cloth store
-
సందడిగా వస్త్ర దుకాణం ప్రారంభోత్సవం (ఫొటోలు)
-
కౌ క్లాత్ స్టోర్
ఛత్తీస్‌గఢ్‌లోని రాయ్‌పూర్‌లో ఉన్న ఓ క్లాత్స్టోర్కు గత ఏడు సంవత్సరాలుగా చంద్రమణి డైలీ విజిటర్. అయితే చంద్రమణి అనేది మహిళ పేరు కాదు. ఒక ఆవు పేరు. చంద్రమణి రోజూ క్లాత్స్టోర్లోకి వచ్చి కాసేపు ఉండి పోతుంది. క్లాత్‌స్టోర్ యజమాని పదమ్ డాక్లియా ఎప్పుడూ ఆవును విసుక్కోలేదు. పైగా భక్తిభావంతో పూజిస్తాడు. వస్త్ర దుకాణానికి వచ్చే కొనుగోలుదారులకు ఈ ఆవు స్పెషల్ ఎట్రాక్షన్‌గా మారింది. ‘మహాలక్ష్మి క్లాత్ స్టోర్’ అనే పేరు కాస్త ‘కౌ క్లాత్ స్టోర్’గా మారింది. -
బట్టలు కొంటే బంగారం! హైదరాబాద్‌లో టాటా బ్రాండ్ నాలుగో స్టోర్
హైదరాబాద్: టాటా గ్రూప్‌లో భాగమైన సంప్రదాయ దుస్తుల బ్రాండ్ తనైరా హైదరాబాద్‌లో తమ కార్యకలాపాలను మరింత విస్తరించింది. నగరంలో తమ నాలుగో స్టోర్‌ను ఏర్పాటు చేసింది. సుమారు 4,000 చ.అ. విస్తీర్ణంలో ఏర్పాటైన స్టోర్‌ను సంస్థ రిటైల్ హెడ్ అనిర్బన్ బెనర్జీ, సౌత్ రీజనల్ బిజినెస్ హెడ్ శరద్ ఆర్ దీన్ని ప్రారంభించారు. ఈ సందర్భంగా జూన్ 16 నుంచి 20 వరకు ప్రత్యేక గోల్డ్ కాయిన్ ఆఫర్ ప్రకటించారు. రూ. 20,000 విలువైన కొనుగోళ్లు చేసే కస్టమర్లకు 0.2 గ్రాముల తనిష్క్ బంగారం నాణెం అందించనున్నట్లు సంస్థ వెల్లడించింది. -
బట్టల షాప్‌కు వెళ్లిన ఆవు.. పాపం ఏం నచ్చలేదేమో!
-
వైరల్ వీడియో: బట్టల షాప్‌కు వెళ్లిన ఆవు
-
Viral: బట్టల షాప్‌కు వెళ్లిన ఆవు.. పాపం ఏం నచ్చలేదేమో!
మనకు ఏమైనా వస్తువు కావాలంటే షాప్‌లోకి వెళ్లి తెచ్చుకుంటాం. కొత్త బట్టలు కొనుక్కోవాలంటే మాల్‌కు వెళ్లి సెలెక్ట్ చేసుకొని మరీ కొనుక్కుంటాం. మరి జంతువులకు కూడా ఏమైనా కొనుక్కోవాలనిపిస్తే ఎక్కడికి వెళ్తాయి. వాటికి కూడా షాపింగ్ చేయాలనిపిస్తే ఎలా ఉంటుంది. అచ్చం ఇలాంటి ఆలోచనే ఓ ఆవుకి వచ్చింది. స్టైలిష్ బట్టలు వేసుకొని అందంగా తయారవ్వాలనిపించిందేమో.. అనుకున్నదే తడువుగా బట్టల షాప్‌లోకి వెళ్లి షాపింగ్ చేసింది. అదేంటి..! ఆవు బట్టల దుకాణానికి వెళ్లడం ఏంటి? అనుకుంటున్నారా.. ఈ మాటలు వినడానికి కొంచెం విడ్డూరంగానే అనిపించినా సరిగ్గా ఇలాంటి ఓ సరదా ఘటనే అస్సాంలో గత వారం చోటుచేసుకుంది. ధుబ్రి ప్రాంతంలో దారి తప్పిందో ఏమో గానీ ఓ ఆవు బట్టల షాప్‌లోకి ప్రవేశించింది. స్టోర్ మొత్తం కలియ తిరుగుతూ అందరినీ ఆశ్చర్యానికి గురి చేసింది. షాప్‌లో ఆవు తిరుగుతుంటే అక్కడున్న సిబ్బంది, షాపింగ్ చేస్తున్న మిగతా జనాలు భయంతో దూరంగా పరుగులు తీశారు. చివరికి దానంతట అదే బయటకు వెళ్లిపోయింది. అక్కడున్న కొంతమంది ఈ తతంగాన్ని ఫోన్లో వీడియో తీశారు. దీనిని సోషల్ మీడియాలో షేర్ చేయడంతో వైరల్‌గా మారింది. అయితే ఆవు వాలకం చూస్తుంటే నిజంగా షాపింగ్ చేయడానికి వచ్చిన్నట్లే అనిపిస్తుంది. తనకు సంబంధించిన దుస్తులు ఎక్కడ ఉన్నాయా అనుకుంటూ అచ్చం కస్టమర్లాగే స్టోర్ మొత్తం షికారు చేసింది. చివరికి ఏవి నచ్చకపోవడంతో నిరుత్సాహ చెందింది. అంతేగాక.. బట్టల షాప్ వాళ్లు డబ్బులు అడగంతో అక్కడి నుంచి వెనుదిరిగినట్లు కనిపిస్తుంది. ఈ వీడియో చూసిన నెటిజన్లు కూడా ఇలాగే భావిస్తూ నవ్వుకుంటూ కామెంట్లు పెడుతున్నారు. Cow entered in mall, #dhubri #Assam pic.twitter.com/aS2XYd5hg1 — Nitish Sarmah (@sarmah_nitish) December 30, 2022 -
రూ.100 గిరాకీ చేసి.. రూ.10000 విలువైనవి ఎత్తుకెళ్లారు..
సాక్షి, నిజామాబాద్: ఓ బట్టల దుకాణంలో రూ.100ల గిరాకీ చేసి, రూ.10000 విలువ గల దుస్తులను చోరీ చేసిన ఘటన శుక్రవారం భిక్కనూరు మండల కేంద్రంలో చోటు చేసుకుంది. బాధితుడు తెలిపిన వివరాలు ఇలా.. మండలకేంద్రంలోని ఓ బట్టల దుకాణంలోకి గుర్తు తెలియని ముగ్గురు మహిళలు వచ్చి స్కార్ఫ్ కావాలని అడిగారు. యజమాని స్కార్ఫ్‌ను చూపిస్తుండగా.. మరో మహిళ ఇద్దరు పురుషులతో కలిసి దుకాణంలోకి వచ్చారు. తమకు బెడ్ షీట్లు కావాలని, తొందరగా చూపించాలని ఒత్తిడి తెచ్చారు. సదరు యజమాని మొదట వచ్చిన మహిళలను కొద్దిసేపు ఆగమని చెప్పి దుకాణంలోని రెండో గదిలోకి వెళ్లాడు. ఇదే సమయంలో మొదట వచ్చిన మహిళలు అక్కడ ఉన్న 10చీరెలున్న కట్ట, ఐదు ప్యాంట్ షర్టుల కట్టలను తమ చీర లోపల పెట్టుకున్నారు. తమకు స్కార్ఫ్ ఇవ్వాలని లేకుంటే వెళ్లిపోతామని యజమానిని తొందర చేశారు. దీంతో యజమాని ముందు రూంలోకి వచ్చి వారికి స్కార్ఫ్‌ను ఇవ్వగా.. వారు యజమానికి రూ.వంద నోటు ఇచ్చి వెళ్లి పోయారు. తదుపరి వచ్చిన మహిళ ఇద్దరు పురుషులకు యజమాని బెడ్షీట్లు చూపించగా అవి తమకు నచ్చిన రంగులో లేవని వెళ్లిపోయారు. వారందరూ వెళ్లిపోయిన తర్వాత దుకాణంలోని 10 చీరెల కట్ట, ఐదు ప్యాంటు షర్టుల కట్ట కనిపించకపోవడంతో సదరు యజమాని ఆందోళన చెందాడు. చుట్టుపక్కల దుకాణదారులకు విషయం వివరించగా.. సదరు గుర్తుతెలియని వ్యక్తుల కోసం గాలించారు. వారు దొరకకపోవడంతో యజమాని వేదనకు గురయ్యా డు. రెండేళ్ల క్రితం కూడా భిక్కనూరులోని ఓ బట్టల దుకాణంలో ఇదేవిధంగా చీరలను ఎత్తుకెళ్లారు. -
సరికొత్త విప్లవం: అమెజాన్ బట్టల దుకాణం
Amazon Announced Physical Cloth Store: ఆన్లైన్ ఈ-కామర్స్ రారాజు అమెజాన్ విప్లవాత్మక నిర్ణయం తీసుకుంది. ఈ-వరల్డ్ నుంచి రియల్ వరల్డ్‌లోకి అడుగుపెట్టనుంది. ఈ మేరకు లాస్ ఏంజెల్స్‌లో క్లాతింగ్ స్టోర్‌ను(bricks-and-mortar clothing store) ప్రారంభించనున్నట్లు కంపెనీ గురువారం ఒక ప్రకటనలో పేర్కొంది. కాలిఫోర్నియా నగరం లాస్ ఏంజెల్స్‌లో అమెజాన్ కంపెనీ ఈ ఏడాది చివర్లో ఈ క్లాత్ స్టోర్‌ను ప్రారంభించనుంది. అమెజాన్ స్టైల్ స్టోర్ ప్రత్యేకత ఏంటంటే.. కస్టమర్లు అమెజాన్ యాప్‌ని ఉపయోగించి దుస్తుల QR కోడ్లను స్కాన్ చేయడం, తమకు కావాల్సిన సైజులతో పాటు రంగులను ఎంచుకోవవచ్చు. ఆపై వాటిని ప్రయత్నించడానికి ఫిట్టింగ్ రూమ్‌లకు అనుమతిస్తారు. ఇదంతా స్మార్ట్ మెథడ్‌లో కొనసాగుతుంది. ఇక ఈ ఫిట్టింగ్ రూమ్‌లను ‘‘పర్సనలైజ్డ్ స్పేస్’’గా పేర్కొంటూ.. అందులోనూ టచ్ స్క్రీన్లను ఏర్పాటు చేస్తారు. అవసరం అనుకుంటే ఆ స్క్రీన్ మీద కస్టమర్ తమకు కావాల్సిన దుస్తుల్ని ఎంచుకోవవచ్చు. తద్వారా అటు ఇటు తిరగాల్సిన అవసరం లేకుండా.. బోలెడు టైం ఆదా అవుతుంది. యాప్ ద్వారా షాపర్స్ అభ్యర్థించిన వస్తువులతో పాటు ఆప్షన్స్ ద్వారా కార్ట్‌కు జోడించిన(యాడ్ చేసిన) ఎంపికలను సైతం ఆ ఫిట్టింగ్ రూంకి పంపిస్తారు. ‘‘కస్టమర్ షాపింగ్ చేస్తున్నంతసేపు అమెజాన్ మెషీన్ లెర్నింగ్ అల్గారిథమ్‌లు యాక్టివేట్‌గా ఉంటాయి. అవి వాళ్లకు తగిన, రియల్ టైం సిఫార్సులను ఉత్పత్తి చేస్తాయి. తద్వారా కస్టమర్లు ఇబ్బంది పడకుండా కావాల్సినవి ఎంచుకోవచ్చు’’ అని అమెజాన్ ఒక ప్రకటనలో తెలిపింది. అంతేకాదు డెలివరీ విషయంలో ఆన్సైట్ ఆపరేషన్స్ తరహాలోనే అత్యాధునిక టెక్నాలజీ ద్వారా త్వరగతిన చేయిస్తాయి. మార్కెట్లో అమెజాన్ ఆధిపత్యం అధికంగా ఉంటోందని పోటీదారులు, ప్రభుత్వాలు ఆరోపిస్తున్న విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో సీటెల్(వాష్టింగ్టన్) కేంద్రంగా కార్యకలాపాలు నిర్వహిస్తున్న అమెజాన్.. ఫిజికల్ స్టోర్ల ద్వారా తన రిటైల్ ఉనికిని విస్తరించేందుకు ముందుకు వచ్చింది. ఇదిలా ఉంటే 2017లో అమెజాన్ హోల్ ఫుడ్స్ మార్కెట్ గ్రోసరీ చైన్‌ను $13.7 బిలియన్ డాలర్లకు చేజిక్కించుకున్న విషయం తెలిసిందే. తద్వారా ఫిజికల్ రిటైల్‌లో ఈ చర్య, ఈ-కామర్స్ దిగ్గజపు ఉనికిని గణనీయంగా విస్తరించింది. చదవండి: అమెజాన్ 'గ్రేట్ రిపబ్లిక్ డే సేల్'..! 70 శాతం మేర తగ్గింపు! -
అక్రమ రవాణాకు రెడీమేడ్ సోకు
ప్రకాశం,చీరాల:చీరాలలో జరిగే వాణిజ్య వ్యాపారాల్లో అధిక శాతం అక్రమాలే ఉంటాయి. పప్పు నుంచి ఉప్పు దాకా అంతా కల్తీ మయం. ఏ నూనెలో వేలు పెట్టినా కలుషితం. చివరికి తాగే టీ పొడిలో కూడా రంగు కోసం షూ పాలీష్కు వాడే కెమికల్‌ను కొందరు వినియోగిస్తుంటారు. వాణిజ్య పన్నుల శాఖ అధికారులు, సిబ్బంది అందిన కాడికి దోచేసుకుని నాలుగు రూపాయలు సంపాదించి వెళ్లిపోదామనే ఆలోచన తప్ప అక్రమ వ్యాపారంపై కొరడా ఝుళిపించి సక్రమంగా పన్నులు కట్టేలా చేయడంలో తీవ్రంగా విఫలమయ్యారు. వ్యాపారులు ఇచ్చే మామూళ్లతో సరిపుచ్చుకుంటున్నారు. జీఎస్టీ విధించిన తర్వాత పలు వ్యాపారాల గుట్టు రట్టువుతోంది. దీని వలన తమ వ్యాపార లావాదేవీలు బయటకు వస్తాయని భావించిన రెడీమేడ్ వ్యాపారస్తులు కొత్త అక్రమ రవాణాకు తెరలేపారు. గతంలో కలకత్తా, ఢిల్లీ ఇతర ప్రాంతాల నుంచి పార్శిల్ వాహనాల ద్వారా చీరాలకు వస్త్రాలు రవాణా చేసేవారు. దీని వలన మధ్యలో వాణిజ్య పన్నుల శాఖ అధికారులు పట్టుకుని జీఎస్టీ పన్నులతో పాటు అక్రమ రవాణాకు భారీగా జరిమానా విధిస్తుండడంతో వారి కన్ను కప్పి రైళ్లలో తరలిస్తున్నారు. కలకత్తా నుంచి విజయవాడకు చిన్నారులు, యువత, మహిళలు వినియోగించే అన్ని రెడీమేడ్ వస్త్రాలను తరలించి అక్కడ నుంచి కృష్ణా ఎక్స్‌ప్రెస్‌తో పాటు పలు రైళ్లలో తరలిస్తున్నారు. చీరాలలో 150–170 వరకు రెడీమేడ్ దుకాణాలున్నాయి. వస్త్ర వ్యాపారంలో చినబొంబాయిగా పేరున్న చీరాలకు రాష్ట్రంలోని పలు ప్రాంతాల నుంచి వస్త్రాలు కొనుగోలు చేసేందుకు వస్తుంటారు. చాలా తక్కువ ధరలకు కలకత్తా నుంచి రెడీమేడ్ వస్త్రాలు చీరాలకు వస్తాయి. అలానే చీరాల నుంచి పర్చూరు, మార్టూరు, చినగంజాం, ఒంగోలులోనిరెడీమేడ్ దుకాణాలకు వస్త్రాలను ఎగుమతి చేస్తుంటారు. కళ్లు గప్పి..పన్ను ఎగ్గొట్టి: రెడీమెడ్ వస్త్రాలు జీఎస్టీ పరిధిలో ఉన్నాయి. వీటిపై ఐదు శాతం జీఎస్టీ విధించింది. అయితే వ్యాపారులు లక్షకు రూ.5 వేలు చెల్లించడం తమకేమి అవసరం అనుకోవడంతో పాటు ఒక్కసారి జీఎస్టీ చెల్లిస్తే నెలకు ఏడాదిలో జరిగే క్రయవిక్రయాల లొసుగులు బహిర్గమవుతాయని భయపడిన వారు పైసా కూడా పన్ను చెల్లించకుండా పక్కా వ్యూహం పన్నారు. కలకత్తా నుంచి ప్రయాణీకుల రైళ్లలో చీరాలకు తరలించి వాటిని నేరుగా రెడీమేడ్ దుకాణాలకు తరలిస్తున్నారు. ఇది కొద్ది నెలలుగా జరుగుతోంది. ఈ అక్రమ రవాణాకు చీరాలలో ఒక ముఠా ఏర్పడింది. ఇందులో దియాజ్ అనే వ్యక్తి ప్రధాన సూత్రధారి. వచ్చిన సరుకును ఎవరి కళ్లకూ కనిపించకుండా జిల్లాలోని రెడీమేడ్ దుకాణాలకు తరలించడంతో పాటు వాణిజ్య పన్నుల అధికారులను తమ దారిలోకి తెచ్చుకోవడం అతని పని. ఈ అక్రమ రవాణాలో దియాజ్ లక్షలాది రూపాయలు పోగేసుకున్నట్లు సమాచారం. రైళ్ల ద్వారా రోజూ రూ.15– రూ.20 లక్షల విలువైన వస్త్రాలు దిగుమతి అవుతున్నాయని ఒక రెడీమేడ్ వస్త్ర వ్యాపారే చెప్పడం గమనార్హం. అక్రమ రవాణా వ్యవహారం వాణిజ్య పన్నుల శాఖ కమిషనర్ దృష్టికి: రైళ్లలో జరుగుతున్న రెడీమేడ్ వస్త్రాల అక్రమ రవాణాపై చీరాలకు చెందిన కొందరు స్థానిక వాణిజ్య పన్నుల శాఖ అధికారులకు ఫిర్యాదు చేశారు. కొద్ది రోజుల పాటు అధికారులకు ఫిర్యాదు చేసినా ఒకేఒక్కసారి మాత్రం ఫిర్యాదుదారులు అక్రమ రవాణా చేస్తున్న వాహనాలను దగ్గరుండి చూపించడంతో పట్టుకున్నారు. అయితే ఆ తర్వాత నెలలో ప్రతిరోజు జరుగుతున్నా ఆ అధికారులకు ఫిర్యాదు చేస్తున్నా పట్టించుకున్న పాపాన పోలేదు. దీంతో ఆ వ్యక్తులు నేరుగా అక్రమ రవాణా జరుగుతున్న తీరును ఫొటోలతో సహా కమిషనర్ దృష్టికి తీసుకెళ్లినట్లు తెలుస్తోంది. కార్యాలయ ఒత్తిడితో ఒక్కసారి మాత్రమే రైల్వేస్టేషన్లో పట్టుకున్నట్లు సమాచారం. కొద్ది నెలలుగా జరుగుతున్న ఈ తంతు వాణిజ్య పన్నుల శాఖ అధికారులకు, సిబ్బందికి పూర్తిగా సమాచారం ఉంది. రోజూ లక్షల్లో జరుగుతున్న ఈ వ్యాపారంపై కనీసం దాడులు చేయడంతో పాటు రవాణాను అడ్డుకునే ప్రయత్నం చేయకపోవడం విశేషం. ఇందుకు పలు కారణాలు ఉన్నాయి. రెడీమేడ్ వస్త్ర వ్యాపారులంతా తమపై దాడులు చేయకుండా ఏడాదికి రూ.5 – రూ.7 లక్షలు మామూళ్లు చెల్లిస్తారనే ఆరోపణలు ఉన్నాయి. కార్యాలయంలో పనిచేసే సిబ్బందికి కూడా ముడుపులు చెల్లించాల్సిందే. ఎప్పుడైనా రాష్ట్ర స్థాయిలో నుంచి దాడులు చేయాలని ఆదేశిస్తే వ్యాపారులకు ముందస్తుగానే సమాచారం అందుతుంది. మీ దుకాణాలపై దాడులు జరుగుతాయని మా అధికారులు వస్తున్నారంటూ ముందస్తుగానే సమాచారం ఇస్తారు. సదరు వ్యాపారులు మాత్రం అంతా సక్రమంగానే ఉన్నాయంటూ చూపించడం విశేషం. -
బట్టల షాపులో చోరీ: ముగ్గురు యువతుల అరెస్ట్
ఆమనగల్లు(మహబూబ్‌నగర్): దుస్తులు కొంటున్నట్లు నటించి రూ.20వేల విలువైన దుస్తులను చోరీచేసిన ముగ్గురు మహిళలను మహబూబ్‌నగర్ జిల్లా పోలీసులు పట్టుకున్నారు. పోలీసుల కథనం ప్రకారం..ఆమనగల్లు మండలం కడ్తాల గ్రామంలో నిత్యశ్రీ లేడీస్ క్లాత్ ఎంపోరియంలో ఈనెల 12న దుస్తులు కొనేందుకు ముగ్గురు మహిళలు వచ్చారు. ఖరీదు చేస్తున్నట్లుగా అక్కడి సిబ్బందిని నమ్మించి షాపులో ఉన్న రూ.20 వేల విలువ చేసే రెడీమేడ్ డ్రెస్సులను మాయం చేశారు. దీనిపై దుకాణం యజమాని ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు ప్రారంభించారు. శుక్రవారం ఉదయం నిందితురాళ్లు బస్టాండ్‌లో ఉండగా అదుపులోకి తీసుకున్నారు. వారి నుంచి దొంగిలించిన దుస్తులను స్వాధీనం చేసుకున్నారు. చోరీకి పాల్పడ్డ వారిని కృష్ణా జిల్లా ఇబ్రహీంపట్నంనకు చెందిన జమలమ్మ, కొండపల్లికి చెందిన మజ్జె అనసూయ, కుండ లక్ష్మిలుగా గుర్తించినట్లు పోలీసులు తెలిపారు. -
బట్టల దుకాణంలో చోరీ: మహిళ పట్టివేత
బయ్యారం(ఖమ్మం): ఖమ్మం జిల్లా బయ్యారం మండల కేంద్రంలోని ఓ దుకాణంలో గురువారం సాయంత్రం చీరల దొంగతనం జరిగింది. ఇందుకు పాల్పడ్డ ముఠాలో ఒక మహిళ పట్టుబడింది. వివరాలివీ.. పట్టణంలోని బస్టాండ్ సెంటర్లో సరితా శారీ సెంటర్ ఉంది. ఇందులోకి గురువారం సాయంత్రం నాలుగు గంటల సమయంలో ఐదుగురు మహిళలు ప్రవేశించారు. వారిలో ఇద్దరు చీరలను బేరం చేస్తుండగా మిగతా ముగ్గురూ ఇరవై చీరలను తమ బ్యాగుల్లో దాచిపెట్టుకున్నారు. ఒక చీరను కొనుక్కుని వారు వెళ్లిపోయిన తర్వాత.. చీరలకు సంబంధించిన ఖాళీ పెట్టెలు మాత్రమే మిగిలి ఉండటం దుకాణం సిబ్బంది గమనించి అప్రమత్తమయ్యారు. వెంటనే వారు గాలించగా ఒక మహిళ పట్టుబడింది. ఆమె వద్ద నుంచి 5 చీరలను స్వాధీనం చేసుకుని, పోలీసులకు అప్పగించారు. మిగతా వారు పరారయ్యారు. కాగా, వారంతా వరంగల్ జిల్లా మహబూబాబాద్ మండలం ముంజమడుగు తండా వాసులని తేలింది. -
‘కిక్’ కోసం దొంగతనం!
ఆదిలాబాద్: ‘కిక్’ సినిమాలో హీరో రవితేజలా దొంగతనం చేసి కిక్కు పొందాలనుకున్నారో ఏమో గానీ.. జిల్లా కేంద్రంలోని ఓ బట్టల దుకాణంలో జరిగిన చోరిని చూస్తే అలాగే అనిపిస్తోంది. దొంగతనానికి వచ్చిన దొంగలు తమ పని పూర్తి చేసుకొని ఎప్పుడు వెళ్లిపోదామని చూస్తుం టారు. కానీ ఇక్కడ దొంగతనం చేసిన వారు మాత్రం దర్జాగా ‘కిక్’, కేకే 786 అంటూ సినిమా పేరు రాసి మారి వెళ్ల డం అందరినీ విస్మయానికి గురిచేసింది. పట్టణంలోని ఆరాధన బట్టల దుకాణంలో శుక్రవారం రాత్రి గుర్తు తెలియని దుండగలు దుకాణం వెనుక గోడ(మూడంతస్తులు)ను తాడు సహాయం తో సినిమా ఫక్కీలో ఎక్కి మరీ దొంగతనం చేశారు. రూ.5 వేల నగదుతోపాటు, విలువైన బట్టలు ఎత్తుకెళ్లారు. సంఘటన స్థలానికి చేరుకున్న వన్‌టౌన్ సీఐ రఘు వివరాలను సేకరించారు. క్లూస్ టీంలతో అణువణువూ తనిఖీ చేరుుంచారు. కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నట్లు సీఐ తెలిపారు. -
ధానే బట్టలమిల్లులో అగ్నిప్రమాదం