రోడ్డు ప్రమాదాల సంఖ్య నానాటికీ పెరుగుతోంది. వాహనదారులు ఏ మాత్రం ఆజాగ్రత్తగా ఉన్నా ప్రాణాలు గాల్లో కలిసిపోతున్నాయి. వీటిని చూస్తుంటే వాహనాలతో రోడ్డెక్కాలంటే భయపడాల్సిన పరిస్థితి వస్తోంది. వీటికి అడ్డుకట్ట వేసేందుకు ప్రభుత్వాలు నిబంధనలను కఠినతరం చేయడంతో పాటు రోడ్డు ప్రమాదాలపై అవగాహన కార్యక్రమాలను కూడా నిర్వహిస్తున్నాయి. అయినప్పటికీ ప్రమాదాల సంఖ్య తగ్గుదలలో ఏ మాత్రం ఆశించిన ఫలితాలు రావడం లేదనే చెప్పాలి. తాజాగా వాహనదారులకు అవగాహన కల్పించేందుకు ఆర్టీసీ ఎండీ వీసీ సజ్జనార్ చేసిన ట్వీట్ వైరల్‌గా మారింది.
సీనియర్ ఐపీఎస్ అధికారి వీసీ సజ్జనార్ తెలంగాణ ఆర్టీసీ ఎండీగా బాధ్యతలు చేపట్టినప్పటి నుంచి తన మార్క్ పనితీరుతో దూసుకుపోతున్నారు. ఆర్టీసీ ఆదాయం పెంచే దిశగా అడుగులు వేయడంతో పాటు ఆర్టీసీలో ప్రయాణించే వారికి నాణ్యమైన సేవలు అందేలా చూస్తున్నారు. అంతేకాకుండా అప్పుడప్పుడు రోడ్డు ప్రమాదాలపై అవగాహన కల్పిస్తూ ప్రజల్లో అవగాహన కల్పిస్తుంటారు. తాజాగా ఆయన చేసిన ట్వీట్ నెట్టింట చక్కర్లు కొడుతోంది.
అందులో.. ట్రాఫిక్ జామ్‌లో ఓ యువతి లేన్‌ని క్రాస్ చేసి లారీ ముందుకు తన ద్విచక్ర వాహనాన్ని ఆపుతుంది. అంతలో వెనుక ఉన్న లారీ ముందుకు కదిలింది. ఈ క్రమంలో వాహనం బైక్‌ని ఢీకొట్టడంతో ఆమె లారీ కింద పడిపోతుంది. అయితే లారీ డ్రైవర్ మాత్రం తన వాహనాన్ని ఆపక ముందుకు నడిపిస్తాడు. అదృష్టవశాత్తు ఆ యువతి ప్రాణాపాయం నుంచి తృటిలో తప్పించుకుంటుంది. ఈ వీడియో షేర్ చేసిన ఆయన ద్విచక్రవాహనదారులకు రోడ్డపై ప్రయాణించేటప్పుడు జాగ్రత్తతో పాటు నిబంధనలు పాటించడం ఎంతైనా అవసరమని సూచించారు.
అందరికీ ఈమెలా అదృష్టం వరించదు!
ద్విచక్రవాహనదారులారా..! లేన్ డ్రైవింగ్ ను పాటించండి. రోడ్డుపై బైక్ తో అడ్డదిడ్డంగా వెళ్లి ప్రాణాల మీదకు తెచ్చుకోకండి. #RoadSafety pic.twitter.com/uq9gRIwubk
— V.C. Sajjanar, IPS (@SajjanarVC) February 22, 2023
Comments
Please login to add a commentAdd a comment