
ఉత్తరప్రదేశ్‌లోని కాన్పూర్‌లో ఆవు మొదలుకొని ఆడ కుక్క వరకూ.. ఇలా పలు జంతువులపై అత్యాచారం జరిపినట్లు ఆరోపణలు వచ్చిన ఒక వృద్దుడిని పోలీసులు అరెస్టు చేశారు. పోలీసు అధికారి రవీంద్రకుమార్ మాట్లాడుతూ ఈ ఉదంతంలో గుజైనీ నివాసి విజేంద్ర మిశ్రా(62)ను అరెస్టు చేశామన్నారు.
సీసీటీవీ ఫుటేజ్ ఆధారంగా నిందితుడిని అదుపులోకి తీసుకున్నామన్నారు. నిందితునిపై సెక్షన్ 377 కింద కేసు నమోదు చేశామన్నారు. కాగా నిందితునిపై గతంలోనూ పలు నేరారోపణలు వచ్చాయని తెలిపారు. జాయింట్ కమిషనర్ ఆనంద్ ప్రకాష్ తివారి మాట్లాడుతూ పోలీసులు తమ దర్యాప్తులో పలు సీసీటీవీ ఫుటేజ్‌లను పరిశీలించారని, వాటిలో మిశ్రా బహిరంగ ప్రదేశాల్లో వివిధ జంతువులతో లైంగిక చర్యలకు పాల్పడినట్లు స్పష్టమయ్యిందన్నారు.
మిశ్రా మానసికంగా అనారోగ్యానికి గురయ్యాడని, అతనిని ఆసుపత్రికి తరలించాలని నిర్ణయించామన్నారు. దీనికిముందు బులంద్‌షహర్‌లోనూ ఇటువంటి ఉదంతం వెలుగు చూసింది. ఈ ప్రాంతానికి చెందిన 65 ఏళ్లవృద్దుడు పెంపుడు కుక్కతో లైంగిక చర్య జరిపాడు. దీనిని సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. ఆ శునకం యజమాని ప్రేమ్‌చంద్ ఈ విషయమై పోలీసులకు ఫిర్యాదు చేశారు. దీంతో పోలీసులు ఆ వృద్దుడుని అరెస్టు చేసి, కోర్టులో ప్రవేశపెట్టారు. ప్రస్తుతం ఆ వృద్ధుడు జైలు శిక్ష అనుభవిస్తున్నాడు.
ఇది కూడా చదవండి: అది 48 ఏళ్ల క్రితంనాటి లెటర్.. ఎలా లభ్యమయ్యిందంటే..
Comments
Please login to add a commentAdd a comment