
కేపీహెచ్‌బీలో గరికతో వినాయక ప్రతిమ
గణపతికి గరిక అత్యంత ప్రీతిపాత్రమైనది. వినాయక చవితికి ఆ గడ్డికి ప్రత్యేక స్థానం ఉంది.
కేపీహెచ్‌బీ కాలనీ: గణపతికి గరిక అత్యంత ప్రీతిపాత్రమైనది. వినాయక చవితికి ఆ గడ్డికి ప్రత్యేక స్థానం ఉంది. ఈ పండుగను పురస్కరించుకుని కేపీహెచ్‌బీ కాలనీ డివిజన్ పరిధిలోని సర్దార్ పటేల్‌నగర్ సంస్కృతి ఇంటర్నేషనల్ స్కూల్ విద్యార్థులు గరికతో వినాయక ప్రతిమను రూపొందించి ప్రత్యేకతను చాటుకున్నారు. మట్టి వినాయక ప్రతిమల తయారీలో విద్యార్థులు నిమగ్నమైన నేపథ్యంలో గరిక గడ్డితో వినాయక ప్రతిమను రూపొందించడం విశేషంగా ఆకట్టుకుంది.