
ఇక నుంచి అధికారులూ బస్సుల్లో ప్రయాణించి ఫీడ్‌బ్యాక్ తీసుకోవాలని సజ్జనార్ నిర్ణయించారు.
సాక్షి, హైదరాబాద్: ఆర్టీసీ బస్సులను మరింత మెరుగ్గా ఎలా నడపాలో మేధోమథనం చేసే అధికారులు ఒక్కరోజు కూడా బస్కెక్కే ప్రయత్నం చేయరు. ఆఫీసుకు–ఇంటికి–ఫీల్డ్‌కు కార్లలోనే తిరుగుతారు. ఇలా అయితే ప్రయాణికులు ఏం కోరుకుంటున్నారో ఎలా తెలుస్తుందన్న సందేహం ఆర్టీసీ ఎండీ సజ్జనార్‌కు వచ్చింది. ఈ మధ్య ఆయన బస్సుల్లోనే తిరుగుతూ ప్రయాణికులు, సిబ్బంది సాదకబాధకాలు తెలుసుకుంటున్నారు.
తాజాగా ఇక నుంచి అధికారులూ బస్సుల్లో ప్రయాణించి ఫీడ్‌బ్యాక్ తీసుకోవాలని సజ్జనార్ నిర్ణయించారు. పరిపాలన కార్యా లయాల్లో పనిచేస్తున్న అధికారులు, సిబ్బంది ప్రతి గురువారం బస్సుల్లోనే తిరగాలని ఆదేశించారు. గురువారాన్ని ‘బస్ డే’గా నామకరణం చేశారు. ఈ నెల 9 గురువారం నుంచి ఇది అమల్లోకి వస్తుందన్నారు.