సోషల్ మీడియా వినియోగంలోకి వచ్చాక చిన్న చిన్న విషయాలు నెట్టింట్లో తెగ వైరలవుతున్నాయి. ఈ నేపథ్యంలోనే గత మూడు రోజులుగా ఓ వీడియో సోషల్ మీడియాలో హల్ చల్ చేస్తోంది. అయితే ఇదేదో రాజకీయాలు, సినిమాలకు సంబంధించినది అని అనుకుంటే పొరపాటే. ఓ చక్కటి అందమైన చిన్న లేగదూడకు చెందినది. ఇది సాధారణ లేగ దూడ కాదు. ఇదో ప్రత్యేకమైన జాతికి చెందినది. చిత్తూరు జిల్లాలోని పంగనూరులో ఈ జాతి ఆవులు ఉంటాయి. దీనికి సంబంధించిన వీడియోను ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వానికి సలహాదారుగా చేస్తున్న రాజీవ్ కృష్ణ ట్విటర్‌లో పోస్టే చేశారు. ఇతను వైఎస్సార్సీపీ కార్యదర్శిగా కూడా ఉన్నారు. ఇక ఆవు గురించి చెబుతూ.. ఈ ఆవులు మహా అయితే 3, 4 అడుగుల కంటే ఎక్కువ ఎత్తు పెరగవని, బరువు కూడా 150 నుంచి 200 కేజీలే ఉంటాయని తెలిపారు. కానీ పాలు మాత్రం రోజూ 4 నుంచి 5 లీటర్ల దాకా ఇస్తాయనీ, ఆ పాలు చాలా చిక్కగా ఉంటాయని ఆయన పేర్కొన్నారు.
కాగా వీడియో విషయానికొస్తే.. ఈ లేగ దూడను ముచ్చటగా అలంకరించారు దాని యజమాని. అందమైన గంటలు కట్టడంతో.. అది కదులుతుంటే గంటలు మ్రోగుతూ ఇళ్లంతా సందడి చేస్తోంది. ఈ ప్రత్యేకమైన జాతి ఆవు వీడియోను చూస్తుంటే ప్రతి ఒక్కరికి క్యూట్ ఫీల్ కలిగిస్తోంది. అందుకే 50 సెకండ్ల వీడియోను ఆసక్తిగా చూస్తున్నారు నెటిజన్లు. జనరల్‌గా పిల్లులు, కుక్కల వీడియోలు వైరల్ అవుతూ ఉంటాయి. అప్పుడప్పుడు పులులు, చిరుతలు, ఏనుగులు, ఎలుగుబంట్ల వీడియోలను కూడా మనం ఎంజాయ్ చేస్తుంటాం. ఇది మాత్రం ప్రత్యేకమైన వీడియోనని కొంతమంది నెటిజన్లు కామెంట్ చేస్తున్నారు.
చదవండి: బుర్ర పనిచేసింది.. లేదంటే.. వైరల్
Awwwww, I want one of these. pic.twitter.com/AGVtiB9Lw5
— Shefali Vaidya. (@ShefVaidya) February 14, 2021
Comments
Please login to add a commentAdd a comment