
గ్రామంలో ఊరేగింపుగా తీసుకెళ్తున్న మైలారంవాసులు
నస్రుల్లాబాద్ నిజామాబాద్ : హిందువులు పవిత్రంగా కొలిచి గోమాతగా పిలుచుకునే పశువు ఆవు. మండలంలోని మైలారంలో ఎనిమిదేళ్లుగా ఇంటింటికి తిరిగిన ఆవు సోమవారం అకస్మాత్తుగా మృతి చెందింది. గ్రామంలోని శ్రీరాజరాజేశ్వరుని ప్ర తి రూపంగా గ్రామస్తులు కొలిచేవారు. అలాం టి మరణంతో కనుమరుగవుతుందని మైలారం వాసులు శోక సంద్రంలో మునిగారు.
ఆ గోవు కు సోమవారం ఆరోగ్యం క్షీణించింది. దీంతో గ్రామపెద్దలు వెటర్నరీ డాక్టర్‌ను పిలిచి చికిత్స చేయించారు. ఆరోగ్యం పూర్తిగా క్షీణించిందని వైద్యులు చెప్పడంతో అదేరోజు సాయంత్రం గోమాత తనువు చాలించింది. తమ మధ్య ఇన్నేళ్లు ఉన్న గోవు ఇక కానరాదన్న నిజాన్ని జీర్ణించుకోలేకపోయారు.
రెండు దూడలు తల్లి ఆవు మళ్లి తిరిగి రాదని తెలియక బిక్కుబిక్కుమంటున్నాయని గ్రామస్తులు ఏడ్చారు. గ్రామస్తులు గోమాతను సకల లాంఛనాలతో వీడ్కోలు పలకాలని నిర్ణయించి మంగళవారం స్వర్గయాత్ర నిర్వహించారు. బాజాభజంత్రీలు, భజనలు, కీర్తనలు, భక్తి పాటల మధ్య ఊరేగించారు.
గ్రామంలోని ఇంటింటి ముందు ఆపి గోమాతకు అశ్రు నివాళులు అర్పించారు. గ్రామంలోని ప్రధాన వీధుల గుండా తీసుకెళ్లి శ్రీ రాజరాజేశ్వరుని గుట్ట కిందిభాగంలో పూడ్చి పెట్టారు. గ్రామ సర్పంచ్ సాయిరాం యాదవ్, ఎంపీటీసీ మహేందర్, ప్రభాకర్‌రెడ్డి, చంద్రా గౌడ్, బొట్టె రాములు యాదవ్, సుభాష్ గౌడ్, వడ్ల వెంకటి యువకులు ప్రశాంత్‌గౌడ్, లక్కియాదవ్, ఆనంద్, మహేందర్ గౌడ్, సాయాగౌడ్, వడ్ల సతీష్, గ్రామస్తులుభారీగాపాల్గొన్నారు.
Comments
Please login to add a commentAdd a comment