కృష్ణా జిల్లా మచిలీపట్నంలో ఇటీవల జరిగిన సంఘటన జంతువుల్లో పేగుబంధం ఎంత బలమైందో చాటిచెబుతోంది. లక్ష్మీటాకీస్ సెంటర్‌లో గత నెల 29న గుర్తుతెలియని వాహనం ఢీకొని లేగ దూడ చనిపోయింది. తల్లి ఆవు రోజంతా బిడ్డ వద్దే పడుకుంది. చనిపోయిన ఆ దూడను మున్సిపల్ సిబ్బంది ఆదేశాలతో ఓ రిక్షా కార్మికుడు తీసుకెళ్లి ఖననం చేశాడు. అయితే ఇప్పుడు ఆవు ఆ రిక్షా కార్మికుడిపై పగబట్టింది. బిడ్డను తనకు కాకుండా తీసుకెళ్లిపోయాడని అనుకుందో ఏమో ఆ కార్మికుడు ఎక్కడ కనిపించినా కొమ్ములతో పొడిచేస్తోంది. గురువారం రాత్రి బస్టాండ్ సెంటర్‌లో కన్పించిన ఆ రిక్షావాలాపై దాడి చేసి కిందపడేసింది. స్థానికులు వచ్చి రక్షించడంతో ప్రాణాలు దక్కించుకున్నాడు. ఆ ఆవు బారి నుంచి ఎలా బయటపడాలా? అని రిక్షా కార్మికుడు తలపట్టుకుంటున్నారు.
రిక్షావాలాపై దాడి చేసిన ఆవు
Published Fri, Nov 15 2019 12:27 PM | Last Updated on Thu, Mar 21 2024 8:31 PM
Advertisement
Advertisement
పోల్
Advertisement