పులి ఆవును తింటే శిక్షించరా..? | Goa MLA Says Tigers Must Be Punished For Eating Cows | Sakshi
Sakshi News home page

పులి ఆవును తింటే శిక్షించరా..?

Published Wed, Feb 5 2020 4:42 PM | Last Updated on Wed, Feb 5 2020 4:48 PM

Goa MLA Says Tigers Must Be Punished For Eating Cows   - Sakshi

ఆవును తిన్న పులిని శిక్షించాలని గోవా ఎమ్మెల్యే ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు.

పనాజీ : పులుల సంహారంపై గోవా అసెంబ్లీ చర్చిస్తున్న క్రమంలో ఎన్సీపీ ఎమ్మెల్యే చర్చిల్‌ అలెమావో ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. మనుషులు ఆవులను తింటే శిక్షిస్తున్న తరహాలోనే ఆవులను భక్షించే పులులను కూడా శిక్షించాలని ఆయన వ్యాఖ్యానించారు. గత నెలలో మహాధాయి వన్యప్రాణి సంరక్షణ కేంద్రంలో పులిని దాని పిల్లలను స్ధానికులు చంపిన అంశాన్ని గోవా అసెంబ్లీలో విపక్ష నేత దిగంబర్‌ కామత్‌ ప్రస్తావించారు. ఈ దశలో అలెమావో జోక్యం చేసుకుని పులి ఆవును భక్షిస్తే ఏ శిక్ష విధిస్తారని ప్రశ్నించారు. మనిషి ఆవును తింటే శిక్షిస్తున్నారు..మరి వన్యప్రాణుల విషయంలో పులులు ప్రాధాన్యమైతే..మనుషులకు సంబంధించి ఆవులకే ప్రాధాన్యం అంటూ అలెమావో అన్నారు. ఈ మొత్తం వ్యవహారంలో మనిషి కోణంలో ఆలోచించడాన్ని విస్మరించరాదని ఎమ్మెల్యే చెప్పుకొచ్చారు. సీఎం ప్రమోద్‌ సావంత్‌ ఈ అంశంపై స్పందిస్తూ పులి పిల్లలు తమ పశుసంతతిపై దాడి చేయడంతో స్ధానికులు వాటిని చంపారని చెప్పారు. జంతువుల దాడిలో పశువులను కోల్పోయిన రైతులకు మూడు నాలుగురోజుల్లో పరిహారం అందచేస్తామని ఆయన వెల్లడించారు.

చదవండి : మంత్రి పేరుతో గోవాలో జల్సా..

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement