
అహ్మదాబాద్ : మీ చర్మం ధగధగ మెరిసిపోవాలా?. 108 సాధారణ జబ్బుల నుంచే కాకుండా ఎయిడ్స్, క్యాన్సర్ లాంటి ప్రాణాంతక వ్యాధుల నుంచి రక్షణ పొందాలంటే సహజ సిద్ధమైన ప్రొడక్టులను వాడాలని గుజరాత్ ప్రభుత్వం ఓ ప్రకటన విడుదల చేసింది. ఆవు మూత్రం, పేడలకు జబ్బులను నయం చేయగల శక్తి ఉందని చెప్పింది.
మహిళలు ఈజిప్టు రాణి క్లియోపాత్రలా అందంగా కనిపించాలంటే గో మూత్రం, పేడలతో తయారు చేసిన 'పంచగవ్య' ఉత్పత్తులను వినియోగించాలని గుజరాత్ వికాస్ బోర్డు పేర్కొంది. పంచగవ్య డార్క్ సర్కిల్స్, బ్లాక్ స్పాట్స్, మొటిమలను తొలగిస్తుందని చెప్పింది. ప్రపంచలోనే అందగత్తె అయిన క్లియోపాత్ర ప్రతిరోజూ ఆవు పాలతో స్నానం చేసేవారని 'ఆరోగ్య గీత' అనే పేరుతో విడుదల చేసిన సలహాల్లో పేర్కొంది.
ఆవు ఉత్పత్తుల గురించి మహిళలకు అవగాహన లేదని గో సంరక్షణ సమితి అధ్యక్షుడు వల్లభ్ కృష్ణ చెప్పారు. ఆవు పాలు, మూత్రం, పేడల గురించి మహిళలు తెల్సుకోవాల్సింది చాలా ఉందని అన్నారు. మహిళ శరీరాన్ని రూపవంతంగా తీర్చిదిద్దగలిగే శక్తి గో ఉత్పత్తులకు మాత్రమే ఉందని చెప్పుకొచ్చారు.
Comments
Please login to add a commentAdd a comment