newly born child
-
పసికందును పట్టాలపై పడేసిండ్రు
-
గుంటూరు జీజీహెచ్ లో శిశువు కిడ్నాప్
-
TSRTC: సజ్జనార్ కీలక నిర్ణయం.. వారికి జీవితాంతం బస్సుల్లో ఫ్రీ
TSRTC Gift To 2 Newborn Babies Born On Bus: తెలంగాణ రాష్ట్ర రోడ్డు రవాణా సంస్థ (టీఎస్ఆర్టీసీ) బస్సులలో ఇటీవల జన్మించిన ఇద్దరు ఆడపిల్లలు తమ ‘బర్త్‌డే’ కానుకగా సంస్థ నుంచి ఉచిత జీవితకాల పాస్‌లను పొందుతున్నారు. నాగర్‌కర్నూల్ డిపోకు చెందిన బస్సులో పెద్దకొత్తపల్లి గ్రామ సమీపంలో నవంబర్ 30వ తేదీన మొదటి ఆడపిల్ల జన్మించగా, డిసెంబరు 7వ తేదీ మధ్యాహ్నం సిద్దిపేట సమీపంలో ఆసిఫాబాద్ డిపోకు చెందిన బస్సులో మరొక మహిళ కుమార్తెకు జన్మనిచ్చింది. చదవండి: (మంత్రి హోదాలో ఉండి.. సాదాసీదాగా కూతురు పెళ్లి) ఈ ఇద్దరు మహిళలు ఊహించని విధంగా వారి వారి గమ్యస్థానాలకు చేరుకునేలోపే ప్రసవించడం జరిగింది. టీఎస్ఆర్టీసీ సిబ్బంది తోటి ప్రయాణీకుల సహాయంతో వారు పండంటి ఆడబిడ్డలకు జన్మనిచ్చారు. అనంతరం టీఎస్ఆర్టీసీ సిబ్బంది ఆరోగ్య శాఖ అధికారులతో సమన్వయం చేసుకుని తల్లులు, నవజాత శిశువులను తదుపరి చికిత్స కోసం 108 అంబులెన్స్‌లో సమీపంలోని ప్రభుత్వ ఆసుపత్రులకు తరలించారు. వారు ప్రస్తుతం ఆరోగ్యంగా ఉన్నారు. They are born frequent travellers of @TSRTCHQ! Two baby girls, born on the moving TSRTC buses recently, gets free lifetime passes from the corporation as their ‘birthday’ gifts. @puvvada_ajay @Govardhan_MLA #Hyderabad pic.twitter.com/yfMkrg14BO — V.C Sajjanar IPS MD TSRTC Office (@tsrtcmdoffice) December 8, 2021 టీఎస్ఆర్టీసీ సిబ్బంది, ప్రయాణికుల సత్వర స్పందనను టీఎస్ఆర్టీసీ ఎండీ వీసీ సజ్జనార్ అభినందించారు. బస్సులో జన్మించిన వారికి టీఎస్ఆర్టీసీ బస్సులలో ప్రయాణానికి ఉచిత జీవితకాల పాస్‌లను అందించడం సంతోషంగా ఉందన్నారు. చదవండి: (ప్రధాని మోదీకి సీఎం కేసీఆర్ లేఖ) -
కొడుకుతో హర్భజన్ ఫ్యామిలీ.. ఫోటోలు వైరల్
టీమిండియా క్రికెటర్ హర్భజన్ సింగ్ ఇటీవల రెండోసారి తండ్రి అయిన విషయం తెలిసిందే. హర్భజన్ భార్య గీతా బస్రా పండంటి మగబిడ్డకు జన్మనిచ్చింది. ఈ విషయాన్ని భజ్జీ సోషల్ మీడియా ద్వారా అభిమానులతో పంచుకున్నాడు. ఈ సందర్భంగా సెలబ్రిటీలు, అభిమానులు ఈ జంటకు శుభాకాంక్షలు తెలిపారు. తాజాగా హర్భజన్ సింగ్, గీతా బాస్రా జంట తమ ముద్దుల కొడుకుతో కలిసి బుధవారం మధ్యాహ్నం ఇంటికి వెళ్తుండగా కెమెరా కంటికి చిక్కారు. ముంబై ఆసుపత్రి నుంచి వస్తుండగా నవజాత శిశువు, కుమార్తె హినయాతో కలిసి కుటుంబమంతా చిరునవ్వులతో ఫోటోగ్రాఫర్లకు ఫోజులిచ్చారు. కాగా హర్భజన్, గీతా బస్రా దంపతులకు 2016లో వీరికి సంతానంగా ఓ పాప జన్మించింది. ఇప్పుడు కొడుకు పుట్టాడు. ఈ మేరకు మైక్రో బ్లాగింగ్ సైట్ ట్విట్టర్లో భావోద్వేగంతో ఓ సందేశాన్ని హర్భజన్ షేర్ చేశాడు. ‘మేం పట్టుకోవడానికి మరో చిన్ని చేతులు మాకు అందాయి. బుజ్జాయి ఇంట్లోకి రావడంతో మేం చాలా సంతోషంగా ఉన్నాము. మా జీవితంలో అద్భుతమైన బహుమతి పొందాం. మా మనసులో ఆనందంతో బరువెక్కాయి. మా జీవితం ఇప్పుడు పూర్తి అయిన భావన కలుగుతోంది. గీతా బస్రా, బాబు ఆరోగ్యంగా ఉన్నారు. మాపై ప్రేమ చూపుతూ, మద్దతుగా నిలుస్తున్న శ్రేయోభిలాషులు, అభిమానులకు ధన్యవాదాలు అని ఆఫ్ స్పిన్నర్ హర్భజన్ సింగ్ ట్వీట్ చేశాడు. -
మూడు రోజులకే అనాథగా మారిన పసిపాప
తల్లి పొత్తిళ్లలో.. వెచ్చని కౌగిలితో.. ముర్రు పాలు తాగుతూ.. అప్పుడే తెరిచిన కళ్లతో తన అమ్మ లోగిళ్లలోని లోకాన్ని వీక్షిస్తూ.. తల్లి జో కొడుతుంటే హాయిగా నిద్రించాల్సి ఆడ శిశువు భూమి పైకి వచ్చి మూడు రోజులకే అనాథగా మారింది. తన ఆకలి తీర్చే దిక్కు లేక.. అమ్మ కౌగిలికి దూరమై.. క్యారు మంటోంది. నిబంధనల ఆటంకంతో వైద్యానికి దూరమై.. ఎవరి అక్కున చేరక.. ఆస్పత్రి గదిలోని కాంతుల వెలుగులో తల్లడిల్లుతున్న ఓ చిన్నారి దీనగాథ జిల్లాలో ఆలస్యంగా వెలుగు చూసింది. సాక్షి, కనిగిరి: కనిగిరి పట్టణంలోని గార్లపేట రోడ్లులో గల ఓ ప్రవేటు ఆస్పత్రిలో ఓ అవివాహిత మూడు రోజుల కిందట ఓ శిశువుకు జన్మనిచ్చింది. తెలిసి చేసిన ‘పాప’మా.. లేక తెలియక చేసిన ‘పాప’మా.. లేక ఆడపిల్ల కావడంతో వదలించుకునేందుకు చేసిన మహా పాపమా తెలియదు కాని.. ఆ బిడ్డ తల్లి గర్భంలో నుంచి బయటకు వచ్చిన వెంటనే ఆ తల్లికి దూరమైంది. ఆస్పత్రిలోని ఓ ఆయా ఆ బిడ్డను స్థానిక ఓ ప్రవేటు చిన్నపిల్లల ఆస్పత్రికి తరలించింది. తల్లి దండ్రులు ఎవరు లేరని వదిలేసి వెళ్లారని వైద్యం చేయాలని వైద్యునికి తెలిపింది. ఇంతలో విషయం తెలుసుకున్న సంతానం లేని బాషా దంపతులు ఆ పసి పాపను దత్తత తీసుకునేందుకు ముందుకు వచ్చారు. చిన్న పిల్లల వైద్యుడు శిశువును పరీక్షించి.. పాపలో ప్రాణం ఉంది కాని పూర్తి అవయవాలు రూపుదిద్దుకోలేదని, ఒంగోలులోని పెద్ద ఆస్పత్రికి తీసుకెళ్లాలని సూచించారు. ఆస్పత్రి సిబ్బంది సహకారంతో దత్తత తీసుకోవాలనుకున్న దంపతులు ఆ శిశువును ఒంగోలుకు తీసుకెళ్లారు. అయితే అక్కడ ప్రవేటు ఆస్పత్రుల్లో శిశువును చూపించారు. శిశువును పరీక్షించిన వైద్యులు రూ.5లక్షల వరకు ఖర్చు అవుతుందని తెలిపారన్నారు. ఆరోగ్య శ్రీ లో చికిత్స చేయాలంటే తల్లి దండ్రుల పేర్లు నమోదుతో పాటు, పలు నిబంధనలు వర్తిస్తాయని చెప్పినట్లు బాషా దంపతులు తెలిపారు. దీంతో మధ్య తరగతి కుటుంబానికి చెందిన బాషా దంపతులు అంత ఖర్చు పెట్టలేమని ఆదివారం రాత్రి తిరిగి ఒంగోలు నుంచి కనిగిరికి తీసుకోచ్చారు. వారికి శిశువును అప్పగించిన చిన్నపిల్లల ప్రవేటు వైద్యశాలలోనే చేర్పించారు. బరువు కూడా తక్కువగా ఉన్న ఆ శిశువు ప్రస్తుతం వెంటిలేటర్‌పై ప్రాణంతో ఉందని డాక్టర్ సుబ్బారెడ్డి తెలిపారు. నిజంగా పురుడు పోశారా.. అబార్షన్ చేశారా? అసలు శిశువు జనం అక్రమమా.. సక్రమమా అనేది అటుంచితే.. పట్టణంలోని గార్లపేట రోడ్డులో గల ఓ ప్రవేటు వైద్యశాలలో నుంచి బయటకు వచ్చింది. అయితే అక్కడ ఆ శిశువు తల్లికి ఆబార్షన్ చేసి బిడ్డను బయటకు తీశారా.. లేకా పూర్తి నెలలు నిండిన తర్వాత పురుడు పోశారు. అనేది ప్రశ్నార్ధకం. నిజంగా బేబి పరిపూర్ణంగా లేక పోవడానికి కారణం ఏమిటి అనేది కూడా చర్చ జరుగుతోంది. తల్లి అవివాహితై.. రహస్య కాన్పు అయినా పరిపూర్ణంగా అవయవాలు లేక పోవడంతో పలు అనుమానాలు వెల్లువెత్తుతున్నాయి. ఆ తల్లిది సీతరామపురం.. అందిన సమాచారం మేరకు ఆ శిశువుకు జన్మనిచ్చిన తల్లి హెచ్ఎం పాడు మండలం సీతారామపురం గ్రామానికి చెందిన అవివాహితగా తెలుస్తోంది. దీనిపై ఐసీడీఎస్ సీడీపీఓ లక్ష్మీ ప్రసన్నను సాక్షి వివరణ కోరగా విషయం తన దృష్టికి వచ్చిందన్నారు. చిన్న పిల్లల ఆస్పత్రిలో పాపను తాము చూశామన్నారు. అశిశువుకు పురుడు పోసిన ఆస్పత్రికి వెళ్లి పూర్తి వివరాలు తెలుసుకుంటామన్నారు. నిబంధనల ప్రకారం ఆ శిశువును స్వాధీనం చేసుకుంటామని వెల్లడించారు. ఐసీడీఎస్ అధికారుల ఆధీనంలోకి శిశువు ఆస్పత్రిలో వదిలి వేసిన నవజాత శిశువు(ఆడ)ను ఐసీడీఎస్ అధికారులు స్వాధీనం చేసుకున్నారు. అనంతరం సీడీపీఓ సీడీపీఓ లక్ష్మీప్రసన్న పోలీసులకు ఫిర్యాదు చేశారు. ప్రస్తుతం చిన్న పిల్లల ఆస్పత్రిలో చికిత్స పొందుతున్న అనాథ శిశువుకు అయ్యే వైద్య ఖర్చును వైఎస్సార్సీపీ రాష్ట్ర మైనార్టీసెల్ ప్రధాన కార్యదర్శి ఎస్కే అబ్దుల్ గఫార్ భరాయిస్తానని తెలిపినట్లు సీడీపీఓ లక్ష్మీ ప్రసన్న తెలిపారు. ప్రస్తుతం పాప పరిస్థితి బాగా లేదని.. వెంటిలేషన్‌పై ఉందన్నారు. కనిగిరి ఆస్పత్రిలోనే ప్రాథమిక చికిత్సలు చేయించి.. వైద్యుల పర్యవేక్షణలో పెద్పాస్పత్రులకు తీసుకెళ్తామని సీడీపీఓ తెలిపారు. -
కుమారుడిని చూడకుండానే పరలోకాలకు..
కుమారుడు పుట్టాడన్న ఆనందాన్ని దేవుడు ఆ యువకుడికి లేకుండా చేశాడు. కుమారుడిని చూసేందుకని బయల్దేరిన అతడిని రోడ్డు ప్రమాద రూపంలో మృత్యువు బలిగొంది. కుమారుడిని చూడకుండానే పరలోకాలకు చేరిన హృదయ విదారక ఘటన బ్రహ్మసముద్రం మండలం ముప్పులకుంటలో జరిగింది. సాక్షి, కళ్యాణదుర్గం రూరల్: బ్రహ్మసముద్రం మండలం ముప్పులకుంటకు చెందిన బసవరాజు (25) స్టూడియో నిర్వహిస్తూ జీవనం సాగించేవాడు. తండ్రి హనుమంతు చిన్నప్పుడే మృతి చెందగా తల్లి శివమ్మకు చేదోడు వాదోడుగా ఉండేవాడు. ఏడాదిక్రితం బెళుగుప్ప మండల కేంద్రానికి చెందిన మహేశ్వరితో వివాహం జరిగింది. గత నెల 23వ తేదీ రాత్రి అత్తగారింటి నుంచి ‘నీ భార్యకు పురిటి నొప్పులు వచ్చాయి...అర్జంటుగా బెళుగుప్ప ఆస్పత్రికి రా..’ అంటూ ఫోన్ చేశారు. ఉన్నఫలంగా బసవరాజు ద్విచక్రవాహనంలో ముప్పులకుంట నుంచి బెళుగుప్పకు బయల్దేరాడు. మార్గమధ్యంలో కళ్యాణదుర్గం మండలం చాపిరి వద్ద అదుపు తప్పి కిందపడ్డాడు. తలకు బలమైన గాయమైంది. స్థానికులు గుర్తించి వెంటనే కళ్యాణదుర్గం ప్రభుత్వాస్పత్రికి తరలించారు. గాయాలతో కళ్యాణ దుర్గం ఆసుపత్రిలో బసవరాజు, బెళుగుప్ప ఆస్పత్రిలో పురిటినొప్పులతో భార్య ఉండటంతో కుటుంబ సభ్యుల బాధ వర్ణానాతీతంగా మారింది. ఆ మరుసటి రోజే మహేశ్వరి పండంటి మగబిడ్డకు జన్మనిచ్చింది. ఆనందం.. అంతలోనే విషాదం తనకు కుమారుడు పుట్టాడన్న సమాచారం బంధువుల ద్వారా తెలుసుకున్న బసవరాజు ఆనందానికి అవధుల్లేకుండా పోయాయి. అయితే అక్కడే దేవుడు ఆ కుటుంబంపై చిన్నచూపు చూశాడు. బసవరాజు తలకు బలమైన గాయం కావడంతో మెరుగైన వైద్యం కోసం వెంటనే బెంగుళూరుకు తీసుకెళ్లాలని వైద్యులు చెప్పారు. ఈ మేరకు బెంగుళూరుకు తీసుకెళ్లి ఆస్పత్రిలో చేర్చారు. పరిస్థితి విషమించడంతో శనివారం బసవరాజు కన్నుమూశాడు. మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం కళ్యాణదుర్గం ఆస్పత్రికి తీసుకువచ్చారు. విషయం తెలుసుకున్న గ్రామస్తులు, మిత్రులు, బంధువులు ప్రభుత్వాస్పత్రికి తరలివచ్చారు. కుమారుడు లేడన్న చేదు వార్తను విన్న బసవరాజు తల్లి శివమ్మ కన్నీరుమున్నీరుగా విలపించడం అందరినీ కలిచివేసింది. -
పసికందు దొరికింది
సాక్షి, హైదరాబాద్: సుల్తాన్‌బజార్ ప్రభుత్వ ప్రసూతి ఆస్పత్రి(కోఠి మెటర్నిటీ హాస్పిటల్) నుంచి సోమవారం అపహరణకు గురైన పసికందు ఆచూకీ లభించింది. దాదాపు 28 గంటల పాటు నిర్విరామ గాలింపు చేపట్టిన ప్రత్యేక బృందాలు మంగళవారం సాయంత్రం బీదర్ ప్రభుత్వాసుపత్రిలో చిన్నారిని గుర్తించాయి. ప్రస్తుతం చిన్నారికి ఐసీయూలో చికిత్స అందిస్తున్నారు. శిశువు పరిస్థితి నిలకడగా ఉందని, బుధవారం ఉదయానికి హైదరాబాద్ తీసుకువస్తామని అధికారులు పేర్కొన్నారు. పరారీలో ఉన్న నిందితురాలి కోసం ప్రత్యేక బృందాలు గాలిస్తున్నాయి. ఆయాగా పరిచయం.. అపహరణ రంగారెడ్డి జిల్లా మంచాల మండలం ఎల్లమ్మ తండాకు చెందిన సుబావతి విజయ కాన్పు కోసం గత నెల 21న సుల్తాన్‌బజార్ ప్రసూతి ఆస్పత్రిలో చేరింది. 27న వైద్యులు సిజేరియన్ ఆపరేషన్ చేయడంతో ఆడబిడ్డకు జన్మనిచ్చింది. సోమవారం మధ్యాహ్నం 11 గంటల ప్రాంతంలో విజయ వద్దకు వచ్చిన ఓ గుర్తుతెలియని మహిళ ఆయాగా పరిచయం చేసుకుంది. చిన్నారికి వ్యాక్సినేషన్ చేయించాలని చెప్పి తనతో తీసుకెళ్లింది. ఆ మహిళ ఎంతకూ బిడ్డను తీసుకురాకపోవడంతో విజయకు అనుమానం వచ్చి కుటుంబీకులకు విషయం చెప్పింది. వారు సుల్తాన్‌బజార్ పోలీసులకు ఫిర్యాదు చేశారు. కేసు నమోదు చేసుకున్న తర్వాత దాదాపు ఒంటి గంట ప్రాంతంలో రెండు ప్రత్యేక బృందాలు ప్రాథమికంగా ఆస్పత్రిలోని సీసీ కెమెరాలను పరిశీలించి అనుమానితురాలిని గుర్తించాయి. చిన్నారిని తీసుకెళ్లిన మహిళ కదలికల కోసం ఆస్పత్రి చుట్టుపక్కల ఉన్న 200 సీసీ కెమెరాల ఫీడ్‌ను అధ్యయనం చేశాయి. ఈ నేపథ్యంలోనే సదరు మహిళ చిన్నారితోపాటు ఆటోలో ఎంజీబీఎస్‌కు వెళ్లినట్లు తేలింది. సీసీ కెమెరాల ఆధారంగా.. దీంతో అక్కడకు చేరుకున్న పోలీసులు మరో రెండు గంటల పాటు బస్టాండ్‌లోని సీసీ కెమెరాల ఫీడ్‌ను పరిశీలించారు. సదరు కిడ్నాపర్ చిన్నారితోపాటు మధ్యాహ్నం ఒంటి గంట ప్రాంతంలో ఓ బస్సు ఎక్కుతున్న దృశ్యాలను సాయంత్రం 4 గంటల ప్రాంతంలో గుర్తించగలిగారు. ఆ బస్సు ఎక్కడకు వెళ్తుందో తెలుసుకోవడంపై పోలీసులు దృష్టి పెట్టారు. ఆర్టీసీ అధికారుల సాయంతో అది బీదర్ బస్సుగా నిర్థారించిన పోలీసులు దాని నంబర్ కోసం ప్రయత్నించారు. వీడియోల్లో స్పష్టంగా లేకపోవడంతో స్టేషన్ మాస్టర్ సాయంతో బస్సు నంబర్‌తో పాటు దాని డ్రైవర్ సెల్ నంబర్ సైతం సేకరించగలిగారు. సుల్తాన్‌బజార్ పోలీసులు ఆ డ్రైవర్‌కు కాల్ చేయగా.. సదరు మహిళ చిన్నారితోపాటు బీదర్ బస్సు స్టేషన్లో సాయంత్రం 4.30 గంటల ప్రాంతంలో దిగిందని, తాము ప్రస్తుతం తిరుగు ప్రయాణంలో ఉన్నామని చెప్పాడు. బీదర్‌కు ప్రత్యేక బృందాలు.. ఈ పరిణామాల నేపథ్యంలో ఈస్ట్‌జోన్ డీసీపీ ఎం.రమేశ్ బీదర్ పోలీసులకు సమాచారం ఇచ్చారు. ఇక్కడి నుంచీ మూడు ప్రత్యేక బృందాలు బీదర్ బయలుదేరాయి. సోమవారం సాయంత్రం 5.30 గంటలకు పాప ఫొటోలతో పాటు అనుమానితురాలి సీసీ ఫుటేజ్ తదితరాలను బీదర్ పోలీసులకు పంపారు. వీటి ఆధారంగా బీదర్ పోలీసులు అక్కడి బస్టాండ్ నుంచి సెర్చ్ ఆపరేషన్ చేపట్టారు. అర్ధరాత్రికి నగరం నుంచి బయలుదేరిన పోలీసు, టాస్క్‌ఫోర్స్ బృందాలు బీదర్ చేరుకున్నాయి. అప్పటికే బీదర్ పోలీసులు సదరు మహిళ చిన్నారితోపాటు బస్టాండ్ పక్కనే ఉన్న మురికివాడలోకి వెళ్లినట్లు సమాచారం సేకరించారు. బీదర్ పోలీసులతో కలసి ప్రత్యేక బృందాలు ఆ మురికివాడలో కార్డన్ సెర్చ్ ఆపరేషన్ చేపట్టాయి. తమ వద్ద ఉన్న చిన్నారి, అనుమానితురాలి ఫొటోలను ప్రజలకు చూపిస్తూ సమాచారం సేకరించాయి. మంగళవారం ఉదయం 8 గంటల వరకు ఈ తనిఖీలు కొనసాగాయి. అయితే కిడ్నాపర్ చిన్నారితోపాటు ఆ మురికివాడ నుంచి తప్పించుకుంది. ఆటో డ్రైవర్ ఇచ్చిన సమాచారంతో.. తదుపరి చర్యల్లో భాగంగా మురికివాడ చుట్టుపక్కల ప్రాంతాల్లోని సీసీ కెమెరాల్లో ఫీడ్‌ను పరిశీలించారు. ఓ సీసీ కెమెరాలో అనుమానాస్పదంగా మహిళ కదలికలు రికార్డయ్యాయి. ఆ ఫీడ్‌ను క్షుణ్ణంగా పరిశీలించిన పోలీసులు ఆమే కిడ్నాపర్ అని, చిన్నారితోపాటు ఓ ఆటో ఎక్కుతున్నట్లు గుర్తించారు. మరికొన్ని సీసీ కెమెరాల పరిశీలించిన అనంతరం సదరు మహిళ మూడు ఆటోలు మారినట్లు తేల్చారు. ఆటో నంబర్లు సరిగ్గా కనిపించకపోవడంతో సాంకేతికంగా ప్రయత్నించారు. చివరకు ఐదు ఆటోలను గుర్తించి వాటి డ్రైవర్లను విచారించారు. ఓ ఆటో డ్రైవర్ మంగళవారం మధ్యాహ్నం 12.45 గంటల ప్రాంతంలో తాను ఓ మహిళను, చిన్నారిని బీదర్ ప్రభుత్వాసుపత్రి సమీపంలో వదిలినట్లు చెప్పాడు. దీంతో అక్కడకు వెళ్లిన పోలీసులకు.. ఓ మహిళ ఒంటి గంటల ప్రాంతంలో పసికందుతో వచ్చిందని, చిన్నారిని వదిలి పారిపోయిందని ఆస్పత్రి వర్గాలు చెప్పాయి. తాము పసికందును ఐసీయూకు తరలించి చికిత్స అందిస్తున్నామని తెలిపాయి. ఫొటోలతో సరిపోల్చి.. తల్లికి చూపించి.. అక్కడకు చేరుకున్న సుల్తాన్‌బజార్ ఏసీపీ చేతన ఐసీయూలో ఉన్న చిన్నారిని ఫొటోలతో పోల్చి కిడ్నాపైన శిశువుగా గుర్తించారు. వీడియో కాల్ ద్వారా నగరంలో ఉన్న తల్లి విజయకు చిన్నారిని చూపించి ఖరారు చేసుకున్నారు. ప్రసుత్తం చిన్నారి అక్కడే చికిత్స పొంkదుతుండటంతో తల్లి విజయను సైతం అక్కడికి తీసుకువెళ్లారు. బుధవారం తల్లీబిడ్డల్ని నగరానికి తీసుకురానున్నారు. మరోవైపు పరారైన కిడ్నాపర్ కోసం ప్రత్యేక బృందాలు గాలిస్తున్నాయి. ఆమె బీదర్‌కు చెందినదా లేదా అక్కడ బంధువులు ఉన్న మహిళై ఉండవచ్చని అనుమానిస్తున్నారు. సుల్తాన్‌బజార్ ఆస్పత్రిలో లేదా చుట్టు పక్కల ఒకటి రెండు రోజులు కాపుకాసి ఉండచ్చని అనుమానిస్తూ ఆ కోణంలో దర్యాప్తు చేస్తున్నారు -
అయ్యో పాపం
- చిత్తూరులో పురిటిబిడ్డ కలకలం! - కుక్క తీసుకొచ్చి రోడ్డుపై పడేసిన వైనం - భూణహత్యా..? మృతశిశువా..? - ముమ్మరంగా దర్యాప్తు చేస్తున్న పోలీసులు చిత్తూరు (అర్బన్): అప్పుడే తల్లిపేగు తెంచుకుని పుట్టినట్లు.. బొడ్డుపై రక్తపు మరకలు ఆరకుండా.. పండంటి మగబిడ్డ.. ఏమయ్యిందో ఏమో.. ఓ కుక్క ఈ పసిగుడ్డును నోటికి కరుచుకుని వీధు ల్లో తిరుగుతూ కనిపించింది. స్థానికులు గదమాయించడంతో బిడ్డను పడేసి వెళ్లిపోయింది. చిత్తూరు నగరంలో మంగళవారం ఈ సంఘటన చూసిన ప్రజలు చలించిపోయారు. చిత్తూరు నగరంలోని సుందరయ్యవీధిలో ఓ పసికందును వీధి కుక్క నోటి తో పట్టుకుని పరుగెడుతూ కనిపిం చింది. అప్పటికే శిశువు శరీరం నుంచి రక్తం ధారలా కారుతోంది. చలించిపోయిన స్థానికులు కుక్కను బెదిరించడంతో అది శిశువును రోడ్డుపై వదిలి వెళ్లిపోయింది. అప్పటికే పసికందు మృతి చెందాడు. విషయాన్ని స్థానికులు చిత్తూరు పోలీసులకు తెలియజేశారు. హుటాహుటిన సంఘటనా స్థలానికి చేరుకున్న డీఎస్పీ లక్ష్మీనాయుడు, ఎస్ఐ లక్ష్మీకాంత్లు సమీపంలో ఉన్న ఆస్పత్రి వైద్యుల్ని ప్రశ్నించారు. ఎలాంటి సమాచారం అందలేదు. శిశువు మృతదేహాన్ని పోస్టుమార్టం కోసం చిత్తూరు ప్రభుత్వాస్పత్రికి తరలించారు. కేసు దర్యాప్తులో ఉంది. ఎవరు చేశారో? ఈ సంఘటన పలు అనుమానాలకు దారితీస్తోంది. నిజంగా ఆస్పత్రిలో బిడ్డను ప్రసవిస్తే పడకపై ఉన్న శిశువును కుక్క ఎత్తుకెళ్లే ప్రసక్తేలేదు. అలా కుక్క ఎత్తుకెళ్లిందని అనుకున్నా శిశువు కనిపించలేదని తల్లిదండ్రులు పోలీసులకు ఫిర్యాదు చేసి ఉండాలి. కానీ ఎవరూ శిశువు కనిపించలేదని ఫిర్యాదు ఇవ్వలేదు. దీంతో ఇది భ్రూణహత్యగా పోలీసులు భావిస్తున్నారు. తల్లితనాన్ని వద్దనుకున్నవారెవరైనా ప్రైవేటు ఆస్పత్రిలో అబార్షన్ చేసుకుని మృతదేహాన్ని చెత్త కుప్పలో పడేశారా.. అనేదానిపై అనుమానం వ్యక్త మవుతోంది. అయితే శిశువును చూస్తే పూర్తిగా నెలలు నిండినట్లు కనిపిస్తోంది. నెలలు నిండిన శిశువును చేజేతులా ఎవరూ చంపుకోలేరు. కాన్పు జరిగే సమయంలో గర్భంలోనే బిడ్డ చనిపోయిందా అనే అనుమానం కూడా వ్యక్త మవుతోంది. అయితే ఈ సంఘటనలో ప్రైవేటు ఆస్పత్రి నిర్వాహకుల నిర్లక్ష్యం మాత్రం ప్రస్ఫూటంగా కనిపిస్తోంది. మృతశిశువైనా దాన్ని ఖననం చేయాలే తప్ప ఇలా రోడ్లపై, చెత్త కుప్పలో వేయడంపై సర్వత్రా విమర్శలు వస్తున్నాయి. చిత్తూరు నగరంలో అబార్షన్లకు పేరొందిన పలు ప్రైవేటు ఆస్పత్రుల నిర్వాహకుల్ని పోలీసులు ప్రశ్నిస్తున్నారు. పోస్టుమార్టం నివేదిక వాస్తవాలు ఆధారపడ్డాయని పోలీసులు చెబుతున్నారు.