సాక్షి, హైదరాబాద్: హైదరాబాద్ శివారులోని ముచ్చింతల్ సమతామూర్తి విగ్రహం వద్దకు వీకెండ్‌లో ఆర్టీసీ బస్సు సౌకర్యం కల్పించాలని అధికారులను ఆ సంస్థ ఎండీ సజ్జనార్ ఆదేశించారు. సమతామూర్తి విగ్రహం వద్దకు నేరుగా ఆర్టీసీ బస్సుల్లేవని, అక్కడికి వెళ్లేందుకు క్యాబ్ వాళ్లు రూ.1000 వరకు వసూలు చేస్తున్నారని ట్విట్టర్‌లో ఎండీ సజ్జనార్ దృష్టికి ఓ నెటిజన్ తీసుకెళ్లారు. వీకెండ్‌లో అక్కడికి ఆర్టీసీ బస్‌లను ఏర్పాటు చేస్తే.. సామాన్యులకు ఎంతో ఉపయోగకరంగా ఉంటుందని కోరారు.
ఈ ట్వీట్‌కు సజ్జనార్ సానుకూలంగా స్పందించారు. ‘ఆర్టీసీ పట్ల మీ ఆసక్తికి ధన్యవాదాలు. ఈ మార్గంలో ఆర్టీసీ బస్‌ను ఏర్పాటు చేయండి. అందుకు అనుగుణంగా సమయాలను అప్‌డేట్ చేయండి’అని ఆర్టీసీ అధికారులను ఆయన ఆదేశించారు. ఆర్టీసీ ఉన్నతాధికారుల ఖాతాలను ట్యాగ్ చేశారు. సమతామూర్తి విగ్రహం వద్దకు బస్ సౌకర్యం ఏర్పాటు చేసేలా చర్యలు తీసుకుంటామని ఆ ట్వీట్‌కు ఉన్నతాధికారులు సమాధానం ఇచ్చారు.
#TSRTC has arranged special buses to #muchinthal Statue of Equality from the important locations, Timings also furnished. Buses will be scaled up as per traffic demand. Choose #TSRTCBuses for your journeys pic.twitter.com/CEq36k0wzJ
— V.C Sajjanar IPS MD TSRTC Office (@tsrtcmdoffice) January 31, 2022
Comments
Please login to add a commentAdd a comment