కేపీహెచ్‌బీలో బ్యూటీషియన్‌ ఆత్మహత్య | Beautician Satya Sirisha Commits Suicide In KPHB | Sakshi
Sakshi News home page

కేపీహెచ్‌బీలో బ్యూటీషియన్‌ ఆత్మహత్య

Published Tue, Jul 23 2019 8:25 PM | Last Updated on Tue, Jul 23 2019 8:25 PM

మృతురాలు సత్య శిరీష (ఫైల్‌ ఫోటో) - Sakshi

సాక్షి, హైదరాబాద్‌ : ఆర్థిక ఇబ్బందులతో ఓ బ్యూటీషియన్‌ అనుమానస్పద స్థితిలో మృతి చెందిన ఘటన కేపీహెచ్‌బీలో చోటుచేసుకుంది. అయిదో ఫేజ్‌లో నివాసం ఉంటున్న సత్య శిరీష గతంలో బ్యూటీపార్లర్‌ నిర్వహించేవారు. అయితే ఆర్థిక ఇబ్బందులతో దాన్ని ఆమె మూసివేసి ఇంట్లోనే ఉంటున్నారు. అయితే బ్యూటీపార్లర్‌ బిజినెస్‌లో నష్టాలు రావడంతో శిరీష మనస్తాపంతో సోమవారం సాయంత్రం తన నివాసంలో ఉరి వేసుకుని ఆత్మహత్య చేసుకుంది. మృతురాలి స్వస్థలం పశ్చిమ గోదావరి జిల్లా దొమ్మేరు. కాగా ఆర్థిక ఇబ్బందులు కారణంగానే ఆమె ఈ ఘటనకు పాల్పడినట్లు శిరీష భర్త గోపాలకృష్ణ, బంధువులు చెబుతున్నారు. మరోవైపు కేసు నమోదు చేసుకున్న పోలీసులు...శిరీషది ఆత్మహత్యా లేక హత్యా అనే కోణంలో దర్యాప్తు చేపట్టారు. మృతురాలి ఫోన్‌ కాల్స్‌ ఆధారంగా విచారణ చేస్తున్నారు. మృతదేహాన్ని పోస్ట్‌మార్టం నిమిత్తం గాంధీ ఆస్పత్రికి తరలించారు. మృతురాలికి ఓ కుమారుడు ఉన్నాడు.


 

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement