vadamalapeta
-
భవిష్యత్తుపై ఎన్నో కలలు.. భర్తతో అమెరికా జీవితం గురించి ఆశలు..
వడమాలపేట (చెన్నై): ఆమె భవిష్యత్తుపై ఎన్నో కలలు కంది.. కాబోయే భర్తతో అమెరికాలో మొదలుపెట్టబోయే జీవితం గురించి ఆశలు.. అయితే విధి రోడ్డు ప్రమాదం రూపంలో కల్లలు చేసింది. ఆమె ఆశల్ని చిదిమేసింది. తన వివాహానికి కల్యాణ మండపం బుక్ చేయడానికి వస్తూ ఆమె తిరిగిరాని లోకాలకు చేరుకుంది. పోలీసుల కథనం మేరకు.. తమిళనాడులోని కాంచీపురానికి చెందిన సెల్వంకు ఇద్దరు కుమార్తెలు. పెద్దకుమార్తె ప్రియాంక(30) ఎంఈ పూర్తి చేసింది. గత వారం ఆమెకు పెళ్లి సంబంధం కుదిరింది. తిరుపతి లేదా తిరుమలలో వివాహం చేయాలని పెద్దలు నిర్ణయించారు. పెళ్లి తరువాత ఆమె భర్తతో అమెరికా వెళ్లాల్సి ఉంది. కల్యాణ మండపం బుక్ చేయడానికి అమ్మ, నాన్న, చిన్నాన్న కొడుకుతో కలిసి సోమవారం బొలెరో వాహనంలో ప్రియాంక తిరుపతికి బయల్దేరారు. నగరి వరకు కారును ఆమె తండ్రి నడుపుతూ వచ్చాడు. అయితే అతడు అలసిపోవడంతో ప్రియాంక అక్కడ నుంచి డ్రైవింగ్ చేసింది. మార్గమధ్యంలో వడమాలపేట మండలం అంజేరమ్మ ఆలయం వద్ద ఉన్న స్పీడ్ బ్రేకర్ వద్ద వాహనం అదుపు తప్పి బోల్తాపడింది. దీంతో ప్రియాంక తీవ్రగాయాలతో అక్కడికక్కడే మృతి చెందింది. తల్లిదండ్రులకు ఎలాంటి గాయాలు కాలేదు. తమ్ముడికి మాత్రం స్వల్పగాయాలయ్యాయి. ప్రియాంక బంధువులు కాంచీపురం, చెన్నై, నగరి తదితర ప్రాంతాల నుంచి హుటాహుటిన ఘటనాస్థలికి చేరుకున్నారు. ప్రైవేటు అంబులెన్సులో మృతదేహాన్ని కాంచీపురానికి తరలించారు. చదవండి: (ఆమె కోసం ఎంతకైనా.. ప్రియురాలికి గిఫ్ట్ ఇచ్చేందుకు భార్య..) -
హృదయ విదారకం; నాన్నను చూడాలంటూనే.. మృత్యువొడికి
వడమాలపేట: భార్యపై కోపంలో కొడుకుపై పెట్రోల్ పోసి నిప్పు పెట్టిన ఘటనలో చికిత్స పొందుతూ కోలుకోలేక బాలుడు మృత్యువొడి చేరాడు. వివరాలివీ.. తిరుపతి జిల్లా వడమాలపేట మండలం బట్టీకండ్రిగ ఆది ఆంధ్ర వాడకు చెందిన రమేష్‌కు భార్య ఐశ్వర్యతో గత కొంతకాలంగా మనస్పర్థలు ఉన్నాయి. ఈ నేపథ్యంలో తరచూ గొడవ పడటం, విషయం పోలీసుస్టేషన్‌కు వెళ్లడం జరుగుతోంది. అయితే గత సోమవారం కూడా ఇద్దరి మధ్య గొడవ చోటు చేసుకోగా ఐశ్వర్య అదే గ్రామంలోని పుట్టింటికి వెళ్లింది. అప్పటికే మద్యం మత్తులోని రమేష్.. ఆ కోపాన్ని కుమారుడు మహేష్(7)పై చూపుతూ పెట్రోల్ పోసి నిప్పంటించాడు. రెండు రోజులుగా తిరుపతి రుయాలోని చిన్న పిల్లల ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న చిన్నారి బుధవారం రాత్రి కన్నుమూశాడు. కన్న తండ్రే ఇంతటి ఘాతుకానికి పాల్పడినా.. ఆసుపత్రిలో చివరి శ్వాస వరకు నాన్నను చూడాలని కోరడం, ఆ కోరిక తీరకుండానే తుదిశ్వాస విడిచిన తీరు హృదయ విదారకం. ప్రేమించి పెళ్లి చేసుకున్నా.. అనుమానం పెనుభూతమై ఆ కుటుంబంలో రగిల్చిన చిచ్చు ఆ ప్రేమకు ప్రతిరూపమైన చిన్నారినే బలితీసుకోవడం శోచనీయం. -
వైరల్: పితకకుండానే పాలొచ్చేస్తున్నాయి.. ఆవు నుంచి ‘పాలధార’
వడమాలపేట: చిత్తూరు జిల్లా వడమాలపేట మండలంలోని ఎన్వీఆర్ కండ్రిగలో ఓ ఆవు పాలు పితకకుండానే ఇస్తోంది. చూడి కట్టకనే.. ఈత ఈనకుండానే .. పొదుగు లేకున్నా.. ఆవుకు పాలు కారడాన్ని వింతగా మారింది. ఈ వార్త వైరల్‌గా మారింది. గ్రామానికి చెందిన రైతు వెంకటరమణారెడ్డికి ఆవు ఉంది. ఆదివారం పితకుండానే పాలు కారుతుండడాన్ని రైతు గుర్తించాడు. దీంతో పితకగా ఆ ఆవు రెండు లీటర్ల పాలిచ్చింది. ఈ వార్త స్థానికంగా హాట్‌టాపిక్ అయ్యింది. ఇలా ఆవు పాలు ఇవ్వడంపై వడమాలపేట పశువైద్యశాల లైవ్‌స్టాక్ ఆఫీసర్ లోకనాథం వివరణ ఇచ్చారు. పశువుల్లో హర్మోన్ల సమస్యతో ఇలా జరుగుతుంటుందని తెలిపారు. -
రెడ్ జోన్‌గా వడమాలపేట
సాక్షి, వడమాలపేట(చిత్తూరు జిల్లా): వడమాల గ్రామంలో ఓ యువకుడికి ఆదివారం కరోనా నిర్ధారణ కావడంతో ఆ ప్రాంతాన్ని రెడ్‌జోన్‌గా అధికారులు సోమవారం ప్రకటించారు. వాహనాల రాకపోకలను నియంత్రిస్తూ బారికేడ్లు ఏర్పాటు చేశారు. ఇంటి నుండి బయటకురా వద్దంటూ వడమాల పేట పోలీసులు లౌడ్ స్పీకర్ల ద్వారా హెచ్చరికలు జారీ చేస్తున్నారు. వసతి గృహాల వద్ద నున్న మురికి కాలువలు శుభ్రపరుస్తూ పంచాయతీ సిబ్బంది బ్లీచింగ్ పౌడర్ చల్లారు. అత్యవసర పరిస్థితుల్లో సమాచారం మేరకు సమస్యల పరిష్కారానికి అనుమతి వెసులుబాటు కల్పిస్తామని, వడమాలపేట చుట్టుపక్కల ప్రాంతాల్లోని ప్రజలందరూ అప్రమత్తంగా ఉండాలని అధికారులు ఆదేశాలు జారీ చేశారు. కాగా, ఎమ్మెల్యే ఆర్కే రోజా అధికారులతో ఎంపీడీవో కార్యాలయంలో సమీక్షించారు. ఆమె మాట్లాడుతూ కరోనా వచ్చిన యువకుడి కుటుంబ సభ్యులతోపాటు గ్రామంలో ప్రతి ఇంటికీ వెళ్లి సర్వే చేయాలన్నారు. అధికారులతో కలిసి వడమాల గ్రామంలో సోడియం హైపోక్లోరైట్ ద్రావణాన్ని పిచికారీ చేశారు. కూరగాయల పంపిణీ నగరి మున్సిపల్ పరిధి సత్రవాడ 18,19 వార్డుల్లోని 500 కుటుంబాలకు ఏపీఐఐసీ చైర్పర్సన్, ఎమ్మెల్యే ఆర్కేరోజా కూరగాయలు అందజేశారు. ఎమ్మెల్యే భర్త ఆర్కేసెల్వమణి, దాతలు వీఎం రామచంద్రన్, ఈవీ బాలకృష్ణన్, బీఆర్వీ అయ్యప్పన్ పాల్గొన్నారు. అబ్దుల్ కలాం షటిల్ బ్యాడ్మింటన్ అసోసియేషన్ ఆధ్వర్యంలో రోజా చారిటబుల్ ట్రస్టుకు రూ.10 వేలు ఇచ్చారు. విజయపురం మండలంలోని 500 మంది అధికారులకు ఎమ్మెల్యే అన్నదానం చేశారు. మల్లారెడ్డి కండ్రిగ ప్రజలకు బియ్యం, కూరగాయలు అందజేశారు. ఓజీ కుప్పానికి చెందిన వైఎస్సార్సీపీ నేత బాబు రూ.10 వేలు అందించారు. హైపోక్లోరైట్ పిచికారీ చేస్తున్న ఎమ్మెల్యే ఆర్కే రోజా తాజా అప్డేట్: ఏపీలో కొత్తగా 12 కరోనా కేసులు -
సమాజంలో ఉపాధ్యాయులే కీలకం
వడమాలపేట : విద్యార్థులు ఏ రంగంలో రాణించాలన్నా, సమాజం బాగుండాలన్నా గురువులే కీలకమని నగరి ఎమ్మెల్యే ఆర్కే రోజా అన్నారు. శనివారం పత్తిపుత్తూరు జిల్లాపరిషత్ ఉన్నత పాఠశాలలో కొత్తగా నిర్మించిన అదనపు భవనాలను ఆమె ప్రారంభించారు. ఈసందర్భంగా ఆమె మాట్లాడుతూ ప్రభుత్వ పాఠశాలల్లో చదివే పిల్లలు పేదకుటుంబాల నుంచి వచ్చిన వారేనని, వారిని ఉన్నతంగా తీర్చిదిద్దాల్సిన బాధ్యత ఉపాధ్యాయులు తీసుకోవాలన్నారు. అనంతరం ఆమె ప్రాథమిక పాఠశాలను పరిశీలించారు. భవనం శిథిలావస్థకు చేరుకుందని పాఠశాల పల్లంలో ఉండడం వల్ల వర్షం వస్తే నీళ్లు తరగతి గదులలోకి వస్తాయని గ్రామస్తులు ఫిర్యాదు చేశారు. సమస్యను పరిష్కరిస్తానని హామీ ఇచ్చారు. అంగన్వాడీలకు 200 కుర్చీల పంపిణీ.. మండలం గ్రాంట్ నుంచి 43 అంగన్వాడీ కేంద్రాలకు 200 కుర్చీలను శనివారం ఎమ్మెల్యే ఆర్కే రోజా పంపిణీ చేశారు. అంగన్వాడీ కేంద్రాలకు పౌష్టికాహారం కోసం వచ్చే గర్భిణులు, బాలింతలు కిందకూర్చుని భోజనం చేయడానికి పడుతున్న ఇబ్బందులను గుర్తించే వీటిని మండల గ్రాంట్ నుంచి అందజేస్తున్నట్లు తెలిపారు. అంగన్వాడీ టీచర్ల డ్రస్కోడ్, పనితీరు బాగుందని కితాబిచ్చారు. చిన్నక్క మృతికి సంతాపం.. మండలంలోని పూడి గ్రామంలో వైఎస్సార్సీపీ నాయకుడు రామయ్య కుమార్తె చిన్నక్క మృతికి ఎమ్మెల్యే ఆర్కే రోజా సంతాపం తెలిపారు. శనివారం ఆమె పూడి గ్రామానికి చేరుకుని చిన్నక్క మృతదేహానికి పూలమాలలు వేసి నివాళులు అర్పించారు. కుటుంబ సభ్యులను పరామర్శించి తన ప్రగాఢ సంతాపాన్ని తెలియజేశారు. కార్యక్రమాలలో ఎంపీపీ మురళీధర్‌రెడ్డి, ఎంపీడీఓ శ్రీలక్ష్మి, ఎంఈఓ పద్మావతి, సీడీపీఓ పద్మజారెడ్డి, ప్రధానోపాధ్యాయుడు జైమునీంద్రులు, సూపర్వైజర్ తులసీ, పత్తిపుత్తూరు సర్పంచ్ ఆవుల ప్రతిమ, ఎంపీటీసీ రంగనాథం, నాయకులు సదాశివయ్య, సుబ్రమణ్యంయాదవ్, మధన్‌మోహన్‌రెడ్డి, సుబ్రమణ్యంరెడ్డి, తులసీరామిరెడ్డి, హరిరెడ్డి, లోకేష్‌రెడ్డి, వెంకటరెడ్డి, రాజశేఖర్, నాగరాజు, అంగన్వాడీ టీచర్లు పాల్గొన్నారు. -
విద్యుత్‌షాక్‌తో కూలీ మృతి
వడమాలపేట: మండల కేంద్రమైన వడమాలపేట పంచాయతీలో మంగళవారం విద్యుత్ షాక్‌తో భవన నిర్మాణ కూలీ మృతిచెందాడు. పోలీసుల కథనం మేరకు... పుత్తూరు మున్సిపాలిటీ పరిధిలోని గొల్లపల్లి పంచాయతీ సదాశివవడ్డిపల్లికి చెందిన శివయ్య(24) వడమాల పంచాయతీ యాదవకాలనీలో కొత్తగా నిర్మిస్తున్న ఇంటి పనికి వచ్చాడు. ఇంటి పైభాగంలో పనులు చేస్తుండగా 11 కేవీ విద్యుత్ లైన్ తగలడంతో అక్కడి నుంచి కింద ఉన్న ఇటుకలపై పడ్డాడు. తలకు తీవ్ర గాయాలు కావడంతో అక్కడికక్కడే మృతి చెందాడు. సమాచారం అందుకున్న వడమాలపేట ఎస్ఐ నరేంద్ర, రేణిగుంట రూరల్ సీఐ సాయినాథ్ సంఘటనా స్థలానికి చేరుకున్నారు. ఇంటి యజమాని మణి, మేస్త్రీ శివను విచారించారు. మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం పుత్తూరు ప్రభుత్వాస్పత్రికి తరలించారు. మృతుడికి రెండేళ్ల క్రితం వివాహమైంది. కేసు దర్యాప్తు చేస్తున్న సీఐ తెలిపారు. -
పోలీసుల అదుపులో పోలీసులు..
తిరుపతి: పోలీసుల అదుపులో పోలీసులు. ఇదేదో సినిమా కథ కాదు...రియల్ స్టోరీనే. ఎర్రచందనం స్మగ్లర్ నుంచి అదనపు డబ్బు డిమాండ్ చేసిన ఖాకీలు.. చివరకూ పోలీసులకు చిక్కిన ఘటన చిత్తూరు జిల్లాలో చోటుచేసుకుంది. వివరాల్లోకి వెళితే... ఎర్రచందనం స్మగ్లర్లను బెదిరించి డబ్బులు వసూలు చేసిన కేసులో చిత్తూరు జిల్లా వడమాలపేట ఎస్ఐ, ఐడీ హెడ్‌కానిస్టేబుళ్లని రేణిగుంట పోలీసులు శుక్రవారం అరెస్ట్ చేశారు. వారిపై వివిధ సెక్షన్ల కింద కేసు నమోదు చేశారు. పోలీసుల కథనం ప్రకారం ... ఎర్రచందనం స్మగ్లర్ శివని ఇటీవల వడమాల ఎస్ఐ రాజశేఖరరెడ్డి అదుపులోకి తీసుకున్నారు. శివ ద్వారా ఎర్రచందనం స్మగ్లర్ల వివరాలను సేకరించారు. సదరు స్మగ్లర్లను శివ ద్వారా బెదిరించి సుమారు రూ. 20 లక్షల వరకు నగదును ఎస్ఐ రాజశేఖరెడ్డి హెడ్ కానిస్టేబుల్ కుమార్, కానిస్టేబుల్ చినబాబు రాబట్టినట్లు తెలిసింది. ఆ క్రమంలో శివను వీరు మరింత వేధింపులకు గురి చేసి... మరో రూ.4 లక్షలు రాబట్టాలని ఆదేశించారు. ఆ క్రమంలో శివను వీరు భౌతికంగా గాయపరిచినట్లు సమాచారం. ఈ వేధింపులు తాళలేక శివ గురువారం మధ్యాహ్నం రేణిగుంట రూరల్ సీఐను ఆశ్రయించాడు. దాంతో సీఐ ఆదేశాల మేరకు వడమాల పోలీసులపై రేణిగుంట పోలీసులు కేసు నమోదు చేశారు. ఆ క్రమంలో వడమాల పోలీస్ స్టేషన్లో రేణిగుంట పోలీసులు తనిఖీలు నిర్వహించారు. ఎస్ఐ రాజశేఖరరెడ్డి టేబుల్ డ్రాయిర్లోనే దాదాపు రూ. 5 లక్షల నగదు దొరికినట్లు తెలిసింది. స్మగ్లర్ శివ ఫిర్యాదు అనంతరం రేణిగుంట పోలీసులు తనిఖీలలో వడమాల పోలీసులు వద్ద దాదాపు రూ. 11 లక్షల నగదు లభ్యమైనట్లు సమాచారం. అదుపులోకి తీసుకున్న వీరిని ...పోలీసులు రహస్యంగా విచారణ చేపడుతున్నారు. అయితే ఈ విషయాలను మాత్రం బయటకు పొక్కనీయడం లేదు. -
పోలీసుల అదుపులో పోలీసులు..
-
వడమాలపేట చేరుకున్న సమైక్య శంఖారావం