డెహ్రడూన్ : ఆవును గో మాతగా పూజించడం హిందూ సంప్రదాయం. కానీ త్వరలోనే ఆవు ఖాతాలో మరో రికార్డ్ చేరబోతుంది. ఆవును జాతీయ మాతగా గుర్తించాలంటూ ఉత్తరాఖండ్ ప్రభుత్వం తీర్మానించింది. ఈ మేరకు ఉత్తరాఖండ్ పశు సంవర్ధక శాఖ మంత్రి రేఖ ఆర్య ప్రవేశపెట్టిన బిల్లుకు రాష్ట్ర శాసన సభ ఏకగ్రీవంగా ఆమోదం తెలిపింది. ఈ విషయం గురించి రేఖ ఆర్య మాట్లాడుతూ ‘చెట్లు కార్బన్ డయాక్సైడ్‌ని పీల్చుకుని, ఆక్సిజన్‌ని విడుదల చేస్తాయనే సంగతి తెలుసు. కానీ మనలో చాలా మందికి తెలియని విషయం ఏంటంటే ఆవులు ఆక్సిజన్ శ్వాసించడమే కాక.. ఆక్సిజన్‌న్నే విడుదల చేస్తాయి. అంతే కాకా గో మూత్రం చాలా శ్రేష్ఠమైనది. అప్పుడే పుట్టిన పిల్లలకు తల్లి పాల తర్వాత ఆవు పాలు ఎంతో ఉత్తమం’ అంటూ ఆవులు, వాటి వల్ల కలిగే లాభాల గురించి వివరించారు.
చివర్లో ‘ఇన్ని గొప్ప ప్రయోజనాలు ఉన్న ఆవును జాతి మాత(మదర్ ఆఫ్ ద నేషన్)గా గుర్తించాల్సిన అవసరం ఉంది. ఇలా చేయడం వల్ల గో సంరక్షణ ప్రయత్నాలు మరింత బలపడతాయని రేఖా ఆర్య తెలిపారు. అందువల్లనే మేం ఆవును జాతి మాతా గుర్తించే బిల్లును ప్రవేశ పెట్టాం. ప్రతిపక్షం కూడా దీనికి పూర్తి మద్దతు తెలిపింది అని ప్రకటించారు.
Comments
Please login to add a commentAdd a comment