
గేటు కింది నుంచి వెళ్లేందుకు ప్రయత్నిస్తున్న కోడె
సాక్షి, మంచిర్యాల: నేనొస్తే గేటు తీయరా..? అనుకున్నదేమో ఓ కొడే. మంచిర్యాల పట్టణం నుంచి హమాలీవాడకు వెళ్లే రైల్వే గేటు వద్ద గురువారం బీభత్సం సృష్టించింది. రైల్వే గేటు విరగ్గొట్టి ట్రాక్ దాటి అవతలి వైపు హమాలీవాడ వెళ్లేందుకు ప్రయత్నం చేసింది. ఉదయం మార్కెట్‌లో మేతకు వచ్చిన ఆ కోడె 10 గంటలకు వెళ్తుండగా గేటు వద్దకు వచ్చి ఆగిపోయింది. రైలు వెళ్లిపోయినా గేటు తీయకుండా ఉంచుతారా అనుకుందేమో మూడు నాలుగు సార్లు గేటు విరగ్గొట్టేందుకు విశ్వప్రయత్నం చేసింది.
రైల్వే సిబ్బంది కర్రతో కొట్టి వెళ్లగొట్టేందుకు ప్రయత్నించినా ఆగలేదు. అక్కడున్న వాహనదారులు కొడెను చూసి బెదిరిపోయారు. కోడె దాడి రైల్వేగేటు వంగి పోయింది. ఆ గేటును సరి చేసేందుకు రెండు గంటల సమయం పట్టింది. మరమ్మతులతో రాకపోకలకు అంతరాయం ఏర్పడింది.
చదవండి: గేటు కింది నుంచి వెళ్లేందుకు ప్రయత్నిస్తున్న కోడె
గేటును సరి చేస్తున్న సిబ్బంది
Comments
Please login to add a commentAdd a comment