ఆమనగల్లు(మహబూబ్‌నగర్): దుస్తులు కొంటున్నట్లు నటించి రూ.20వేల విలువైన దుస్తులను చోరీచేసిన ముగ్గురు మహిళలను మహబూబ్‌నగర్ జిల్లా పోలీసులు పట్టుకున్నారు. పోలీసుల కథనం ప్రకారం..ఆమనగల్లు మండలం కడ్తాల గ్రామంలో నిత్యశ్రీ లేడీస్ క్లాత్ ఎంపోరియంలో ఈనెల 12న దుస్తులు కొనేందుకు ముగ్గురు మహిళలు వచ్చారు. ఖరీదు చేస్తున్నట్లుగా అక్కడి సిబ్బందిని నమ్మించి షాపులో ఉన్న రూ.20 వేల విలువ చేసే రెడీమేడ్ డ్రెస్సులను మాయం చేశారు. దీనిపై దుకాణం యజమాని ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు ప్రారంభించారు.
శుక్రవారం ఉదయం నిందితురాళ్లు బస్టాండ్‌లో ఉండగా అదుపులోకి తీసుకున్నారు. వారి నుంచి దొంగిలించిన దుస్తులను స్వాధీనం చేసుకున్నారు. చోరీకి పాల్పడ్డ వారిని కృష్ణా జిల్లా ఇబ్రహీంపట్నంనకు చెందిన జమలమ్మ, కొండపల్లికి చెందిన మజ్జె అనసూయ, కుండ లక్ష్మిలుగా గుర్తించినట్లు పోలీసులు తెలిపారు.
బట్టల షాపులో చోరీ: ముగ్గురు యువతుల అరెస్ట్
Published Fri, Sep 18 2015 6:08 PM | Last Updated on Sun, Sep 3 2017 9:35 AM
Advertisement
Advertisement