హైదరాబాద్: వైస్ ప్రిన్సిపాల్ మందలించాడన్న కారణంతో ఇంటర్ విద్యార్థి ఆత్మహత్య చేసుకున్న ఘటన కూకట్పల్లి హౌలింగ్ బోర్డు(కేపీహెచ్బీ) కాలనీలో గురువారం మధ్యాహ్నం చోటు చేసుకుంది. ప్రైవేటు కాలేజీలో ఇంటర్ సెకండియర్ చదువుతున్న చంద్రశేఖర్ బలవన్మరణానికి పాల్పడ్డాడు.
తనతో పాటు చదువుతున్న విద్యార్థినికి అసభ్య ఎస్‌ఎమ్‌ఎస్‌లు పంపుతున్నాడని అతడిని వైస్ ప్రిన్సిపాల్ మందలించాడు. దీంతో మనస్తాపం చెంది అతడు ఆత్మహత్యకు పాల్పడ్డాడు. ఆత్మహత్యకు ముందు తాను తప్పుచేశానని ఫేస్ బుక్ లో చంద్రశేఖర్ మెసేజ్ పోస్ట్ చేసినట్టు తెలిసింది.
పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. కాగా, బాధిత విద్యార్థిని కూడా ఆత్మహత్యాయత్నం చేసింది. ఆమె ఆరోగ్య పరిస్థితి నిలకడగా ఉంది. మరోవైపు చంద్రశేఖర్ ఆత్మహత్యకు కారణమైన వైస్ పిన్సిపాల్ పై చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేస్తూ కాలేజీ ఎదుట విద్యార్థులు ఆందోళనకు చేశారు.
కేపీహెచ్బీలో విద్యార్థి ఆత్మహత్య
Published Thu, Jul 31 2014 6:45 PM | Last Updated on Fri, Nov 9 2018 4:36 PM
Advertisement
Advertisement