సాక్షి, హైదరాబాద్: తెలంగాణ రోడ్డు రవాణా సంస్థ(TSRTC) మరో కీలక నిర్ణయం తీసుకుంది. వరంగల్ జిల్లాలోని విద్యార్థులకు ఓ సువర్ణ అవకాశాన్ని అందించింది. టీఎస్‌ఆర్టీసీ ఐటీఐ కళాశాలలో వివిధ ట్రేడ్‌లలో ప్రవేశాలకు నోటిఫికేషన్‌కు విడుదల చేసింది. ఈ మేరకు వివరాలను సంస్థ ఎండీ సజ్జనార్ ట్విట్టర్ వేదికగా తెలిపారు.
వివరాల ప్రకారం.. ‘వరంగల్‌లోని #TSRTC ఐటీఐ కళాశాలలో వివిధ ట్రేడ్‌లలో ప్రవేశాలకు ఆసక్తి గల విద్యార్థుల నుంచి సంస్థ దరఖాస్తులను ఆహ్వానిస్తోంది. దరఖాస్తుకు ఈ నెల ౩1 తుది గడువు. మోటార్ మెకానిక్ వెహికిల్, మెకానిక్ డిజిల్, వెల్డర్, పెయింటర్ ట్రెడ్‌లలో ప్రవేశాలు జరుగుతున్నాయి. స్వయం ఉపాధి రంగంలో స్థిరపడాలనుకునే వారికి ఐటీఐ కోర్సులు వరంలాంటివి. నిరుద్యోగ యువతకు చక్కటి శిక్షణ, బంగారు భవిష్యత్ అందించాలనే ఉద్దేశంతో ఈ ఐటీఐ కళాశాలను సంస్థ ఏర్పాటు చేసింది.
నిపుణులైన అధ్యాపకులతో పాటు అపార అనుభవంగల ఆర్టీసీ అధికారులచే తరగతులను నిర్వహిస్తోంది. ఈ ట్రేడ్‌లలో ప్రవేశం పొందిన విద్యార్థులకు కోరుకున్న టీఎస్‌ఆర్టీసీ డిపోల్లో అప్రెంటీషిఫ్ సౌకర్యం కల్పించడం జరుగుతుంది. ప్రవేశాలకు సంబంధించిన వివరాలకు వరంగల్ ములుగు రోడ్డులోని టీఎస్‌ఆర్టీసీ ఐటీఐ కళాశాల ఫోన్ నంబర్లు 9849425319, 8008136611 ను సంప్రదించగలరు’ అని సజ్జనార్ తెలిపారు.
వరంగల్‌లోని #TSRTC ఐటీఐ కళాశాలలో వివిధ ట్రేడ్‌లలో ప్రవేశాలకు ఆసక్తి గల విద్యార్థుల నుంచి సంస్థ దరఖాస్తులను ఆహ్వానిస్తోంది. దరఖాస్తుకు ఈ నెల ౩1 తుది గడువు. మోటార్ మెకానిక్ వెహికిల్, మెకానిక్ డిజిల్, వెల్డర్, పెయింటర్ ట్రెడ్‌లలో ప్రవేశాలు జరుగుతున్నాయి. స్వయం ఉపాధి రంగంలో… pic.twitter.com/JjOooikIlR
— VC Sajjanar - MD TSRTC (@tsrtcmdoffice) July 23, 2023
ఇది కూడా చదవండి: దివ్యాంగులకు తెలంగాణ సర్కార్ గుడ్‌న్యూస్
Comments
Please login to add a commentAdd a comment