మూడు జిల్లాలకు అఖిలపక్షం సై | 3 districts draft notification on 22nd | Sakshi
Sakshi News home page

మూడు జిల్లాలకు అఖిలపక్షం సై

Published Sat, Aug 20 2016 10:01 PM | Last Updated on Fri, Jul 12 2019 4:28 PM

మూడు జిల్లాలకు అఖిలపక్షం సై - Sakshi

మూడు జిల్లాలకు అఖిలపక్షం సై

  • 22న డ్రాప్టు నోటిఫికేషన్‌
  • ‍్రఅన్ని వర్గాల నుంచి అభ్యంతరాల స్వీకరణ
  • కొత్త మండల కేంద్రాల కోసం డిమాండ్లు
  • సాక్షి, సంగారెడ్డి: జిల్లా పునర్విభజన మ్యాప్‌ కొలిక్కి వచ్చింది. శనివారం సీఎం కేసీఆర్‌ అధ్యక్షతన జరిగిన అఖిలపక్షం సమావేశంలో సంగారెడ్డి, సిద్దపేట, మెదక్‌ జిల్లాల ఏర్పాటుకు ఓకే చెప్పినట్లు సమాచారం. అఖిలపక్షం సమావేశంలో పాల్గొన్న నాయకులు మెదక్‌ జిల్లా విభజనకు సంబంధించి స్వల్ప మార్పులు మినహా పెద్దగా అభ్యంతరం తెలపలేదని తెలిసింది.

    సంగారెడ్డి, మెదక్‌, సిద్దిపేట జిల్లాల ఏర్పాటుకు సంబంధించి ఈనెల 22న డ్రాప్టు నోటిఫికేషన్‌ జారీ చేయనున్నారు. డ్రాప్టు నోటిఫికేషన్‌ విడుదల  అయిన అనంతరం జిల్లా స్థాయిలో కలెక్టర్‌, రాష్ట్ర స్థాయిలో సీసీఎల్‌ఏ అభ్యంతరాలు స్వీకరించనున్నారు. ఆ తర్వాత జిల్లాల విభజనకు సంబంధించి ప్రభుత్వం తుది ముసాయిదాను ప్రచురింస్తుంది.

    పరిపాలన సౌలభ్యం కోసం కొత్త జిల్లాలు ఏర్పాటు చేస్తున్నామని, కొత్త జిల్లా ఏర్పాటు విషయంలో ప్రజల అభిప్రాయాలకు ప్రాధాన్యత ఇస్తామని ప్రభుత్వం ప్రకటించిన నేపథ్యంలో స్వల్ప మార్పులు చేర్పులతో దసరా నాటికి సంగారెడ్డి, మెదక్‌, సిద్దిపేట జిల్లాలు మనుగడలోకి రానున్నాయి.

    జిల్లా పునర్విభజనపై ప్రసుత్తం ఎక్కడా ఎక్కువ అభ్యంతరాలు వ్యక్తం కాకపోయినప్పటికీ కొన్ని మండలాల విలీనం, మండల కేంద్రాల ఏర్పాటకు సంబంధించి కొత్త డిమాండ్లు్ తెరపైకి వస్తున్నాయి. జిల్లాల పునర్విభజనలో భాగంగా వట్‌పల్లి మండల కేంద్రం చేయాలని, మాసాయిపేటను మండల కేంద్రంగా చేయాలని కోరుతూ శనివారం ప్రజలకు ఆందోళనకు దిగారు.

    అలాగే కొత్తగా ఏర్పాటు కాన్నున మెదక్‌ జిల్లాలో మండలాల సంఖ్య కొంత పెంచాలన్న డిమాండ్లు వ్యక్తం అవుతున్నాయి. ఈ నేపథ్యంలో ప్రజలు ఇతరవర్గాల నుంచి పూర్తిస్థాయిలో అభ్యంతరాలు, సలహాలు, సూచనలు కొత్త జిల్లాల ఏర్పాటుపై ‍ ప్రభుత్వం ముందుకు సాగనుంది. కాగా ఇది వరకే జిల్లాల పునర్విభజనుకు సంబంధించి సబ్‌కమిటీకి అందజేసిన ప్రతిపాదనకు అనుగుణంగానే మెదక్‌, సంగారెడ్డి, సిద్దపేట జిల్లాల ఏర్పాటు అయ్యే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి.

    జిల్లాల పునర్విభజనలో భాగంగా ప్రస్తుతం రెవెన్యూ మండలాలు మాత్రమే ఏర్పాటు కానున్నాయి. ప్రస్తుతం ఉన్న మండల పరిషత్‌ పాలకవర్గాల సయమం పూర్తయ్యాక కొత్తగా మండల పరిషత్‌లు ఏర్పాటు కానున్నాయి. డీసీసీబీ, డీసీఎంఎస్‌లను సైతం ప్రస్తుతం యథాతథాంగా కొనసాగించనున్నారు. కొత్త జిల్లాల స్వరూపం ఇలా ఉండనుంది.

    సంగారెడ్డి జిల్లా:
    సంగారెడ్డి, కంది(కొత్తమండలం), కొండాపూర్, సదాశివపేట, పటాన్‌చెరు, అమీన్‌పూర్‌(కొత్తమండలం), ఆర్‌సీపురం, పుల్కల్, జిన్నారం, గుమ్మడిదల(కొత్తమండలం), హత్నూర, ఆందోలు, నర్సాపూర్‌, కల్హేర్, కంగ్టి, నారాయణఖేడ్, సిర్గాపూర్‌(కొత్తమండలం), మనూరు, రేగోడ్, నాగలగిద్ద(కొత్తమండలం), మునిపల్లి, కోహీర్, రాయికోడ్, ఝరాసంగం, న్యాల్‌కల్, జహీరాబాద్, మొగుడంపల్లి(కొత్తమండలం).
    రెవెన్యూ డివిజన్‌: జహీరాబాద్‌, నారాయణఖేడ్‌

    సిద్దిపేట జిల్లా:
    దౌల్తాబాద్, గజ్వేల్, జగదేవ్‌పూర్, కొండపాక, ములుగు, వర్గల్, చేర్యాల్, మద్దూరు, దుబ్బాక, మిర్‌దొడ్డి, తొగుట, చిన్నకోడూరు, నంగనూరు, సిద్దిపేట, నారాయణరావుపేట(కొత్తమండలం), కోహెడ, ఉస్నాబాద్, ముస్తాబాద్, ఇల్లంతకుంట.
    రెవెన్యూ డివిజనల్‌లు: సిద్దిపేట, గజ్వేల్‌

    మెదక్‌ జిల్లా:
    మెదక్, హవేలిఘనపురం(కొత్తమండలం) పాపన్నపేట, రామాయంపేట, పెద్దశంకరంపేట, చిన్నశంకరంపేట, టేక్మాల్, నాగిరెడ్డిపేట, కొల్చారం, అల్లాదుర్గం, కౌడిపల్లి, చేగుంట, శివ్వంపేట, వెల్దుర్తి, తూప్రాన్,
    రెవెన్యూ డివిజన్‌: మెదక్‌, తూప్రాన్‌

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement