Ugadi 2022 Offer: TSRTC Providing Free Ride to Senior Citizens - Sakshi
Sakshi News home page

TSRTC: టీఎస్‌ఆర్టీసీ పండగ ఆఫర్లు

Published Thu, Mar 31 2022 6:04 PM | Last Updated on Fri, Apr 1 2022 8:04 AM

TSRTC MD VC Sajjanar Announces Ugadi Offer For Old Age People - Sakshi

సాక్షి, హైదరాబాద్‌: ఉగాది, శ్రీరామనవమిలను పురస్కరించుకుని ప్రయాణికులకు ఆర్టీసీ కొన్ని రాయితీలు ప్రకటించింది. 65 ఏళ్ల వయసుపైబడ్డ వారు ఉగాది రోజున రాష్ట్రవ్యాప్తంగా అన్ని రకాల ఆర్టీసీ బస్సుల్లో ఉచితంగా ప్రయాణించొచ్చని ఎండీ సజ్జనార్‌ ఓ ప్రకటనలో తెలిపారు. అయితే కండక్టర్‌కు వయసు ధ్రువీకరణ పత్రాన్ని చూపాల్సి ఉంటుంది.

అలాగే ఆర్టీసీ కార్గో పార్శిల్‌ సర్వీసుకు సంబంధించి, ఐదు కిలోల బరువున్న పార్శిల్‌ బుకింగ్‌ చార్జీలపై 25 శాతం రాయితీ ఇవ్వనున్నారు. ఉగాది నుంచి శ్రీరామనవమి వరకు ఇది అమలులో ఉంటుందని పేర్కొన్నారు. ఇక విమానాశ్రయానికి తిరుగుతున్న పుష్ప క్‌ బస్సుల్లో అప్‌ అండ్‌ డౌన్‌ టికెట్లు తీసుకుంటే తిరుగు ప్రయాణ చార్జీలో 20 శాతం రాయితీ ఇవ్వనున్నట్టు పేర్కొన్నారు. ఈ రాయితీని పది రోజులలోపు ఎపుడైనా వాడుకోవచ్చని పేర్కొన్నారు.  

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement