Goa assembly
-
అత్యంత దారుణంగా కాంగ్రెస్ పరిస్థితి..
పణజి: నలభై సీట్లున్న గోవా అసెంబ్లీలో 17 చోట్ల గెలిచి అతిపెద్ద పార్టీగా అవతరించిన కాంగ్రెస్ పరిస్థితి ప్రస్తుతం అత్యంత దారుణంగా తయారైంది. ఒకరి తర్వాత మరొకరు పార్టీని వీడుతూ వలసల పర్వాన్ని జోరెత్తించారు. సోమవారం తాజాగా దక్షిణ గోవాలోని కుర్టిమ్ నియోజకవర్గ ఎమ్మెల్యే అలెక్సో రెజినాల్డో లారెన్కో తన ఎమ్మెల్యే పదవికి, కాంగ్రెస్ పార్టీకి గుడ్‌బై చెబుతూ రాజీనామా సమర్పించారు. దీంతో పార్టీలో మిగిలిపోయిన ఎమ్మెల్యేల సంఖ్య సోమవారానికి కేవలం రెండుకు పడిపోయింది. ఆయన తృణమూల్ కాంగ్రెస్ పార్టీలో చేరతారని వార్తలొచ్చాయి. బీజేపీ ప్రభుత్వానికి కాంగ్రెస్ ఎమ్మెల్యే మద్దతు అస్సాంలో సీఎం హిమంత బిశ్వ శర్మ నేతృత్వంలోని బీజేపీ సర్కార్‌కు బయటి నుంచి మద్దతు ఇస్తున్నట్లు కాంగ్రెస్ ఎమ్మెల్యే శశికాంత దాస్ సోమవారం ప్రకటించారు. ఇప్పుడే కాంగ్రెస్‌ను వీడబోనన్నారు. ‘తాను ప్రాతినిధ్యం వహిస్తున్న రహా నియోజకవర్గ అభివృద్థి కోసమే ఆయన.. రాష్ట్ర సర్కార్‌కు మద్దతు ప్రకటించారు. బీజేపీలో చేరతారో లేదో నాకు తెలియదు’ అని సీఎం హిమంత చెప్పారు. చదవండి: (టార్గెట్ 30 లక్షలు.. జరిగింది 2.5 లక్షలే.. ఆ నాలుగు ఓకే.. కానీ!) -
పులి ఆవును తింటే శిక్షించరా..?
పనాజీ : పులుల సంహారంపై గోవా అసెంబ్లీ చర్చిస్తున్న క్రమంలో ఎన్సీపీ ఎమ్మెల్యే చర్చిల్ అలెమావో ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. మనుషులు ఆవులను తింటే శిక్షిస్తున్న తరహాలోనే ఆవులను భక్షించే పులులను కూడా శిక్షించాలని ఆయన వ్యాఖ్యానించారు. గత నెలలో మహాధాయి వన్యప్రాణి సంరక్షణ కేంద్రంలో పులిని దాని పిల్లలను స్ధానికులు చంపిన అంశాన్ని గోవా అసెంబ్లీలో విపక్ష నేత దిగంబర్ కామత్ ప్రస్తావించారు. ఈ దశలో అలెమావో జోక్యం చేసుకుని పులి ఆవును భక్షిస్తే ఏ శిక్ష విధిస్తారని ప్రశ్నించారు. మనిషి ఆవును తింటే శిక్షిస్తున్నారు..మరి వన్యప్రాణుల విషయంలో పులులు ప్రాధాన్యమైతే..మనుషులకు సంబంధించి ఆవులకే ప్రాధాన్యం అంటూ అలెమావో అన్నారు. ఈ మొత్తం వ్యవహారంలో మనిషి కోణంలో ఆలోచించడాన్ని విస్మరించరాదని ఎమ్మెల్యే చెప్పుకొచ్చారు. సీఎం ప్రమోద్ సావంత్ ఈ అంశంపై స్పందిస్తూ పులి పిల్లలు తమ పశుసంతతిపై దాడి చేయడంతో స్ధానికులు వాటిని చంపారని చెప్పారు. జంతువుల దాడిలో పశువులను కోల్పోయిన రైతులకు మూడు నాలుగురోజుల్లో పరిహారం అందచేస్తామని ఆయన వెల్లడించారు. చదవండి : మంత్రి పేరుతో గోవాలో జల్సా.. -
అసెంబ్లీని రద్దు చేసే ప్రశ్నే లేదు
పణాజి: గోవా అసెంబ్లీని రద్దు చేసే అవకాశం లేదని ఆ రాష్ట్ర ముఖ్యమంత్రి లక్ష్మీకాంత్ పర్సేకర్ అన్నారు. మార్చి 11 వరకు ప్రస్తుత ప్రభుత్వం కొనసాగుతుందని చెప్పారు. గోవా అసెంబ్లీకి ఈ నెల 4న ఎన్నికలు జరిగిన సంగతి తెలిసిందే. వచ్చే నెల 11న ఓటింగ్ జరుగుతుంది. కాగా భారత రాజ్యాంగం ప్రకారం ప్రతి ఆరునెలలకు కనీసం ఒకసారైనా అసెంబ్లీ సమావేశం జరగాలి. గోవా అసెంబ్లీ సమావేశాలు చివరిసారిగా గతేడాది ఆగస్టు 26న జరిగాయి. కాబట్టి ఈ నెల 26వ తేదీలోపు మరోసారి అసెంబ్లీ సమావేశం కావాలి. అయితే ఎన్నికల కోడ్ అమల్లో ఉన్నందును అసెంబ్లీ సమావేశాలను నిర్వహించడం లేదు. ఈ నేపథ్యంలో గోవా అసెంబ్లీని రద్దు చేసే అవకాశముందని అభిప్రాయాలు రావడంతో సీఎం పర్సేకర్ స్పందించారు. కౌంటింగ్ కోసం ఎదురు చూస్తున్నామని, అసెంబ్లీని రద్దు చేసే ప్రశ్నే ఉత్పన్నం కాదని అన్నారు. -
కబ్జాకు పాల్పడిన బొంబారుు హైకోర్టు
గోవా సీఎం పారీకర్ ఆరోపణ పణ జి: బొంబాయి హైకోర్టు భూకబ్జాకు పాల్పడిందంటూ గోవా ముఖ్యవుంత్రి మనోహర్ పారీకర్ సోమవారం న్యాయవ్యవస్థపైనే తీవ్ర ఆరోపణలు చేశారు. ప్రభుత్వ భూమినే హైకోర్టు కబ్జాచేసిందంటూ బొంబారుు హైకోర్టు గోవా ధర్మాసనంపై ఆరోపణలు చేశారు. జ్యుడిషియల్ జవాబుదారీ బిల్లుపై గోవా శాసన సభలో చర్చ సందర్భంగా పారీకర్ ఈ వ్యాఖ్యలు చేశారు. బెంచ్ ఏర్పాటుపై పణజికి వస్తున్న హైకోర్టు తన సొంత ఉత్తర్వుతోనే భూమిని తీసేసుకుందని, దీన్ని అనుమతించబోవుని, హైకోర్టు తనంతటతాను నిర్ణయం తీసుకోజాలదని పారీకర్ అన్నారు. పణజిలో జిల్లా కోర్టు భవన సముదాయుం నిర్మాణంకోసం ఏకంగా గ్రామీణాభివృద్ధి సంస్థకు సంబంధించిన భూమిని కూడా న్యాయవ్యవస్థ కబ్జాచేసిందని పారీకర్ అన్నారు. గోవా లో పలు బంగళాలను న్యాయవ్యవస్థ దాదాపుగా కబ్జా చేసిన సందర్భాలున్నాయుని, ఆ బంగళాలను తాను చూపెడతానని అన్నారు. కానీ, ఆయన ఆ వివరాలు వెల్లడించలేదు.