
మనకు ఏమైనా వస్తువు కావాలంటే షాప్‌లోకి వెళ్లి తెచ్చుకుంటాం. కొత్త బట్టలు కొనుక్కోవాలంటే మాల్‌కు వెళ్లి సెలెక్ట్ చేసుకొని మరీ కొనుక్కుంటాం. మరి జంతువులకు కూడా ఏమైనా కొనుక్కోవాలనిపిస్తే ఎక్కడికి వెళ్తాయి. వాటికి కూడా షాపింగ్ చేయాలనిపిస్తే ఎలా ఉంటుంది. అచ్చం ఇలాంటి ఆలోచనే ఓ ఆవుకి వచ్చింది. స్టైలిష్ బట్టలు వేసుకొని అందంగా తయారవ్వాలనిపించిందేమో.. అనుకున్నదే తడువుగా బట్టల షాప్‌లోకి వెళ్లి షాపింగ్ చేసింది.
అదేంటి..! ఆవు బట్టల దుకాణానికి వెళ్లడం ఏంటి? అనుకుంటున్నారా.. ఈ మాటలు వినడానికి కొంచెం విడ్డూరంగానే అనిపించినా సరిగ్గా ఇలాంటి ఓ సరదా ఘటనే అస్సాంలో గత వారం చోటుచేసుకుంది. ధుబ్రి ప్రాంతంలో దారి తప్పిందో ఏమో గానీ ఓ ఆవు బట్టల షాప్‌లోకి ప్రవేశించింది. స్టోర్ మొత్తం కలియ తిరుగుతూ అందరినీ ఆశ్చర్యానికి గురి చేసింది. షాప్‌లో ఆవు తిరుగుతుంటే అక్కడున్న సిబ్బంది, షాపింగ్ చేస్తున్న మిగతా జనాలు భయంతో దూరంగా పరుగులు తీశారు. చివరికి దానంతట అదే బయటకు వెళ్లిపోయింది.
అక్కడున్న కొంతమంది ఈ తతంగాన్ని ఫోన్‌లో వీడియో తీశారు. దీనిని సోషల్ మీడియాలో షేర్ చేయడంతో వైరల్‌గా మారింది. అయితే ఆవు వాలకం చూస్తుంటే నిజంగా షాపింగ్ చేయడానికి వచ్చిన్నట్లే అనిపిస్తుంది. తనకు సంబంధించిన దుస్తులు ఎక్కడ ఉన్నాయా అనుకుంటూ అచ్చం కస్టమర్‌లాగే స్టోర్ మొత్తం షికారు చేసింది. చివరికి ఏవి నచ్చకపోవడంతో నిరుత్సాహ చెందింది. అంతేగాక.. బట్టల షాప్ వాళ్లు డబ్బులు అడగంతో అక్కడి నుంచి వెనుదిరిగినట్లు కనిపిస్తుంది. ఈ వీడియో చూసిన నెటిజన్లు కూడా ఇలాగే భావిస్తూ నవ్వుకుంటూ కామెంట్లు పెడుతున్నారు.
Cow entered in mall, #dhubri #Assam pic.twitter.com/aS2XYd5hg1
— Nitish Sarmah (@sarmah_nitish) December 30, 2022
Comments
Please login to add a commentAdd a comment