ఉన్నావ్: ఉత్తరప్రదేశ్ సీఎం యోగి ఆదేశాల మేరకు రాష్ట్రంలో గోహత్య కేసుల్లో నిందితులపై పోలీసులు వేగవంతమైన చర్యలు చేపడుతున్నారు. తాజాగా పోలీసులు ఉన్నావ్‌లో గో హంతకునిపై కాల్పులు జరిపారు. ఈ ఘటన స్థానికంగా కలకలం రేపింది.
గోవులను వధించి, వాటి అవశేషాలను బహిరంగంగా పారవేసిన కేసులో నిందితునిగా ఉన్న వ్యక్తిపై పోలీసులు కాల్పులు జరిపారు. దీనిని గమనించిన నిందితుని సహచరుడు అక్కడి నుంచి పరారయ్యాడు. కాల్పులలో గాయపడిన వ్యక్తిని మహతాబ్ ఆలం ఖురేషీగా పోలీసులు గుర్తించారు. నిందితుడిని పోలీసులు చికిత్స కోసం ఆస్పత్రికి తరలించారు.
అన్వర్ నగర్, కృష్ణ నగర్‌లలో గోవులను వధించారన్న సమాచారం పోలీసులకు అందింది. దీంతో పోలీసులు ఘటనా స్థలానికి చేరుకుని గోహత్యపై విచారణ చేపట్టి, వారికి లభ్యమైన ఆవుల అవశేషాలను పాతిపెట్టారు. అయితే దీనిపై కలకలం చెలరేగడంతో పోలీసు అధికారి సోనమ్ సింగ్ ఘటనా స్థలాన్ని పరిశీలించి, గుర్తు తెలియని వ్యక్తులపై కేసు నమోదు చేశారు. ఈ నేపధ్యంలో రంగంలోకి దిగిన పోలీసులు గోహత్య ఘటనలో ప్రమేయమున్న నిందితులపై కాల్పులు జరిపారు.
ఇది కూడా చదవండి: మద్యం మాఫియా దాడి.. ఆరుగురు పోలీసులకు గాయాలు
Comments
Please login to add a commentAdd a comment