
ముంబై: అటెండెన్స్ ఇవ్వడానికి ఆలస్యమైపోతున్న విద్యార్థిలా ఓ ఆవు నేరుగా తరగతి గదిలోకే వెళ్లింది. ఈ హఠాత్పరిణామానికి అక్కడి విద్యార్థులు షాక్ అవగా.. ఆవు మాత్రం ఉపాధ్యాయిలా దర్జాగా క్లాస్ రూమ్ అంతా తిరిగి ఇన్విజిలేటర్‌లా బయటకు వెళ్లిపోయింది. విద్యార్థులు దాన్ని తరిమే ప్రయత్నం చేసినప్పటికీ అది ఆ గది చుట్టూనే తిరుగుతూ ప్రదక్షిణలు చేయసాగింది. ఈ అరుదైన ఘటన ఐఐటీ బాంబే క్యాంపస్‌లో జరిగింది. బయట తీవ్ర వర్షం కురుస్తుండటంతో దానికి ఎటు వెళ్లాలో తెలీక సరాసరి క్యాంపస్ గదిలోకే వచ్చిందని అక్కడి విద్యార్థులు చెప్తున్నారు.
ప్రస్తుతం నెట్టింట్లో వైరల్‌గా మారిన ఈ వీడియోకి సరదా కామెంట్లు వెల్లువెత్తాయి. ‘జేఈఈ అడ్వాన్స్ పరీక్ష ఇదెలా పాసయిపోంది’ అంటూ నెటిజన్లు ఆశ్చర్యం వ్యక్తం చేస్తున్నారు. ‘పరీక్ష రాయకుండా దీన్ని ఎలా రానిచ్చారు’ అంటూ నెటిజన్లు ఓ ఆట ఆడుకుంటున్నారు. ఐఐటీలో ఇలాంటి ఘటనలు జరగడం వింతేమీ కాదు! గతంలో పశువుల మంద ఐఐటీ క్యాంపస్‌లో సంచరించగా, ఓ చిరుతపులి సైతం వర్షానికి జడిసి ఐఐటీలో ఆశ్రయం పొందిన సంగతి విదితమే..!
Cow entering IIT BOMBAY without clearing JEE Advanced?? 🐄🐄🐄. A cow entering an IIT Bombay classroom 😂 pic.twitter.com/i7taJ2TPOd
— Mayur Borkar (@imayurborkar) July 29, 2019
Comments
Please login to add a commentAdd a comment