
ఆవు నుంచి పాలు సేకరిస్తున్న రైతు
వడమాలపేట: చిత్తూరు జిల్లా వడమాలపేట మండలంలోని ఎన్‌వీఆర్ కండ్రిగలో ఓ ఆవు పాలు పితకకుండానే ఇస్తోంది. చూడి కట్టకనే.. ఈత ఈనకుండానే .. పొదుగు లేకున్నా.. ఆవుకు పాలు కారడాన్ని వింతగా మారింది. ఈ వార్త వైరల్‌గా మారింది. గ్రామానికి చెందిన రైతు వెంకటరమణారెడ్డికి ఆవు ఉంది. ఆదివారం పితకుండానే పాలు కారుతుండడాన్ని రైతు గుర్తించాడు. దీంతో పితకగా ఆ ఆవు రెండు లీటర్ల పాలిచ్చింది. ఈ వార్త స్థానికంగా హాట్‌టాపిక్ అయ్యింది. ఇలా ఆవు పాలు ఇవ్వడంపై వడమాలపేట పశువైద్యశాల లైవ్‌స్టాక్ ఆఫీసర్ లోకనాథం వివరణ ఇచ్చారు. పశువుల్లో హర్మోన్ల సమస్యతో ఇలా జరుగుతుంటుందని తెలిపారు.
Comments
Please login to add a commentAdd a comment