రేవ్‌ పార్టీకి వెళ్దామనుకున్నా.. ఎప్పుడు పిలుస్తారా అని ఎదురుచూశా: నటి | Rithu Chowdary Want to Go Rave Party But There is a Twist | Sakshi
Sakshi News home page

Rithu Chowdary: రేవ్‌ పార్టీకి నన్ను పిలిస్తే బాగుండనుకున్నా.. కానీ అదేంటో..

Published Sun, Jun 2 2024 4:39 PM | Last Updated on Sun, Jun 2 2024 4:57 PM

Rithu Chowdary Want to Go Rave Party But There is a Twist

జబర్దస్త్‌ షోతో జనాలకు దగ్గరైంది రీతూ చౌదరి. ఈ మధ్య యాంకర్‌గా బిజీ అయిన ఈ ముద్దుగుమ్మ ఇటీవల ఓ ఈవెంట్‌కు వెళ్లింది. అక్కడ తనకు రేవ్‌ పార్టీకి వెళ్లాలని ఉండేదన్న ఆకాంక్షను బయటపెట్టింది. ఆమె మాట్లాడుతూ.. నాకు నిజంగా రేవ్‌ పార్టీ అంటే తెలియదు. అసలు అదేంటో తెలియక రేవ్‌ పార్టీకి నాకెప్పుడు ఆహ్వానం పంపుతారా? నన్నెప్పుడు పిలుస్తారా? అని ఎదురుచూశాను. 

రేవ్‌ పార్టీ అంటే ఏంటో తెలీదు
కానీ తెలిశాక వద్దనుకుంటున్నాను. ఇప్పటికీ దానిపై నాకు పూర్తి అవగాహన లేదు. ఛానల్స్‌ చూసి అంతో ఇంతో తెలుసుకున్నాను. డ్రగ్స్‌ వంటి నిషేధిత పదార్థాలు తీసుకుంటారని తెలిశాక రేవ్‌ పార్టీకి వెళ్లడం అవసరం లేదనుకున్నాను. సినిమా ఇండస్ట్రీలోని వాళ్లు డ్రగ్స్‌ తెలిసి తీసుకుంటున్నారో, తెలియక తీసుకుంటున్నారో వాళ్లకే తెలియాలి. పోలీసులకు దొరికిపోయాక మనమేం చెప్తాం అంది. రీతూ చౌదరి ప్రస్తుతం దావత్‌ షో చేస్తోంది. అలాగే త్వరలోనే సరికొత్త షోతో ముందుకు రానున్నట్లు వెల్లడించింది. తన చేతిలో ఒక సినిమా కూడా ఉన్నట్లు తెలిపింది.

అడ్డంగా దొరికిన హేమ
ఇకపోతే ఇటీవల బెంగళూరులోని ఓ ఫామ్‌హౌస్‌లో రేవ్‌ పార్టీ జరిగింది. అర్ధరాత్రి దాటినా పార్టీ జరుగుతుండటంతో పోలీసులు ఫామ్‌హౌస్‌పై రైడ్‌ చేశారు. డ్రగ్స్‌ స్వాధీనం చేసుకున్నారు. పార్టీలో పాల్గొన్న పలువురినీ అరెస్ట్‌ చేశారు. అందుటో టాలీవుడ్‌ సీనియర్‌ నటి హేమ కూడా ఉంది. అయితే మొదట్లో తాను ఇంట్లో ఉన్నట్లు వీడియోలు రిలీజ్‌ చేస్తూ బుకాయించిన హేమ తర్వాత మాత్రం అడ్డంగా దొరికిపోయింది. తన ఒరిజినల్‌ పేరు కృష్ణవేణి పేరుతో పార్టీకి హాజరైందని, తన రక్తనమూనాల్లోనూ డ్రగ్స్‌ ఉన్నట్లు తేలిందని పోలీసులు నిర్ధారించారు. ప్రస్తుతం ఈ కేసు విచారణ జరుగుతోంది.

చదవండి: బుజ్జి అండ్‌ భైరవ రివ్యూ.. ‘కల్కి’ ప్రపంచం ఇలా ఉంటుందా?

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement