్టర్లకు టార్గెట్లు నిర్ణయించి పన్నులు వసూలు చేయాలని రోజు వారీగా వాకీటాకీల ద్వారా సూచనలు చేస్తూ సమీక్షలు నిర్వహిస్తున్నారు. ఆర్ఓలు, ఆర్ఐ, బిల్ కలెక్టర్, కారోబార్, లైన్మెన్లు, 28 మంది పోలీస్ సిబ్బంది సహకారంతో పన్నులు వసూలు చేస్తున్నారు. ఆస్తి, నీటి పన్నుల వసూళ్లకు ప్రత్యేకంగా జీపులతో బల్దియా రెవెన్యూ సిబ్బంది ఆస్తులు జప్తు, సీజ్ మొండి బకాయిదారుల నుంచి ఎట్టిపరిస్థితుల్లోనూ పన్నులు వసూలు చేయాలనే లక్ష్యంతో మహా నగర పాలక సంస్థ అధికారులు, సిబ్బంది వివిధ రకాల చర్యలకు పాల్పడుతున్నారు. పేద, మధ్య తరగతి వర్గాలపై దూకుడు ప్రదర్శిస్తున్నారు. బకాయి చెల్లించని వారి ఇళ్ల తలుపులు, ఇతర వస్తువులు జప్తు చేస్తున్నారు. నల్లా కనెక్షన్లను సీజ్ చేస్తున్నారు. పన్నులు చెల్లించి అభివృద్ధికి సహకరించండి పన్నులు చెల్లించి కార్పొరేషన్ ఆదాయాన్ని పెంచి నగర అభివృద్ధికి సహకరించాలి. పన్ను వసూళ్లను పూర్తి చేసేందుకు కార్యచరణ సిద్ధమైంది. పాత బకాయిలు, ప్రస్తుత పన్నులు చెల్లించాలి. వసూళ్ల కోసం వచ్చే కార్పొరేషన్ సిబ్బందికి అన్ని విధాలుగా సహకారం అందించాలి. – శాంతికుమార్, టాక్సేషన్ ఆఫీసర్ -
నేడు, రేపు ఉద్యోగుల సెలవులు రద్దు
రెవెన్యూ ఉద్యోగులకు కలెక్టర్ ఆదేశం హన్మకొండ అర్బన్ : జిల్లాలోని రెవెన్యూ ఉద్యోగులు ఆదివారం (21న) విధులకు హాజరుకావాలని కలెక్టర్ కరుణ ఆదేశించారు. అదేవిధంగా సోమవారం ఉద్యోగుల సెలవులు రద్దు చేస్తున్నట్లు తెలిపారు. ఈ మేరకు శనివారం సాయంత్రం అన్ని మండలాల తహసీల్దార్లకు ఆదేశాలు అందాయి. జిల్లాల పునర్విభజనకు సోమవారం డ్రాఫ్ట్ నోటిఫికేషన్ వెలువడనున్న నేపథ్యంలో ఉద్యోగులు అందుబాటులో ఉండాలని కలెక్టర్ ఆదేశించినట్లు సమాచారం. -
తహశీల్దార్ల నిరసన గళం
శ్రీకాకుళం పాతబస్టాండ్: జిల్లా పరిపాలనకు కేంద్ర స్థానమైన కలెక్టరేట్లో కలకలం రేగింది. కీలకమైన రెవెన్యూ సర్వీసుల సంఘం, తహశీల్దార్ల నిరసన, బహిష్కరణలతో పరి స్థితి గందరగోళంగా మారింది. జాయింట్ కలెక్టర్ వ్యవహారశైలిపై రెవెన్యూ ఉద్యోగులు, అధికారులు విరుచుకుపడ్డారు. పరిస్థితిని చక్కదిద్దేందుకు ఉన్నతాధికారులు చేసిన ప్రయత్నాలు సైతం ఫలించలేదు. జాయింట్ కలెక్టర్ వీర పాండ్యన్ ఇటీవల వ్యవహరిస్తున్న తీరు, సిబ్బందిని వేధింపులకు గురిచేయడాన్ని వ్యతిరేకిస్తూ జిల్లా రెవెన్యూ సంఘం ఆధ్వర్యంలో తహశీ ల్దార్లు శుక్రవారం నిరసనకు దిగారు. నెలవారీగా జరగాల్సిన రెవెన్యూ ఆఫీసర్స్(ఆర్ఓ) సమావేశాన్ని సైతం బహిష్కరించారు. ఫలితంగా ఉదయం పది నుంచి మధ్యాహ్నం ఒంటి గంట వరకు కలెక్టరేట్ దద్దరిల్లింది. పరిస్థితిని చక్కదిద్దేందుకు మొదట జేసీ, తర్వాత డీఆర్వో చర్చలు జరిపినా ఫలితం లేకపోయింది. ఇలా మొదలైంది.. తహశీల్దార్లు, డిప్యూటీ తహశీల్దార్లు, తదితర రెవెన్యూ అధికారులతో జరిపే నెలవారీ సమీక్షా సమావేశం శుక్రవారం జరగాల్సి ఉంది. దాని కోసం ఉదయం తహశీల్దార్లందరూ కలెక్టరేట్‌కు వచ్చినా.. సమావేశ హాలులోకి మాత్రం వెళ్లలేదు. ఇటీవల జరిగిన జరిగిన కొన్ని సంఘటనల నేపథ్యంలో వేధింపులు, ఒత్తిళ్లు తగ్గేవరకు సమావేశాలకు హజరుకారాదని నిర్ణయించుకున్నారు. రెవెన్యూ సర్వీసుల సంఘం జిల్లా శాఖ ఆధ్యక్షుడు ఎం.కాళీప్రసాద్ మాట్లాడుతూ ఇటీవల కాలంలో రెవెన్యూ శాఖలో పని ఒత్తిడి చాలా పెరిగిందని, దీనికి తోడు తగిన సౌకర్యాలు కల్పించకుండా జాయింట్ కలెక్టర్ మరింత ఒత్తిడి పెంచుతున్నారని, సిబ్బందిపై చర్యలు తీసుకుంటున్నారని, దీని వల్ల ఉద్యోగుల మనోభావాలు దెబ్బతింటున్నాయని అన్నారు. ఉద్యోగులు తమ కుటుంబాలను చూసుకొనేందుకు కూడా సమయం ఉండడంలేదని అన్నారు. ఈ సమస్యలు వివరించినా పట్టించుకోనే స్థితిలో జేసీ లేరని ఆరోపించారు. సస్పెండ్ చేస్తామని బెదిరించడం, కొందరిపై చర్యలు తీసుకోవడం వల్ల సమాజంలో తహశీల్దార్లకు గౌరవం తగ్గుతోందన్నారు. ఈ విషయమై జేసీతో చర్చించగా, సమస్యల గురించి లిఖితపూర్వకంగా ఇవ్వాలని సూచించారే తప్ప పరిష్కారం గురించి మాట్లాడలేదని, అందుకే ఆర్ఓ సమావేశాన్ని బిహ ష్కరిస్తున్నామని చెప్పారు. రెవిన్యూ సర్వీసుల సంఘం రాష్ట్ర కార్యదర్శి జె రామారావు మాట్లాడుతూ వీఆర్ఎ నుంచి తహశీల్దారు వరకు జేసీ కారణంగా ఒత్తిడి ఎదుర్కొంటున్నారన్నారు. పలు తహశీల్దారు కార్యాలయాల్లో సరిపడినన్ని కంప్యూటర్లు లేవన్నారు. సిబ్బంది కొరత ఉందని, అవుట్ సోర్సింగ్ సిబ్బందికి జీతాలు లేవని, నెట్ సర్వీసు, విద్యుత్ కోతలు, ఇతర ఇబ్బందులు ఉన్నాయన్నారు. వీటిని పరిష్కరించకుండా ఒత్తిడి పెంచడం తగదన్నారు. ఆవసరమైతే రాష్ట్ర రెవిన్యూ సంఘం దృష్టికి ఈ సమస్యను తీసుకెళ్లామన్నారు. ప్రభుత్వ ఆదేశాల మేరకు ఒత్తిడి దీనిపై జేసీ వద్ద ప్రస్తావించగా పనులు నిర్ణీత సమయంలో పూర్తి చేయాలని రాష్ట్ర ప్రభుత్వం నుంచి ఒత్తిడి ఉందన్నారు. సకాలంలో పనులు పూర్తి చేయించాలన్న ఉద్దేశంతో కఠినంగా వ్యవహరిస్తున్నాను తప్ప వారిపై కోసం కాదని, రెవె న్యూ సిబ్బంది అంటే తనవారేనని అన్నారు. సాయంత్రం మరోసారి చర్చలు రెవిన్యూ సర్వీసుల సంఘం ప్రతినిధులు, జాయింట్ కలెక్టర్ శుక్రవారం సాయంత్రం మరోసారి చర్చలు జరిపారు. ఈ చర్చల్లో 20 రకాల సమస్యలను అసోసియేషన్ ప్రతినిధులు జేసీ దృష్టికి తీసుకువెళ్లారు. తన పరిధిలో ఉన్న సమస్యలు పరిష్కరిస్తానని, మిగిలిన వాటిని కలెక్టర్ దృష్టికి తీసుకెళ్లానని జేసీ హామీ ఇచ్చారు. దీంతో తాత్కలికంగా తహశీల్దార్లు నిరసన విరమించుకున్నారు. ఈ సమావేశంలో డీఆర్ఓ నూర్‌బాషా కాశీం, ఆర్డీవోలు జి.గణేష్‌కుమార్, శ్యాంప్రసాద్, తేజ్ భరత్‌లు, రెవెన్యూ సంఘం ప్రతనిధులు పాల్గొన్నారు. టెక్కలి ఆర్డీవోకు జేసీ మందలింపు ఈ సందర్భంగా జాయింట్ కలెక్టర్ చాంబర్ వద్ద విడియో చిత్రీకరిస్తున్న ఒక న్యూస్ చానల్ కెమెరాను లాక్కునేందుకు టెక్కలి ఆర్డీవో శ్యామ్‌ప్రసాద్ ప్రయత్నించారు. జర్నలిస్టులు దీనికి నిరసన వ్యక్తం చేయగా అక్కడే ఉన్న శ్రీకాకుళం ఆర్డీవో జోక్యం చేసుకుని క సముదాయించారు. అనంతరం జేసీ చాంబర్‌కు వెళ్లిన తర్వాత కూడా టెక్కలి ఆర్డీవో మిడియాపై చిందులు తొక్కుతుండగా జర్నలిస్టుల జోలికి వెల్లద్దని, వివాదాలు వద్దని జేసీ వీరపాండ్యన్ ఆయన్ను మందలించారు.