క్యూట్ పప్పీ.. నాటీ బేబీ
బీచ్‌రోడ్డు (విశాఖ తూర్పు): చిట్టిపొట్టి పప్పీలు.. ముద్దులొలికించిన ‘స్మార్ట్ బేబీ’లు.. ధైర్య సాహసాలకు ప్రతీకగా కనిపించే జాతి జాగిలాలు! అందంగా అగుపించి చూపుతిప్పుకోనివ్వని ము చ్చటైన జూలు విదేశీ వెరైటీలు. ఒక్కొక్కటీ ఒక్కో రకం. ఒక్కొక్కదాని తీరు ఒక్కో విధం. ఈ విభిన్న రకాల శునకాలన్నీ ఓ చోట చేరిన ప్రదర్శన ఆకట్టుకుందని మామూలుగా చెప్పగలమా? అక్కడ చేరిన రకరకాల జాతులను చూసి మురిసిపోని వారుండనడంలో ఏమైనా సందేహమా? ఈ రకరకాల జాతులతో, విభిన్నంగా కనిపించే దేశ విదేశీ జాతులతో బీచ్ చేరువలోని ఎంజీఎం గ్రౌండ్ కోలాహలంగా కని పించింది. విభిన్న జాతుల శునకాలతో.. అరుదైన రకాలతో డాగ్‌షో వారేవా అనిపించింది.
ఆదివారం జరిగిన ఈ డాగ్‌షోలో శునకాల తీరుతెన్నులు.. వాటి మురిపాలు ఓ ఎత్తయితే.. వాటిని చూసి జంతు ప్రేమికులు, యజమానులు మురిసిపోవడం.. సం దర్శకులు అబ్బురంతో పరవశించడం అడుగడుగునా కనిపించింది. కార్యక్రమంలో పాల్గొన్న మంత్రి గం టా శ్రీనివాసరావు కూడా ఈ అనుభూతికి లోనయ్యారు. ఆకట్టుకున్న శునకాలను చూసి అచ్చెరువొందారు. వి శ్వాసానికి శునకాలు పెట్టిందిపేరని, భద్రత విషయంలో కూడా ఇవి కీలకపాత్ర పోషిస్తున్నాయని, పోలీసులకు సాయపడుతూ సమాజ సేవ చేస్తున్నాయని, పెంచుకునే వారికి ఎంతో సంతోషా న్ని, వినోదాన్ని, మనశ్శాంతిని ఇస్తున్నాయని చెప్పారు. షోలో 38 రకాలు జాతుల శునకాలు పాల్గొన్నాయి. పొమరేనియన్, గ్రేట్‌డేన్, డాబర్‌మేన్, చోచో, బిగిల్, డాజ్ అర్జెంటీనా తదితర జాతుల శునకాలు పాల్గొన్నాయి. వీటిలో ఎనిమిదింటిని ఎంపిక చేసి వాటికి బెస్ట్ ఇన్ షో ట్రోఫీలు అందించారు.
Comments
Please login to add a commentAdd a comment