బైరెడ్డిపల్లె :అమ్మదనం.. సృష్టిలో అపూర్వమైనది. అనిర్వచనీయమైనది. ఇందులో జంతువులకూ మినహాయింపు ఉండదు. మండలంలోని పిచ్చిగుండ్లపల్లె గ్రామానికి చెందిన సుబ్బన్న పాడిఆవు ఇటీవల ఓ దూడకు జన్మనిచ్చింది. అయితే సుబ్బన్న ఇంటి వద్ద కాపలాగా ఉన్న శునకం ఆ దూడతో చనువుగా ఉండేది. దీంతో పాడిఆవు వద్ద దూడతో పాటు శునకం కూడా వెళ్లి పాలు తాగుతోంది. అయినా ఆవు కుక్కను పక్కకుతోసేయడం లేదు. దీన్ని చూసి స్థానికులు ఆశ్చర్యం వ్యక్తం చేస్తున్నారు.
Comments
Please login to add a commentAdd a comment