చెన్నై: దేశవ్యాప్తంగా ఎండలు మండుతున్నాయి. మనుషులతో పాటు మూగజీవాల గొంతులు కూడా ఎండిపోయే పరిస్థితులు ఏర్పడ్డాయి. ముఖ్యంగా ఎండల దెబ్బకు అడవుల్లో ఉండే సహజ నీటి వనరులన్నీ ఎండిపోయి అక్కడ నివసించే వన్యప్రాణులు దాహంతో అల్లాడిపోతున్నాయి. తమిళనాడులోని సత్యమంగళం అడవులపై కూడా ఎండల ఎఫెక్ట్ పడింది.
అడవిలో దాహం తీర్చుకునేందుకు నీళ్లు లేకపోవడంతో ఓ ఆడ ఏనుగు అక్కడికి సమీపంలో ఉన్న పళనిచామి గుడి వద్దకు వచ్చింది. నీటి కోసం వెతుక్కుంటుండగా ప్రమాదవశాత్తూ అక్కడే ఉన్న గుంటలో పడిపోయింది. విషయం తెలుసుకున్న అటవీ శాఖ సిబ్బంది వెంటనే స్పందించారు. ఏనుగు వద్దకు ఒక వెటర్నరీ డాక్టర్ నేతృత్వంలో మెడికల్ టీమ్‌ను పంపించారు. ఏనుగును గుంటలో నుంచి బయటికి తీసేందుకు ప్రయత్నాలు జరుగుతున్నాయి.
ఇదీ చదవండి.. దోమలు బాబోయ్ దోమలు
Comments
Please login to add a commentAdd a comment