ధర్మశాల : ఆవును రాష్ట్రమాతగా గుర్తిస్తూ హిమాచల్ ప్రదేశ్ అసెంబ్లీ ఏకగ్రీవంగా తీర్మానించింది. గోవును రాష్ట్రమాతగా ప్రకటించాలని బీజేపీ శాసనసభ్యుడు అనిరుధ్ సింగ్ ప్రవేశపెట్టిన బిల్లును రాష్ట్ర శాసనసభ శుక్రవారం అమోదించి, బిల్లును కేంద్రానికి పంపింది. ఆవు ఓ కులానికి, మతానికి చెందినది కాదని అది జాతి సంపదని రాష్ట్ర పశుసంవర్ధక శాఖ మంత్రి వీరేంద్ర కన్వార్ అన్నారు.
ఆవు పాలు ఇవ్వడం ఆపగానే వద చేయకూడదని, గో సంక్షణకు ప్రభుత్వం చర్యలను చేపట్టాలని పలువురు శాసన సభ్యులు కోరారు. కాగా గో సంరక్షణ పేరిటి రాజస్తాన్, ఉత్తరాఖండ్, మధ్యప్రదేశ్ రాష్ట్రాలు ఆవుల అభయారణ్యా కేంద్రాలను ఏర్పాటు చేసిన విషయం తెలిసిందే. ఆవును రాష్ట్రమాతగా గుర్తిస్తూ ఉత్తరాఖండ్ బీజేపీ ఎమ్మెల్యేలు దేశంలో తొలిసారి తీర్మానించారు.
Comments
Please login to add a commentAdd a comment