
ప్రస్తుతం తెలుగు రాష్ట్రాల్లో బెట్టింగ్ యాప్స్ వివాదం గట్టిగానే నడుస్తోంది. ఐపీఎస్ వీసీ సజ్జనార్ తన వంతు బాధ్యతగా బెట్టింగ్ మహమ్మారిపై యుద్ధం చేస్తున్నారు. ఈ క్రమంలోనే కొన్ని రోజుల క్రితం వైజాగ్ కి చెందిన లోకల్ బాయ్ నానిని అరెస్ట్ చేశారు. మోటో వ్లాగర్ భయ్యా సన్నీ యాదవ్ పై తెలంగాణ పోలీసులు కేసు నమోదు చేశారు. ప్రస్తుతం అతడి అందుబాటులో లేడు.
(ఇదీ చదవండి: వీసీ సజ్జనార్ హెచ్చరిక.. వీళ్లను తక్షణమే అన్‌ఫాలో చేయండి)
ఇదివరకే బెట్టింగ్ యాప్స్ ప్రమోట్ చేసిన పలువురు చోటామోటా ఇన్ఫ్లూయెన్సర్స్ బయటకొస్తున్నారు. టేస్టీ తేజ, సుప్రీత తదితరులు క్షమాపణలు చెప్పారు. ఇప్పుడు ఈ లిస్టులో టీవీ నటి రీతూ చౌదరి చేరింది.
'గతంలో నేను బెట్టింగ్ యాప్స్ ప్రమోట్ చేశాను. క్షమించండి. తెలిసో తెలియకో చేసిన నా తప్పుని క్షమిస్తారని అనుకుంటున్నాను. దయచేసి ఏ బెట్టింగ్ యాప్స్‌ని నమ్మకండి' అని రీతూ చౌదరి చెప్పుకొచ్చింది. అయితే సారీ చెప్పినంత మాత్రాన పోలీసులు వీళ్లని వదిలేస్తారా అనేది సందేహమే.
(ఇదీ చదవండి: మళ్లీ హాస్పిటల్ బెడ్ పై సమంత)
Comments
Please login to add a commentAdd a comment