dog shows
-
సరిలేరు మాకెవ్వరూ
-
పెట్స్‌కి ఓనర్స్ కంటే ఎక్కువ ఫాలోవర్స్
సిటీలో పెట్స్ క్రేజ్ గురించి కొత్తగా చెప్పనవసరం లేదు. అయితే మనలాగే పెట్స్‌కు కూడా సోషల్ మీడియా అకౌంట్స్ పెరుగుతుండటం చెప్పుకోదగిన విశేషం. దీంతో అత్యధిక సంఖ్యలో సోషల్ మీడియాలో సందడి చేస్తున్నాయి. పెట్స్ చేసే సందడిని సోషల్ మీడియా పేజ్‌లో అప్డేట్ చేసి ఇతరులతో పంచుకోవడం.. వారు సంతోషం వ్యక్తం చేస్తూ కామెంట్ పెట్టడంతో రెండు వైపుల వారు హ్యాపీగా ఫీల్ అవుతున్నారు. దీంతో రోజురోజుకీ పేజ్‌లకు క్రేజ్ పెరుగుతోంది. సాక్షి, కాలేజ్ కరస్పాండెంట్: ఎక్కువ మంది నగరానికి చెందిన టీనేజర్లు పెట్స్ కోసం ప్రత్యేక అకౌంట్స్ నిర్వహిస్తున్నారు. ఈ ట్రెండ్ చూసి పెట్స్ ఆఫ్ హైదరాబాద్ పేరుతో ఒక పేజ్ స్టార్ట్ చేశారు. ఆ పేజ్ మీద అందరి పెట్స్‌ని పోస్ట్ చేసి అత్యధిక లైక్స్ వచ్చిన పెట్ని విజేతగా నిర్ణయించే తరహా పోటీలు, విజేతలకు పెడిగ్రీన్ వంటి డాగ్‌ఫుడ్ నుంచి పెట్స్‌కి అవసరమైన మరెన్నో బహుమతులు ఇస్తామనే ప్రకటనలూ పెరిగాయి. సెలబ్రిటీలే స్ఫూర్తి.. చాలామంది సెలబ్రిటీలీ పెట్ వర్కింగ్‌కి ఊపునిస్తున్నారు. బాలీవుడ్, హాలీవుడ్ నటి ప్రియాంక చోప్రా పెట్ డయానా చోప్రాకి ఇన్‌స్ట్రాగామ్‌లో 1.49లక్షల ఫాలోవర్స్ ఉన్నారు. టాలీవుడ్ స్టార్ సమంత అక్కినేనికి కూడా ఒక పెట్ అకౌంట్ ఉంది. ముంబైకి చెందిన మాన్సి తల్వార్ బీగిల్స్, మేనార్డ్, క్లో... పెట్స్ పేజ్‌కు 24వేలకు పైగా ఫాలోవర్స్ ఉన్నారు. నగరానికి చెందిన సోషల్ మీడియా సెలబ్రిటీ, బిగ్‌బాస్ ఫేమ్ దీప్తి సునయన తన పెట్ టొమ్మీ కోసం ఏర్పాటు చేసిన ఇన్‌స్ట్రాగామ్ అకౌంట్‌కు 3,865 ఫాలోవర్స్ ఉన్నారు. టంగ్ ఔట్ ట్యూజ్ డేస్, హెడ్ టిట్ థర్స్‌డేస్, స్నగ్ విత్ పగ్... వంటి పేర్లతో సిటీలోని పెట్స్ ఫొటోలు, వీడియోలు కనువిందు చేస్తున్నాయి. దీని కోసం ప్రత్యేకంగా షూట్స్ కూడా పెట్టుకుంటున్న పెట్ ఓనర్స్ వాటిని సోషల్ మీడియాలో షేర్ చేస్తూ మురిసిపోతున్నారు. బడ్ని నేను బాగా ట్రైన్ చేశా. చాలా మందికి పెట్స్ అంటే ఇష్టం ఉంటుంది. కానీ రకరకాల కారణాల వల్ల వాళ్లు వాటిని పెంచలేకపోతుంటారు. అలాంటివారికి బడ్ లేదా సింబాతో నా అనుభవాలు షేర్ చేసుకోవడం నాకు నచ్చుతుంది. పెట్స్ మనల్ని నవ్వుల్లో ముంచుతాయి. హ్యాపీగా ఉంచుతాయి. అంతేకాదు జీవితం సంక్లిష్టమైంది కాదని నేర్పుతాయి. వీటివల్ల ప్రతి పరిస్థితిని చాలా ఈజీగా డీల్ చేయగలుగుతాం. తాజాగా మా కొత్త పప్ సింబాకు చాలా లైక్స్ వస్తున్నాయి. ప్రస్తుతం నాకు ఒక డాగ్, ఒక పిల్లి ఉన్నాయి. ఓ నెల తర్వాత రెండు పిల్లులు, ఒక డాగ్. సో.. ఈ అకౌంట్ ఒక్కరిది కాదు.. నాతో జీవించే మూగప్రాణులన్నింటిదీ. – ఆయుషి నా పెట్‌కి గుర్తింపు కావాలని.. ఇట్స్ మీ టామీ.. అనే నా పెట్ పేజ్‌కి భలే క్యూట్ కామెంట్స్ వస్తుంటాయి. నా పెట్‌కి ఒక గుర్తింపు రావాలని, దానితో నా జ్ఞాపకాలన్నీ మిగిలిన వారితో షేర్ చేసుకోవాలని ఇది స్టార్ట్ చేశా. టామీ నా మీదకు జంప్ చేయడం, నాతో ఫైట్ చేయడం.. నేను కొన్ని నిమిషాలు కనపడకపోతే వెతుక్కోవడం.. వంటి చేష్టలన్నీ నేను రికార్డ్ చేస్తుంటాను. నా ఫ్రెండ్స్ బంధువులు అందరికీ పెట్స్‌తో నా ఫీట్స్ చూడటం చాలా ఇష్టం. – ప్రణవి, కాలేజ్ స్టూడెంట్ ఫ్రెండ్స్ లైక్ చేసే పెట్ నాది.. నా పెట్ జ్యూస్ ఇంటికి వచ్చే ఫ్రెండ్స్‌కి జ్యూస్ బెస్ట్ ఫ్రెండ్ అయిపోయింది. దాంతో దాని ఫొటోస్ పంపమని దాని గురించిన రోజువారీ విశేషాలు చెప్పమంటున్నారు. అందుకే ఈ ఆలోచన వచ్చి అకౌంట్ స్టార్ట్ చేశా. దీని ద్వారా దాని గురించి తెలుసుకోవడంతో పాటు మాట్లాడుకోవడానికి కూడా వారికి కుదురుతోంది. అంతేకాకుండా అది ఎదుగుతున్న తీరు, దాని చేష్టల్లో మార్పు చేర్పులు.. వీటన్నింటికీ ఒక కేటలాగ్ నాకు తయారవుతోంది కూడా. మంచం మీద నన్ను చుట్టుకుని పడుకుని ఉండే పోస్ట్ నా ఫేవరెట్. – విశ్వజోషి -
పెట్స్ గలీజు చేస్తే యజమానులు శుభ్రం చేయాలి..
కర్ణాటక,శివాజీనగర: కబ్బన్ పార్కులో జంటలు ఫోటో షూట్లో అనుసరించాల్సిన విధానాలను సూచించిన తరువాత శునకాల బెడదపై దృష్టి సారించారు. పార్కులో జాగిలాలు గలీజు చేస్తే వాటి యజమానులే దానిని శుభ్రం చేయాలని ఉద్యానవన శాఖ స్పష్టంచేసింది. ప్రతిరోజు కబ్బన్ పార్కులో వందలాది మంది జాగిలాలతో వాకింగ్ చేస్తారు. ఈ సమయంలో కుక్కలు పార్కులో ఎక్కడపడితే అక్కడ గలీజు చేస్తుండడంతో సందర్శకులకు తీవ్ర ఇబ్బంది ఎదురవుతోంది. దీనికి పరిష్కారంగా ఉద్యానవన శాఖ ఈ నిర్ణయం తీసుకుంది. పార్కులోకి వచ్చే ప్రజలు ఉద్యానవనాన్ని పరిశుభ్రంగా ఉంచేందుకు శాఖతో సహకరించాలని అధికారులు కోరారు. కబ్బన్‌పార్కులో సందర్శకులు,పార్కులో పెంపుడు శునకాలతో వాకర్లు (ఫైల్) వరుస ఫిర్యాదులతో నిర్ణయం నియమాలను ఉల్లంఘించినవారికి జరిమానా విధిస్తామని తెలిపారు. కబ్బన్‌పార్కులో నెలకొంటున్న ఇబ్బందుల గురించి న్యాయవాదులు, ప్రజలు చేసిన ఫిర్యాదులను పరిగణించి శాఖ ఈ చర్యలకు సిద్ధమైంది. పార్కులోకి కుక్కల ప్రవేశాన్ని అరికట్టాలని కూడా కొందరు డిమాండ్ చేశారు. కొందరు హోటల్ యజమానులు తమతో మిగిలిపోయిన ఆహారాన్ని కబ్బన్ పార్కు వద్ద ఉన్న వీధి కుక్కలకు వేసేవారు. కుక్కలు తినగా మిగిలిన ఆహారాన్ని హోటల్ యజమానులే శుభ్రం చేయాల్సి వస్తుందని అధికారులు తెలిపారు. మిగిలిపోయిన భోజనాన్ని వేయటానికి ప్రత్యేక స్థలం ఏర్పాటు చేస్తామని చెప్పారు. -
అరుదైన శునకం ..ఖరీదు రెండు లక్షలా?
సాక్షి, అనంతపురం: కుక్క ధర లక్షలు పలుకుతోంది. ఇదెక్కడో అనుకుంటే పప్పులో కాలేసినట్లే.... మన అనంతపురంలోనే. అమెరికాలో కనిపించే మేలుజాతి శునకం ఇప్పుడు అనంతపురంలోనూ కనిపిస్తోంది. ఎంతో ఇష్టంగా తెచ్చుకున్న కుక్క ప్రస్తుతం యజమానికి కాసులను కురిపిస్తోంది. అమెరికాలో సెక్యూరిటీ కోసం బెల్జియం మెల్లాయిస్ జాతికి చెందిన శునకాన్ని అక్కడి పోలీసులు సెక్యూరిటీ కోసం వినియోగిస్తున్నారు. దీంతో ముచ్చటపడ్డ ప్రణీత్ అరుదైన జాతి శునకాన్ని అనంతపురానికి తెచ్చేసుకున్నాడు. అనంతపురంలో రెండో రోడ్డులో నివాసముంటున్న ప్రణీత్‌రెడ్డి బెల్జియం మెల్లాయిస్ జాతి శునకాన్ని పెంచుకుంటున్నారు. ప్రస్తుతం ఈ శునకం తొమ్మిది పిల్లలకు జన్మనిచ్చింది. ఈ జాతి కుక్క ఒక్కొక్కటి రూ.3లక్షలు పలుకుతోందని, పిల్లలైతే రూ.2లక్షల దాకా ఉంటుందని ప్రణీత్‌రెడ్డి చెబుతున్నారు. -
అమ్మదనం.. అపూర్వం
బైరెడ్డిపల్లె :అమ్మదనం.. సృష్టిలో అపూర్వమైనది. అనిర్వచనీయమైనది. ఇందులో జంతువులకూ మినహాయింపు ఉండదు. మండలంలోని పిచ్చిగుండ్లపల్లె గ్రామానికి చెందిన సుబ్బన్న పాడిఆవు ఇటీవల ఓ దూడకు జన్మనిచ్చింది. అయితే సుబ్బన్న ఇంటి వద్ద కాపలాగా ఉన్న శునకం ఆ దూడతో చనువుగా ఉండేది. దీంతో పాడిఆవు వద్ద దూడతో పాటు శునకం కూడా వెళ్లి పాలు తాగుతోంది. అయినా ఆవు కుక్కను పక్కకుతోసేయడం లేదు. దీన్ని చూసి స్థానికులు ఆశ్చర్యం వ్యక్తం చేస్తున్నారు. -
శునకానికి గౌరవ డిప్లొమా
మాస్టార్లు చెప్పే పాఠాలను శ్రద్ధగా విని, పరీక్షల్లో అడిగిన ప్రశ్నలకు సమాధానాలు రాసి, ఉత్తీర్ణులైతే తప్ప డిగ్రీ పట్టాలు చేతికి రావు. అలాంటిది ఇవేవీ చేయకుండానే ఓ శునకం ఆక్యుపేషనల్ థెరపీ డిప్లొమా పట్టాను అందుకుంది. ఆ సంగతేంటో ఓసారి చదవండి.. న్యూయార్క్‌లోని క్లార్క్సన్ యూనివర్సిటీ ఓ శునకానికి గౌరవ డిప్లొమా ప్రదానం చేసింది. అయితే ఈ శునకానికి ఈ గౌరవం దక్కడం వెనుక బ్రిటనీ హాలీ అనే అమ్మాయి కృషి ఎంతో ఉంది. ఇక్కడ కనిపిస్తున్న చిత్రంలో చక్రాల కుర్చీలో కనిపిస్తున్న అమ్మాయే బ్రిటనీ. క్లార్క్సన్ యూనివర్సిటీ నుంచి ఇటీవలే సైకాలజీలో ఆక్యుపేషనల్ థెరపీ స్పెషల్ సబ్జెక్టుగా మాస్టర్స్ డిగ్రీ అందుకుంది. అయితే ఈ థెరపీలో ఆమెకు ఎంతో చేదోడువాదోడుగా ఉన్న గ్రిఫిన్ అనే శునకానికి కూడా డిప్లొమా ఇవ్వాల్సిందిగా బ్రిటనీ సిఫారసు చేసింది. దీంతో గ్రిఫిన్ శక్తిసామర్థ్యాలు పరీక్షించిన యూనివర్సిటీ నిర్వాహకులు అందుకు అంగీకరించడమే కాకుండా డిప్లొమా అందజేశారు. ఈ విషయమై బ్రిటనీ మాట్లాడుతూ.. ‘నేనేదేదీ నేర్చుకున్నానో గ్రిఫిన్ కూడా అవన్నీ నేర్చుకుంది. అందుకే దానిపేరు నేనే సిఫారసు చేశా. యూనివర్సిటీ పాలకవర్గం పెట్టిన పరీక్షలో గ్రిఫిన్ అసాధారణమైన ప్రజ్ఞ చూపింద’ని చెప్పింది. గ్రిఫిన్ ఏం చేస్తుందంటే.. నార్త్ కరోలినాలోని విల్సన్‌కు చెందిన బ్రిటనీ చక్రాల కుర్చీ లేనిదే ఎటూ కదల్లేదు. కండరాల వ్యాధితో బాధపడుతున్న ఆమె వెంట నిరంతరం ఎవరో ఒకరు ఉండాల్సిందే. ఆ లోటును గ్రిఫిన్ తీరుస్తోంది. అంతేకాదు సైకాలజీ పేషంట్లకు సేవచేయడంలో బ్రిటనీకి అసిస్టెంట్‌గా పనిచేస్తోంది. వెస్ట్ వర్జీనియా జైళ్లల్లో పాస్4 ప్రిజన్ ప్రోగ్రామ్ ద్వారా ఆమె ఆ కుక్కను తెచ్చుకుంది. ఖైదీలు శిక్షణ ఇచ్చిన శునకం కావడంతో బ్రిటనీ చెప్పిన పనులన్నీ చకచకా చేసేది. -
డాగ్ షోయగం!
బీచ్‌రోడ్డు (విశాఖ తూర్పు): చిట్టిపొట్టి పప్పీలు.. ముద్దులొలికించిన ‘స్మార్ట్ బేబీ’లు.. ధైర్య సాహసాలకు ప్రతీకగా కనిపించే జాతి జాగిలాలు! అందంగా అగుపించి చూపుతిప్పుకోనివ్వని ము చ్చటైన జూలు విదేశీ వెరైటీలు. ఒక్కొక్కటీ ఒక్కో రకం. ఒక్కొక్కదాని తీరు ఒక్కో విధం. ఈ విభిన్న రకాల శునకాలన్నీ ఓ చోట చేరిన ప్రదర్శన ఆకట్టుకుందని మామూలుగా చెప్పగలమా? అక్కడ చేరిన రకరకాల జాతులను చూసి మురిసిపోని వారుండనడంలో ఏమైనా సందేహమా? ఈ రకరకాల జాతులతో, విభిన్నంగా కనిపించే దేశ విదేశీ జాతులతో బీచ్ చేరువలోని ఎంజీఎం గ్రౌండ్ కోలాహలంగా కని పించింది. విభిన్న జాతుల శునకాలతో.. అరుదైన రకాలతో డాగ్‌షో వారేవా అనిపించింది. ఆదివారం జరిగిన ఈ డాగ్‌షోలో శునకాల తీరుతెన్నులు.. వాటి మురిపాలు ఓ ఎత్తయితే.. వాటిని చూసి జంతు ప్రేమికులు, యజమానులు మురిసిపోవడం.. సం దర్శకులు అబ్బురంతో పరవశించడం అడుగడుగునా కనిపించింది. కార్యక్రమంలో పాల్గొన్న మంత్రి గం టా శ్రీనివాసరావు కూడా ఈ అనుభూతికి లోనయ్యారు. ఆకట్టుకున్న శునకాలను చూసి అచ్చెరువొందారు. వి శ్వాసానికి శునకాలు పెట్టిందిపేరని, భద్రత విషయంలో కూడా ఇవి కీలకపాత్ర పోషిస్తున్నాయని, పోలీసులకు సాయపడుతూ సమాజ సేవ చేస్తున్నాయని, పెంచుకునే వారికి ఎంతో సంతోషా న్ని, వినోదాన్ని, మనశ్శాంతిని ఇస్తున్నాయని చెప్పారు. షోలో 38 రకాలు జాతుల శునకాలు పాల్గొన్నాయి. పొమరేనియన్, గ్రేట్‌డేన్, డాబర్‌మేన్, చోచో, బిగిల్, డాజ్ అర్జెంటీనా తదితర జాతుల శునకాలు పాల్గొన్నాయి. వీటిలో ఎనిమిదింటిని ఎంపిక చేసి వాటికి బెస్ట్ ఇన్ షో ట్రోఫీలు అందించారు. -
హొయలు.. చూడరయా..!
-
భౌ..భౌ..ఖరీదు రూ.9 కోట్లు
శునకంతో మనిషికున్న అనుబంధం ప్రత్యేకమైంది. మానవుడు ఎన్ని జంతువులను మచ్చిక చేసుకున్నా మనుషులతో మమేకమవడంలో వీటిదే అగ్రస్థానం. ఇవి మానవులతో సమానమైన భావోద్వేగాలు ప్రదర్శిస్తాయని ఇటీవలి జరిగిన ఒక అధ్యయనంలో వెల్లడైంది. మనకు నేస్తాలుగా, ఇంటికి కాపలాగా, నేరస్తులను పట్టించే జాగిలాలుగా.. ఎంతో సేవచేస్తున్నాయి. వీటికి సంబంధించిన కొన్ని ఆసక్తికర విశేషాలు ఈ రోజు తెలుసుకుందాం..! టూమచ్ కాస్ట్! టిబెట్‌కు చెందిన మాస్తిఫ్ ప్రపంచంలోనే అత్యంత ఖరీదైన శునకం. ఈ జాతి కుక్కలు ఎక్కువ బొచ్చుతో చాలా పెద్దగా ఉంటాయి. చైనీయులకు వీటిపైన మక్కువ పెరిగి పోవడమే వీటి డిమాండ్‌కు కారణం. ఇవి ఏ ఇంటిలో ఉంటే ఆ కుటుంబానికి సిరిసంపదలు కలుగుతాయని చైనీయుల నమ్మకం. అందరూ వీటిని ఇష్టపడటం, వీటి జాతి క్రమేణా తగ్గిపోవడం.. కూడా వీటి ధర చుక్కలనంటడానికి మరో కారణం. గతంలో జర్మన్ షెఫర్డ్ జాతి కుక్క అధిక వ్యయమని అందరూ భావించేవారు. ఇప్పుడు ఆ రికార్డును మాస్తిఫ్ బద్దలుకొట్టింది. నివసించే ప్రాంతం: ఇవి టిబెట్‌లో పుట్టాయి. టిబెట్‌ను ఇతర దేశాలు ఆక్రమించకుండా కాపాడుతున్నవి ఈ శునకాలేనట. చప్పిడి ముక్కు, పొడవుగా ఉండే నోరు.. వీటి కుండే బొచ్చుతో మూసుకుపోయి ఉంటాయి. ఆ దేశంలో ఉండే మత సన్యాసుల వెంట ఇవి కాపలాగా తిరుగుతుంటాయి. వారికి పూర్తి స్థాయి రక్షణకు కల్పిస్తున్నాయి. ఎక్కువ బలంగా ఉండి, ప్రత్యర్థులను సమర్థంగా ఎదుర్కొంటాయి. ఎక్కడైనా జీవించగలవు: బాగా ఎత్తుగా ఉండే పర్వత ప్రాంతాల్లో నివసిస్తాయి. అలాగే సాధారణ మైదాన ప్రాంతాల్లోనూ జీవించగలవు. చాలా మంది వీటిని పెంచుకోవడం ఒక సంప్రదాయంగా భావిస్తారు. చైనాలో బాగా ధనవంతుల ఇళ్లలో ఈ జాతి శునకాలు కనీసం 20కి తక్కువ కాకుండా ఉంటాయట. వీటిలో చిన్న కుక్కపిల్లే సుమారుగా రూ. 6 లక్షలకు పైగా ధర పలుకుతోంది. ఇది పెరిగి పెద్దదైతే దీని ధర ఎంతైనా ఉండొచ్చు. ఇటీవల చెనాకు చెందిన బొగ్గు గనుల ఆసామి యాంగ్ ఈ శునకాన్ని అక్షరాలా రూ. 9 కోట్ల 40 లక్షలు పెట్టి ఈ ఏడాది మార్చిలో కొనుగోలు చేశారు. సినిమాలంటే పిచ్చి: తూర్పుగోదావరి జిల్లా కడియం గ్రామంలో భాస్కర థియేటర్ కేరాఫ్ అడ్రస్‌గా చేసుకుని ఒక కుక్క నివసిస్తోంది. అది రోజూ ఆ థియేటర్లో ఆడే నాలుగు షోలూ ఒక్కటి కూడా మిస్సవకుండా వీక్షిస్తుందట. అది ఎక్కడో ఒక మూలన ఉండి కాదు.. దర్జాగా కుర్చీలో కూర్చునే. సినిమా థియేటర్ గేటు తెరచిన శబ్దం వినగానే లోపలికి ప్రవేశిస్తుంది. ఇంటర్వెల్లో బయటకు రావడం, షో మొదలవ్వగానే లోపలికి పరుగెత్తడం దీనికి రోజూ మామూలేనట. దీన్ని సెంటిమెంట్‌గా భావించి ఆ థియేటర్ యజమాని కూడా ఆ శునకాన్ని చేరదీస్తున్నాడట. బుల్లి శునకం: ప్రపంచంలో అత్యంత చిన్న శునకం పేరు చిహ్వాహ్వా. పేరు నోరు తిరగడం లేదు కదూ! ఇది ఎంత చిన్నదంటే కేవలం 6 నుంచి 9 అంగుళాలు మాత్రమే ఉంటుంది. చిన్నది కదా అని చిన్నచూపు చూసేరు.. ఇది కరిస్తే మిగిలిన జాతుల కంటే రాబిస్ వచ్చే ప్రమాదం అధికమట. పెద్ద శునకం: ప్రపంచంలో అత్యంత పెద్ద శునకం ఇంగ్లిష్ మేస్టిన్. దీని బరువు 158 కిలోలు. విగ్రహం: కుక్కకి విగ్రహం పెట్టడం ఏంటని ఆశ్చర్యపోతున్నారా..? మనుషుల్లోనే అతి కొద్ది మందికి మాత్రమే దక్కే ఇలాంటి అదృష్టం ై‘లెకా’ అనే కుక్క పిల్ల కొట్టేసింది. ఇంతకి ఎవరీ లైకా అనుకుంటున్నారా? అంతరిక్షంలోకి మానవులు వెళ్తే మనం గొప్పగా భావిస్తున్నాం. లైకా అనే ఈ శునకం మానువుల కంటే ముందే అంతరిక్షంలో అడుగుపెట్టి ఆ క్రెడిట్ కొట్టేసింది. అంతరిక్షంలో పరిస్థితులు తెలుసుకోవడం కోసం వ్యోమగాములు ముందుగా దీన్ని అంతరిక్షంలోకి పంపారు. అయితే అక్కడి వాతావరణ పరిస్థితులు తట్టుకోలేక చనిపోయింది. ఓ బృహత్తర కార్యం సాధించడంలో మానవులకు మార్గదర్శకంగా నిలిచి ఆ కార్యక్రమంలో అశువులు బాసిన దీని విగ్రహాన్ని ఇటీవల మాస్కోలో ప్రతిష్టించారు. 1953 నవంబర్ 3న లైకా అంతరిక్షయానం చేసింది. ఎత్తైన శునకం: ప్రపంచంలోనే ఎత్తైన కుక్క జాతి గ్రేట్ డేన్. ఎత్తుగా ఉండటమే దీని ప్రత్యేకత. అందాల పోటీలు: ప్రతి ఏటా చాలా నగరాల్లో డాగ్షోలు జరుగుతాయి. వీటిలో శునకాలు సైతం ర్యాంప్ వాక్ చేస్తాయి. వాటి అందం, ప్రదర్శించిన విన్యాసాలను బట్టి వాటిలో విజేతలుగా ప్రకటించి బహుమతులు అందచేస్తారు.