ఆవుకు ‘డిజిటల్‌’ కృత్రిమ గర్భధారణ | Digital Process Of Artificial Insemination Process In Cow In Telangana | Sakshi
Sakshi News home page

ఆవుకు ‘డిజిటల్‌’ కృత్రిమ గర్భధారణ

Published Tue, Apr 26 2022 2:39 PM | Last Updated on Tue, Apr 26 2022 2:49 PM

Digital Process Of Artificial Insemination Process In Cow In Telangana - Sakshi

సాక్షి, హైదరాబాద్‌: పశువుల కృత్రిమ గర్భధారణ విధానంలో తెలంగాణ రాష్ట్రానికి చెందిన పశువైద్య నిపుణులు ముందడుగు వేశారు. ఇప్పటివరకు నాటు పద్ధతిలో (జననాంగంలోకి చేయి పెట్టడం ద్వారా) జరుపుతున్న ఈ ప్రక్రియను తొలిసారి డిజిటల్‌ పద్ధతిలో నిర్వహించారు. ఇందుకు పీవీ నరసింహా రావు పశువైద్య విశ్వవిద్యాలయం వేదిక అయింది. ఈ ప్రయోగంలో భాగంగా లేజర్‌ కిరణాలతో కూడిన ఎండోస్కోపీ ట్యూబ్‌ ఇచ్చే డిస్‌ప్లే సమా చారం ఆధారంగా వీర్యాన్ని ఓ ఆవు గర్భాశయంలోకి పంపారు. ఎండోస్కోపీ ట్యూబ్‌తోపాటు వచ్చే పెన్‌డ్రైవ్‌ను కాలర్‌ హ్యాంగింగ్‌ మొబైల్‌ ఫోన్‌కు అటాచ్‌ చేయడం ద్వారా గర్భాశయ ముఖద్వారం, వీర్యం వెళుతున్న విధానం కనిపించేలా ఏర్పాట్లు చేసుకొని ఈ ప్రయోగం నిర్వహించారు.

అలా పంపిన వీర్యం పూర్తిస్థాయిలో పశువు గర్భాశయం లోకి వెళ్లినట్లు నిర్ధారణ అయింది. ఈ ప్రయోగంలో పశువైద్య విశ్వవిద్యాలయం అసోసియేట్‌ ప్రొఫెసర్‌ డాక్టర్‌ రాంసింగ్‌ లకావత్‌తోపాటు ఇంటర్న్‌షిప్, ఫైనలియర్‌ విద్యార్థులు పాల్గొన్నారు. సర్జరీ విభాగం హెచ్‌వోడీ ప్రొఫెసర్‌ ఇ.ఎల్‌. చంద్రశేఖర్‌ సమక్షంలో ఈ ప్రయోగం నిర్వహించారు. నాటు పద్ధతి వల్ల 30–40%  ఫలదీకరణే జరుగుతుండగా డిజిటల్‌ గర్భధారణ విధానంలో 60–70 శాతం వరకు ఫలదీకరణ అవకాశం ఉందని పశువైద్య నిపుణులంటున్నారు. ఇప్పటికే ఉత్తరాది రాష్ట్రాల్లో ఈ విధానం అమలవుతోందని పేర్కొన్నారు. 

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement