వాషింగ్టన్:న్యూ ఓర్లీన్స్‌లో జరిగిన ట్రక్కు దాడిపై అమెరికాకు కాబోయే అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ స్పందించారు. ప్రస్తుతం అధికారంలో ఉన్న డెమొక్రాట్ల విధానాల వల్లే అమెరికాలో ఇలాంటి దాడులు జరుగుతున్నాయని విమర్శించారు. ఈ మేరకు శుక్రవారం(జనవరి3) ట్రంప్ ఎక్స్(ట్విటర్)లో ఓ పోస్టు చేశారు.
సరిహద్దులు తెరిచి పెట్టడం వల్లే ఇలాంటి ఘటనలు జరుగుతున్నాయని మండిపడ్డారు.బలహీన,అసమర్థ నాయకత్వమే ఇందుకు కారణమన్నారు.డిపార్ట్‌మెంట్ ఆఫ్ జస్టిస్(డీవోజే) ఎఫ్‌బీఐ,డెమోక్రట్ ప్రభుత్వం,న్యాయవాదులు తమ విధిని సక్రమంగా నిర్వహించక పోవడం వల్లే ఇలాంటి దాడులు జరుగుతున్నాయని ఆరోపించారు.
Our Country is a disaster, a laughing stock all over the World! This is what happens when you have OPEN BORDERS, with weak, ineffective, and virtually nonexistent leadership. The DOJ, FBI, and Democrat state and local prosecutors have not done their job. They are incompetent and…
— Donald J. Trump (@realDonaldTrump) January 3, 2025
అమెరికా విఫలమైందని అంతా మాట్లాడుకుంటున్నారన్నారు. న్యూ ఓర్లీన్స్‌లో బోర్బన్ వీధిలో నూతన సంవత్సర వేడుకలు జరుగుతుండగా అమెరికా ఆర్మీ మాజీ ఉద్యోగి జబ్బార్ ట్రక్కుతో జనంపైకి దూసుకువచ్చిన ఘటనలో 15 మంది మృతి చెందిన విషయం తెలిసిందే. ఈ దాడి తర్వాత పోలీసులు జరిపిన కాల్పుల్లో జబ్బార్ మృతి చెందాడు.
ఈ కేసులో ఫెడరల్ బ్యూరో ఆఫ్ ఇన్వెస్టిగేషన్ ఎఫ్‌బీఐ దర్యాప్తు ముమ్మరం చేసింది. జబ్బార్ విదేశీ సంస్థల సహకారం లేకుండా ఒంటరిగానే ట్రక్కు దాడి చేశాడని ఎఫ్‌బీఐ తేల్చింది.అయితే ఐసిస్ ఉగ్రవాద సంస్థ నుంచి జబ్బార్ స్ఫూర్తి పొందాడని ఎఫ్‌బీఐ తెలిపింది.
ఇదీ చదవండి: ట్రక్కు దాడి.. ఎఫ్‌బీఐ కీలక ప్రకటన
Comments
Please login to add a commentAdd a comment