- రెవెన్యూ ఉద్యోగులకు కలెక్టర్ ఆదేశం
నేడు, రేపు ఉద్యోగుల సెలవులు రద్దు
Published Sat, Aug 20 2016 11:42 PM | Last Updated on Mon, Sep 4 2017 10:06 AM
హన్మకొండ అర్బన్ : జిల్లాలోని రెవెన్యూ ఉద్యోగులు ఆదివారం (21న) విధులకు హాజరుకావాలని కలెక్టర్ కరుణ ఆదేశించారు. అదేవిధంగా సోమవారం ఉద్యోగుల సెలవులు రద్దు చేస్తున్నట్లు తెలిపారు. ఈ మేరకు శనివారం సాయంత్రం అన్ని మండలాల తహసీల్దార్లకు ఆదేశాలు అందాయి. జిల్లాల పునర్విభజనకు సోమవారం డ్రాఫ్ట్ నోటిఫికేషన్ వెలువడనున్న నేపథ్యంలో ఉద్యోగులు అందుబాటులో ఉండాలని కలెక్టర్ ఆదేశించినట్లు సమాచారం.
Advertisement
Advertisement