పండంటి బిడ్డకు జన్మనిచ్చిన 'మహాతల్లి' | Mahathalli Jahnavi Dasetty Blessed with Baby | Sakshi
Sakshi News home page

పండంటి బిడ్డకు జన్మనిచ్చిన 'మహాతల్లి' జాహ్నవి..

Mar 16 2025 4:20 PM | Updated on Mar 16 2025 4:29 PM

Mahathalli Jahnavi Dasetty Blessed with Baby

మహాతల్లి జాహ్నవి దాసెట్టి (Jahnavi Dasetty) పండంటి బిడ్డకు జన్మనిచ్చింది. ఈ విషయాన్ని ఆదివారం నాడు ఇన్‌స్టాగ్రామ్‌ పోస్ట్‌ ద్వారా వెల్లడించింది. అది చూసిన స్నేహితులు, అభిమానులు శుభాకాంక్షలు తెలియజేస్తున్నారు. యూట్యూబర్‌ నిఖిల్‌ విజయేంద్రసింహా అయితే.. ఒక్కసారి మావయ్యా అనమ్మా అంటూ ఎమోషనల్‌ అయిపోయాడు. 

జాహ్నవి, సుశాంత్‌ ప్రేమించి పెళ్లి చేసుకున్నారు. గతేడాది గర్భం దాల్చినట్లు వెల్లడించింది జాహ్నవి. అప్పటినుంచి తన ప్రెగ్నెన్సీ జర్నీని వీడియోల రూపంలో షేర్‌ చేస్తూనే ఉంది. భర్తతో కలిసి ఫోటోలు దిగుతూ వాటిని సోషల్‌ మీడియాలో పంచుకుంటూనే ఉంది.

ఎవరీ జాహ్నవి?
జాహ్నవి తెలుగమ్మాయి. నిఫ్ట్‌లో ఫ్యాషన్‌ టెక్నాలజీ చదివిన ఆమె మొదట్లో కొన్ని షార్ట్‌ ఫిలింస్‌ చేసింది. అలా మహాతల్లి- మహానుభావుడు అనే ఓ వెబ్‌ సిరీస్‌లోనూ నటించింది. ఈ సిరీస్‌ ఏ రేంజ్‌లో క్లిక్‌ అయిందంటే జాహ్నవిని మహాతల్లిగానే జనాలు గుర్తుపెట్టేసుకున్నారు. ఇప్పటికీ అలాగే పిలుస్తారు. వెబ్‌ సిరీస్‌లు, సరదా వీడియోలు చేస్తూ యూట్యూబ్‌లో పాపులర్‌ అయింది. సెలబ్రిటీలను ఇంటర్వ్యూలు కూడా చేసేది. లై, మెంటల్‌ మదిలో చిత్రాల్లోనూ నటించింది.

 

 

చదవండి: ఎవర్నీ మోసం చేయకూడదు.. గుణపాఠం నేర్చుకున్నా..: కావ్యశ్రీ

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement