
బుల్లితెర నటి, తెలుగమ్మాయి గౌరీ నాయుడు (Actress Gowri Naidu) గుడ్‌న్యూస్ చెప్పింది. పండంటి బిడ్డకు జన్మనిచ్చినట్లు పేర్కొంది. ఈ మేరకు సోషల్ మీడియాలో స్పెషల్ పోస్ట్ షేర్ చేసింది. 2018లో రాజశేఖరన్ అనే వ్యక్తిని పెళ్లాడింది. పలుమార్లు ప్రెగ్నెన్సీ కన్ఫామ్ అయినప్పటికీ ఆ గర్భం నిలవకుండానే పోయింది. దీంతో ఎంతో బాధపడ్డ ఆమెకు ఈసారి బిడ్డ పుట్టడంతో సంతోషంలో మునిగి తేలుతోంది.
ఉత్తమ విలన్‌గా అవార్డు
ఆడదే ఆధారం, మనసు-మమత, ప్రేమ ఎంత మధురం, మల్లి వంటి పలు సీరియల్స్‌లో నటించింది. ఉత్తమ విలన్‌గా అవార్డు కూడా అందుకుంది. కానీ కొంతకాలంగా గౌరీ బుల్లితెరకు దూరంగా ఉంటోంది. నిజానికి సీరియల్స్‌తోనే ఆగిపోకుండా సినిమాలు కూడా చేయాలన్నది ఆమె కోరిక. కానీ సీరియల్స్‌లో నటించే సమయంలో వరుసగా మూడుసార్లు గర్భస్రావం అయింది. ఆ బాధను తట్టుకోలేకపోయింది.
ముగ్గురు పిల్లలు దేవుడి దగ్గరే..
దానికి తోడు ఎంతమంది పిల్లలు? అన్న జనాల ప్రశ్నలకు సమాధానం చెప్పలేకపోయింది. చివరకు విసుగొచ్చి నాకు ముగ్గురు పిల్లలు.. కానీ ఆ ముగ్గురు దేవుడి దగ్గరే ఉన్నారంటూ అప్పట్లో ఎమోషనల్ వీడియో షేర్ చేసింది. వరుస అబార్షన్ల వల్ల తనకు విశ్రాంతి అవసరం అని వైద్యులు సూచించారు. దాంతో ఆమె కెరీర్‌కు బ్రేక్ ఇచ్చింది. ఈ క్రమంలో గతేడాది గర్భం దాల్చింది. అప్పటినుంచి బేబీ బంప్‌తో ఉన్న ఫోటోలను సోషల్ మీడియాలో తరచూ షేర్ చేస్తూ వస్తోంది. సీమంతం ఫోటోలను కూడా షేర్ చేసింది. ఇప్పుడు బేబీ జన్మించింది. మరి పాపను ఎప్పుడు చూపిస్తుందో చూడాలి!
Comments
Please login to add a commentAdd a comment