
సెలబ్రిటీలు ఏ పని చేసినా.. అదో వైరల్ న్యూస్ అవుతున్న రోజులివి. ముఖ్యంగా సినీ తారల విషయంతో ఇది చాలా ఎక్కువ. వాళ్లు ఎక్కడికి వెళ్లినా, ఏ పని చేసినా.. వాటికి సంబంధించిన వీడియోలు సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతుంటాయి. ఇక ఆ వీడియోలు చూసి అభిమానులు మురిసిపోతుంటారు. తాజాగా హీరోయిన్ నివేదా థామస్‌కు సంబంధించిన వీడియో ఒకటి నెట్టింట చక్కర్లు కొడుతోంది.
(చదవండి: నేహాకక్కడ్: అత్యధిక ఫాలోవర్స్ ఉన్న వుమెన్ సింగర్..)
ఇంతకీ ఆ వీడియోలో ఏముందనేగా మీ ప్రశ్న. అందులో నివేదా బ్లాక్ కలర్ జాకెట్ ధరించి ఆవు పాలు పితికింది. డైరీ ఫామ్‌కి వెళ్లిన నివేదా.. స్వయంగా తానే ఆవు దగ్గరకు వెళ్లి పాలు పితికి చక్కటి కాఫీ పెట్టుకుంది. దీన్ని ఓ వీడియో రూపంలో తన సోషల్ మీడియాలో ఖాతాలో షేర్ చేస్తూ 'జాయ్' అని ట్యాగ్ చేసింది. ప్రస్తుతం ఈ వీడియో సోషల్ మీడియాలో తెగ చక్కర్లు కొడుతోంది. కొంతమంది వాటి దగ్గరకు వెళ్లడానికే భయపడతారు.. కానీ నువ్వు వెళ్లడమే కాకుండా పాలు పితికే సాహసం చేశావంటే నువ్వు చాలా గ్రేట్ అక్కా’అంటూ కామెంట్స్ చేస్తున్నారు. ఇటీవల పవన్ కళ్యాణ్ 'వకీల్ సాబ్' మూవీలో కీలకపాత్ర పోషించి విమర్శకుల ప్రశంసలు అందుకున్న నివేదా ప్రస్తుతం తెలుగుతో పాటు తమిళంలో రెండు మూడు సినిమాల్లో నటిస్తోంది.
Comments
Please login to add a commentAdd a comment