మెట్రో పిల్లర్ కోసం తీసిన గుంటలో పడి ఏడేళ్ల బాలుడు మృతిచెందాడు.
హైదరాబాద్ : మెట్రో పిల్లర్ కోసం తీసిన గుంటలో పడి ఏడేళ్ల బాలుడు మృతిచెందాడు. ఈ ఘటన గురువారం మధ్యాహ్నం చోటుచేసుకుంది. నగరంలోని పాత గాంధీ ఆస్పత్రి సమీపంలో మెట్రో పిల్లర్ కోసం తీసిన గుంటలో నీరు నిండటంతో.. ప్రమాదవశాత్తు బాలుడు అందులో పడి మృతిచెందాడు. విషయం తెలుసుకున్న పోలీసులు బాలుడి మృతదేహాన్ని వెలికి తీసి కేసు దర్యాప్తు చేస్తున్నారు. మరిన్ని వివరాలు తెలియాల్సి ఉంది.