TSRTC Gift To 2 Newborn Babies Born On Bus: తెలంగాణ రాష్ట్ర రోడ్డు రవాణా సంస్థ (టీఎస్‌ఆర్టీసీ) బస్సులలో ఇటీవల జన్మించిన ఇద్దరు ఆడపిల్లలు తమ ‘బర్త్‌డే’ కానుకగా సంస్థ నుంచి ఉచిత జీవితకాల పాస్‌లను పొందుతున్నారు. నాగర్‌కర్నూల్ డిపోకు చెందిన బస్సులో పెద్దకొత్తపల్లి గ్రామ సమీపంలో నవంబర్ 30వ తేదీన మొదటి ఆడపిల్ల జన్మించగా, డిసెంబరు 7వ తేదీ మధ్యాహ్నం సిద్దిపేట సమీపంలో ఆసిఫాబాద్ డిపోకు చెందిన బస్సులో మరొక మహిళ కుమార్తెకు జన్మనిచ్చింది.
చదవండి: (మంత్రి హోదాలో ఉండి.. సాదాసీదాగా కూతురు పెళ్లి)
ఈ ఇద్దరు మహిళలు ఊహించని విధంగా వారి వారి గమ్యస్థానాలకు చేరుకునేలోపే ప్రసవించడం జరిగింది. టీఎస్‌ఆర్టీసీ సిబ్బంది తోటి ప్రయాణీకుల సహాయంతో వారు పండంటి ఆడబిడ్డలకు జన్మనిచ్చారు. అనంతరం టీఎస్‌ఆర్‌టీసీ సిబ్బంది ఆరోగ్య శాఖ అధికారులతో సమన్వయం చేసుకుని తల్లులు, నవజాత శిశువులను తదుపరి చికిత్స కోసం 108 అంబులెన్స్‌లో సమీపంలోని ప్రభుత్వ ఆసుపత్రులకు తరలించారు. వారు ప్రస్తుతం ఆరోగ్యంగా ఉన్నారు.
They are born frequent travellers of @TSRTCHQ!
— V.C Sajjanar IPS MD TSRTC Office (@tsrtcmdoffice) December 8, 2021
Two baby girls, born on the moving TSRTC buses recently, gets free lifetime passes from the corporation as their ‘birthday’ gifts. @puvvada_ajay @Govardhan_MLA #Hyderabad pic.twitter.com/yfMkrg14BO
టీఎస్‌ఆర్టీసీ సిబ్బంది, ప్రయాణికుల సత్వర స్పందనను టీఎస్‌ఆర్టీసీ ఎండీ వీసీ సజ్జనార్ అభినందించారు. బస్సులో జన్మించిన వారికి టీఎస్‌ఆర్టీసీ బస్సులలో ప్రయాణానికి ఉచిత జీవితకాల పాస్‌లను అందించడం సంతోషంగా ఉందన్నారు.
Comments
Please login to add a commentAdd a comment