kphb police station
-
KPHB: ఆలయంలో విషాదం
కేపీహెచ్‌బీకాలనీ: గుడిలో ప్రదక్షిణలు చేయటానికి వెళ్లిన ఓ వ్యక్తి గుండెనొప్పితో మృతి చెందిన సంఘటన కేపీహెచ్‌బీ పోలీస్‌స్టేషన్ పరిధిలో చోటుచేసుకుంది. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం... కేపీహెచ్‌బీ రోడ్డు నెంబర్ 1లో అమ్మ హాస్టల్లో కానంపల్లి విష్ణువర్ధన్(31) ఉంటూ ప్రైవేట్ ఉద్యోగం చేస్తున్నాడు. అతడు ప్రతిరోజు ఉదయం ఆలయానికి వెళ్తుంటాడు. ఈ క్రమంలో సోమవారం ఉదయం 7 గంటలకు కేపీహెచ్‌బీ టెంపుల్ బస్‌స్టాప్ వద్ద ఉన్న ఆంజనేయ స్వామి ఆలయానికి వెళ్లాడు. గుడి చుట్టూ ప్రదక్షిణలు చేస్తుండగా ఒక్కసారిగా కుప్పకూలిపోయి, అపస్మారక స్థితిలోకి వెళ్లిపోయాడు. ఇతర భక్తులు సీపీఆర్ చేసి ఆసుపత్రికి తరలిస్తుండగా అంతలోనే మృతి చెందాడు. విషయాన్ని ఆయన సోదరి హేమలతకి ఫోన్ ద్వారా తెలియచేశారు. ఈ మేరకు పోలీసులు కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నారు. -
దంపతుల మధ్య తగాదాలో పోలీసులు జోక్యం.. ఎస్ఐ సస్పెన్షన్
హైదరాబాద్: భార్యా భర్తల వివాదంలో జోక్యం చేసుకున్న పోలీసులు భర్తను చితకబాదిన సంఘటన కేపీహెచ్‌బీ పోలీస్‌స్టేషన్ పరిధిలో ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. బాధితుడి కథనం మేరకు వివరాలిలా ఉన్నాయి. గుంటూరు జిల్లాకు చెందిన మొవ్వా ప్రణీత్ నగరంలోని ఓ బ్యాంక్‌లో మేనేజర్‌గా పని చేస్తున్నాడు. అతడికి అదే జిల్లాకు చెందిన శ్రీలక్ష్మీతో 2018లో వివాహం జరిగింది. భార్యాభర్తల మధ్య విభేదాలు తలెత్తడంతో శ్రీలక్ష్మీ భర్తపై గుంటూరులోని దిశ పోలీస్‌స్టేషన్‌లో ఫిర్యాదు చేయడంతో కేసు నమోదైంది. అప్పటి నుంచి వారు విడిగా ఉంటున్నారు. అయితే తన సర్టిఫికెట్లు భర్తవద్దే ఉండటంతో తనకు న్యాయం చేయాలని కోరుతూ శ్రీలక్ష్మి ఇటీవల నల్లపాడు పోలీస్‌స్టేషన్‌లో ఫిర్యాదు చేసింది. కేసు విచారణలో ఉండగా తిరిగి కేసు నమోదు చేయలేమని అక్కడి పోలీసులు ఫిర్యాదును స్వీకరించలేదు. దీంతో ఆమె తన భర్త నిజాంపేట రోడ్డులో నివాసం ఉండటంతో కేపీహెచ్‌బీ పోలీసులను ఆశ్రయించింది. విచారణ నిమిత్తం పోలీసులు ప్రణీత్‌ను స్టేషన్‌కు పిలిపించారు. తనపై అప్పటికే కేసు నమోదైందని విచారణ కొనసాగుతున్నట్లు ప్రణీత్ పోలీసుల దృష్టికి తీసుకువచ్చాడు. శనివారం మరోసారి పీఎస్‌కు పిలిపించిన పోలీసులు శ్రీలక్ష్మీ సర్టిఫికెట్లు ఇవ్వాలని ఒత్తిడి చేయడమేగాక తనను దుర్భాషలాడుతూ విచక్షణారహితంగా మోకాళ్లు, పాదాలపై చితకబాదినట్లు బాధితుడు ఆరోపిస్తున్నాడు. తన భార్య సమక్షంలోనే తనను నడిపిస్తూ మరోసారి కోటింగ్ ఇవ్వా లా అని ఆమెను అడిగినట్లు తెలిపాడు. నగరంలో ని ఓ ఏసీపీ సూచనమేరకే పోలీసులు తనపై దాడి చేశారని ఆవేదన వ్యక్తం చేశాడు. తనపై దాడికి పాల్పడిన ఎస్ఐ, కానిస్టేబుళ్లపై చర్యలు తీసుకోవాలని కోరుతూ అతను సోషల్ మీడియా ద్వారా సైబరాబాద్ పోలీసులకు ఫిర్యాదు చేశాడు. దీనిపై స్పందించిన సైబరాబాద్ సీపీ అవినాష్ మహంతి ఈ ఘటనపై విచారణ చేపట్టి నివేదిక అందజేయాలని ఉన్నతాధికారులను ఆదేశించారు. మియాపూర్ ఎస్ఐ గిరీష్ కుమార్ సస్పెన్షన్ మియాపూర్: కేసు విషయంలో పోలీస్ స్టేషన్‌కు వచ్చిన మహిళతో అసభ్యకరంగా ప్రవర్తించిన మియాపూర్ ఎస్ఐ గిరీష్ కుమార్‌ను సస్పెండ్ చేస్తూ సైబరాబాద్ సీపీ అవినాష్ మహంతి మంగళవారం ఉత్తర్వులు జారీ చేశారు. వివరాల్లోకి వెళితే.. 2020 బ్యాచ్‌కు చెందిన గిరీష్ కుమార్, 2022 మార్చిలో మియాపూర్ పీఎస్‌లో ఎస్ఐగా బాధ్యతలు చేపట్టారు. ఆయన సెక్టార్ –2 బాధ్యతలను పర్యవేక్షిస్తున్న ఆయన ఓ కేసు విషయమై పోలీస్ స్టేషన్‌కు వచ్చిన మహిళతో అసభ్యకరంగా ప్రవర్తించినట్లు సమాచారం . ఈ విషయమై బాధితురాలు సైబరాబాద్ సీపీ అవినాష్ మహంతికి ఫిర్యాదు చేసింది. విచారణ చేపట్టిన సీపీ ఎస్ఐ గిరీష్ కుమార్‌ను సస్పెండ్ చేస్తూ మంగళవారం రాత్రి ఉత్తర్వులు జారీ చేశారు. -
Kukatpally: భర్తను రెడ్ హ్యాండెడ్ గా పట్టుకున్న భార్య
-
Kukatpally:వివాహేతర సంబంధం.. భర్తను రెడ్ హ్యాండెడ్‌గా పట్టుకున్న భార్య
సాక్షి, కేపీహెచ్‌బీకాలనీ: వివాహం చేసుకున్న భార్యను వదిలి మరో మహిళతో వివాహేతర సంబంధం కొనసాగిస్తున్న భర్తను బుధవారం భార్య రెడ్ హ్యాండెడ్‌గా పట్టుకొని చితక బాదిన సంఘటన కేపీహెచ్‌బీ పోలీస్ స్గేషన్ పరిధిలో చోటు చేసుకుంది. బాధితురాలు తెలిపిన వివరాల ప్రకారం... గుంటూరు జిల్లా పెద్దపరిమికి చెందిన ప్రకాష్‌కు 2019లో అదే జిల్లాకు చెందిన త్రివేణితో వివాహం జరిగింది. వివాహం సమయంలో వరకట్నంగా రూ.20 లక్షల నగదు, 30 సవర్ల బంగారు ఆభరణాలు, 3 ఎకరాల భూమి ఇచ్చారు. ప్రకాష్ బంజారాహిల్లోని ఓ సాఫ్ట్వేర్ కంపెనీలో చార్టర్డ్ అకౌంటెంటుగా పని చేస్తున్నాడు. చదవండి: హైదరాబాద్‌లో ప్రేమోన్మాది ఘాతుకం.. యువతి గొంతు కోసిన యువకుడు ప్రకాష్ పెళ్ళైన నెలకే భార్యను దూరం పెట్టడం మొదలు పెట్టాడు. హైదరాబాదులో కాపురం పెట్టాక భార్యను అకారణంగా హింసించే వాడు. రాత్రుళ్లు ఇంటికి రాకుండా ఉండేవాడని బాధితురాలు త్రివేణి తెలిపింది. తనతో అంతరంగికంగా ఉన్న ఫొటోలను తన స్నేహితులకు చూపించేవాడని.. భర్త పెట్టే బాధలను భరించలేక ఆత్మహత్యాయత్నం చేసినా పట్టించుకోలేదని బాధితురాలు పేర్కొంది. కాగా తన భర్త మరో మహిళతో వివాహేతర సంబంధం కొనసాగిస్తున్నట్లు తెలుసుకుంది. బుధవారం రాత్రి త్రివేణి తన కుటుంబ సభ్యులతో కేపీహెచ్‌బీ తులసీనగర్‌లో ప్రకాష్, మరో మహిళతో ఉండగా రెడ్ హ్యాండెడ్‌గా పట్టుకొని చితకబాదింది. సమాచారం అందుకున్న పోలీసులు ప్రకాష్‌ను, మహిళను అదుపులోకి తీసుకొని పోలీస్ స్టేషనుకు తరలించారు. చదవండి: విషాదం: పెళ్లి విషయంలో ధైర్యం చూపారు.. బతికే విషయంలో తెగువ చూపలేక.. ∙ -
ఏఎస్సై మృతి: కిస్మత్పూర్లో విషాదం
కూకట్పల్లి (హైదరాబాద్): మద్యం మత్తులో ఉన్న వ్యక్తి అతివేగంగా కారుతో ఢీ కొట్టిన ఘటనలో తీవ్ర గాయాలపాలైన మూడ్రోజులుగా చికిత్స పొందుతున్న కేపీహెచ్‌బీ పోలీస్‌స్టేషన్ ఏఎస్సై మహిపాల్‌రెడ్డి మంగళవారం మృతి చెందారు. గత శనివారం నిజాంపేట్ రోడ్డులో డ్రంకెన్ డ్రైవ్ విధులు నిర్వహిస్తుండగా అతివేగంగా దూసుకువచ్చిన టాక్సీ కారు మహిపాల్‌రెడ్డిని ఢీ కొట్టింది. దీంతో తలకు తీవ్ర గాయాలు కావడంతో మెరుగైన చికిత్సకోసం ఆయన్ను కొండాపూర్‌లోని కిమ్స్ ఆస్పత్రికి తరలించారు. అప్పటి నుంచి కోమాలో ఉన్న మహిపాల్‌రెడ్డి వెంటిలేటర్‌పై చికిత్స పొందుతూ తుదిశ్వాస విడిచారు. వివరాలు.. మద్యం సేవించి వాహనం నడుపుతూ వచ్చిన వ్యక్తి డ్రంకన్ డ్రైవ్ తనిఖీ విధుల్లో ఉన్న హోంగార్డుతో పాటు ఓ మహిళను ఢీకొట్టాడు. దీంతో వారికి స్వల్పగాయాలయ్యాయి. ఈ ఘటన గురించి తెలుసుకొని వివరాలు సేకరిస్తున్న కేపీహెచ్‌బీ ఏఎస్ఐని అతివేగంతో వచ్చిన మరో ట్యాక్సీ డ్రైవర్ ఢీకొట్టాడు. ఈ ఘటనలో ఆయనకు తీవ్ర గాయాలు అయ్యాయి. శనివారం రాత్రి 10 గంటల సమయంలో నిజాంపేట రోడ్డులోని కొలన్ రాఘవరెడ్డి గార్డెన్స్ సమీపంలో కేపీహెచ్‌బీ లా అండ్ ఆర్డర్, కూకట్పల్లి ట్రాఫిక్ పోలీసులు సంయుక్తంగా డ్రంక్ డ్రైవ్ చేపట్టారు. సుమారు 11.40 గంటల సమయంలో బాచుపల్లికి చెందిన సృజన్.. పవన్‌తో కలిసి మద్యం సేవించి తన స్నేహితుడైన శ్రీధర్‌ను పికప్ చేసుకునేందుకు నిజాంపేట వైపు టీఎస్03 ఈజెడ్ 9119 నంబర్ గల క్రెటా వాహనంలో బయలుదేరారు. పోలీసులు డ్రంక్ అండ్ డ్రైవ్ చేస్తున్న విషయాన్ని గుర్తించి వారి నుంచి తప్పించుకోవాలని ప్రయత్నిస్తుండగా కానిస్టేబుల్ రాజ్‌కుమార్ వారి కారు వద్దకు వచ్చి ఆపాలని సూచించాడు. దీంతో సృజన్ కారును వేగంగా రివర్స్ తీసుకునే ప్రయత్నం చేశాడు. ఈ క్రమంలో హోంగార్డు ప్రహ్లాద్‌తో పాటు తనూజ అనే మహిళను ఢీకొట్టాడు. ఈ ఘటన గురించి తెలుసుకున్న నైట్ రౌండింగ్ ఏఎస్ఐ మహిపాల్‌రెడ్డి డ్రంక్ అండ్ డ్రైవ్ జరుగుతున్న చోటుకు చేరుకున్నాడు. మహిపాల్‌రెడ్డి ప్రమాద వివరాలను నోట్ చేసుకుంటుండగానే అర్ధరాత్రి 12.10 గం. సమయంలో టీఎస్08 యూడీ 2984 నంబర్ గల క్యాబ్‌ను అతి వేగంగా నడుపుతూ అటుగా వచ్చిన అస్లాం అలీ.. మహిపాల్‌రెడ్డిని ఢీకొట్టాడు. కిస్మత్పూర్లో అంత్యక్రియలు: ఏఎస్ఐ మహిపాల్‌రెడ్డి మృతి చెందడంతో ఆయన స్వస్థలం కిస్మత్పూర్లో విషాదఛాయలు అలుముకున్నాయి. మహిపాల్‌రెడ్డి కిడ్నీలు, లివర్‌ను అవయవదానం చేసినట్లు ఆయన కుటుంబ సభ్యులు తెలిపారు. బుధవారం కిస్మత్పూర్తోని ఆయన నివాసం వద్ద అంత్యక్రియలు జరగనున్నట్లు చెప్పారు. అంత్యక్రియల్లో పోలీస్ ఉన్నతాధికారులు పాల్గొననున్నారు. మహిపాల్‌రెడ్డి భౌతికకాయానికి అడిషనల్ డీజీపీ సజ్జనార్ నివాళులర్పించారు. చదవండి: ప్రభుత్వ ఉద్యోగాలు, డబుల్ బెడ్ రూములు ఇప్పిస్తామంటూ.. రూ.3 కోట్ల మోసం -
కేపీహెచ్బీలో అగ్ని ప్రమాదం
సాక్షి, హైదరాబాద్ : కేపీహెచ్‌బీ కాలనీ పోలీస్ స్టేషన్ పరిధిలో అగ్ని ప్రమాదం చోటుచేసుకుంది. రాందేవ్ ఎలక్ట్రికల్ హార్ట్‌వేర్ షాపులో మంటలు చెలరేగాయి. సమాచారం అందుకున్న అగ్నిమాపక సిబ్బంది ఘటనా స్థలానికి చేరుకుని మంటలను అదుపు చేసేందుకు యత్నిస్తున్నారు. కాగా విద్యుత్ షార్ట్ సర్క్యూట్ కారణంగానే ఈ ప్రమాదం జరిగినట్లు తెలుస్తోంది. షాపులోని సామాగ్రి మొత్తం అగ్నికి ఆహుతి అయింది. అయితే ఎంతమేరకు ఆస్తినష్టం జరిగిందనే దానిపై స్పష్టత లేదు. -
భళా.. పోలీస్!
కేపీహెచ్‌బీకాలనీ: ఓ మహిళ పోగొట్టుకున్న బ్యాగును గంట వ్యవధిలోనే బాధితురాలికి అప్పగించిన సంఘటన కేపీహెచ్‌బీ పోలీస్‌స్టేషన్ పరిధిలో శుక్రవారం చోటు చేసుకుంది. ఇన్స్పెక్టర్ లక్ష్మీనారాయణ తెలిపిన వివరాల ప్రకారం... శంషీగూడ ప్రాంతంలో నివాసం ఉండే శ్రీలక్ష్మి శుక్రవారం ఉదయం 9 గంటల సమయంలో తన హ్యాండ్‌బ్యాగ్‌తో ద్విచక్ర వాహనంపై కొండాపూర్ నుంచి హెచ్ఎంటీ హిల్స్ మీదుగా శంషీగూడ తన నివాసానికి వచ్చింది. ఇంటికి వచ్చిన తరువాత చూసుకోగా తన హ్యాండ్ బ్యాగ్ కనిపించకపోవడంతో కేపీహెచ్‌బీ పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేసింది. బంగారు ఆభరణాలతో కూడిన బ్యాగ్ కావడంతో పోలీసులు వెంటనే దర్యాప్తు మొదలు పెట్టగా అడ్డగుట్ట సొసైటీ ప్రాంతంలో నివాసం ఉండే వాచ్మెన్ ఇరగవరపు సాగర్‌కు బ్యాగ్ దొరికినట్లు తెలుసుకొని అతడి నుంచి బ్యాగును శ్రీలక్ష్మికి అప్పగించారు. -
కేపీహెచ్బీలో బ్యూటీషియన్ ఆత్మహత్య
సాక్షి, హైదరాబాద్ : ఆర్థిక ఇబ్బందులతో ఓ బ్యూటీషియన్ అనుమానస్పద స్థితిలో మృతి చెందిన ఘటన కేపీహెచ్బీలో చోటుచేసుకుంది. అయిదో ఫేజ్‌లో నివాసం ఉంటున్న సత్య శిరీష గతంలో బ్యూటీపార్లర్ నిర్వహించేవారు. అయితే ఆర్థిక ఇబ్బందులతో దాన్ని ఆమె మూసివేసి ఇంట్లోనే ఉంటున్నారు. అయితే బ్యూటీపార్లర్ బిజినెస్‌లో నష్టాలు రావడంతో శిరీష మనస్తాపంతో సోమవారం సాయంత్రం తన నివాసంలో ఉరి వేసుకుని ఆత్మహత్య చేసుకుంది. మృతురాలి స్వస్థలం పశ్చిమ గోదావరి జిల్లా దొమ్మేరు. కాగా ఆర్థిక ఇబ్బందులు కారణంగానే ఆమె ఈ ఘటనకు పాల్పడినట్లు శిరీష భర్త గోపాలకృష్ణ, బంధువులు చెబుతున్నారు. మరోవైపు కేసు నమోదు చేసుకున్న పోలీసులు...శిరీషది ఆత్మహత్యా లేక హత్యా అనే కోణంలో దర్యాప్తు చేపట్టారు. మృతురాలి ఫోన్ కాల్స్ ఆధారంగా విచారణ చేస్తున్నారు. మృతదేహాన్ని పోస్ట్‌మార్టం నిమిత్తం గాంధీ ఆస్పత్రికి తరలించారు. మృతురాలికి ఓ కుమారుడు ఉన్నాడు. -
తెలంగాణ హైకోర్టును ఆశ్రయించిన హృతిక్
సాక్షి, హైదరాబాద్ : బాలీవుడ్ ప్రముఖ హీరో హృతిక్ రోషన్ తెలంగాణ హైకోర్టును ఆశ్రయించారు. కూకట్‌పల్లిలో తనపై నమోదైన కేసును కొట్టివేయాలని హైకోర్టు ధర్మాసనాన్ని కోరారు. ఈ మేరకు ఆయన క్వాష్ పిటిషన్ దాఖలు చేశారు. కూకట్‌పల్లిలోని కల్ట్‌పిట్ జిమ్ సెంటర్‌కు హృతిక్ బ్రాండ్ అంబాసిడర్‌గా వ్యవహరిస్తున్నారు. అయితే బరువు తగ్గుతారంటూ తప్పుడు ప్రకటనలతో మోసం చేశారంటూ శ్రీకాంత్ అనే యువకుడు కల్ట్ ఫిట్ హెల్త్ కేర్ ప్రైవేట్ లిమిటెడ్ డైరెక్టర్లతో పాటు హృతిక్ రోషన్‌పైనా పోలీసులకు ఫిర్యాదు చేశాడు. దీంతో కూకట్పల్లి పోలీసులు ఆ సంస్థ డైరెక్టర్లు ముకేశ్ బన్సాల్, అంకిత్ నగోరి, నిర్వహణాధికారి మణి సుబ్బయ్యతో పాటు హృతిక్ రోషన్‌పై కేసు నమోదు చేశారు. (చదవండి : బాలీవుడ్ స్టార్ హీరోపై హైదరాబాద్‌లో కేసు) ఈ నేపథ్యంలో తమపై చేసిన ఫిర్యాదులో వాస్తవంలేదని.. ఆ కేసు కొట్టివేయాలని డైరెక్టర్లతో పాటు హృతిక్ రోషన్ క్వాష్ పిటిషన్ దాఖలు చేశారు. వాదనలు విన్న న్యాయస్థానం.. పూర్తి వివరాలతో కౌంటర్లు దాఖలు చేయాలని పోలీసులకు, ఫిర్యాదుదారుడు శ్రీకాంత్‌కు నోటీసులు జారీచేసింది. తదుపరి విచారణను నాలుగు వారాలపాటు వాయిదా వేసింది. -
కూకట్‌పల్లిలో దారుణహత్య
సాక్షి, హైదరాబాద్ : నగరంలోని కేపీహెచ్‌బీ పోలీసు స్టేషన్ పరిధిలో దారుణం చోటుచేసుకుంది. కూకట్పల్లి కళామందిర్ రోడ్డులోని ఓ గదిలో గుర్తుతెలియని వ్యక్తిని దుండగలు దారుణంగా హత్య చేశారు. దాదాపు 25 ఏళ్ల వయస్సున్న అతన్ని సెంట్రింగ్ కోసం ఉపయోగించే కట్టెలతో తలపై కొట్టి చంపినట్టుగా తెలుస్తోంది. మృతదేహాం ఉన్న గది నుంచి రక్తం బయటకు వచ్చింది. నిర్మాణనుష్య ప్రదేశంలో ఉన్న ఆ గదిలో ఈ విధంగా దారుణ హత్య జరగడం స్థానికంగా కలకలం రేపుతోంది. సమాచారం అందకుకున్న పోలీసులు సంఘటన స్థలానికి చేరుకుని వివరాలు సేకరిస్తున్నారు. కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేపట్టారు. -
బాలీవుడ్ స్టార్ హీరోపై హైదరాబాద్‌లో కేసు
సాక్షి, హైదరాబాద్ : బాలీవుడ్ హీరో హృతిక్ రోషన్‌పై నగరంలోని కేపీహెచ్‌బీ పోలీసు స్టేషన్లో కేసు నమోదైంది. కల్ట్ ఫిట్నెస్ సెంటర్‌కు హృతిక్ బ్రాండ్ అంబాసిడర్‌గా వ్యవహరిస్తున్నారు. కల్ట్ ఫిట్నెస్ సెంటర్ ద్వారా అన్యాయం జరిగిందని బాధితుడు శశి పోలీసలను ఆశ్రయించారు. హృతిక్ బ్రాండింగ్ చూసి తాము కల్ట్ ఫిట్నెస్ సెంటర్లో డబ్బులు చెల్లించామని ఆయన పేర్కొన్నారు. ఫిట్నెస్ సెంటర్ పేరుతో అమాయకుల నుంచి డబ్బులు వసూలు చేస్తున్నారని కల్ట్ ఫిట్నెస్ సెంటర్‌పై శశి ఫిర్యాదు చేశారు. కల్ట్ ఫిట్నెస్ సెంటర్లో స్లాట్ బుక్ చేసుకున్నప్పటికీ నిర్వాహకులు స్లాట్స్ ఇవ్వడం లేదని శశి ఆరోపించారు. ఫిట్నెస్ ప్యాకేజీ కింద రూ. 17,490 నుంచి రూ. 36,400 వరకు వసూలు చేస్తున్నారని తెలిపారు. స్లాట్స్ ఇవ్వడం లేదని ప్రశ్నించిన వారిని కల్ట్ వెబ్సైట్లో బ్లాక్ చేస్తున్నారని పేర్కొన్నారు. తాను కల్ట్ ఫిటినెస్ సెంటర్‌పై న్యాయపోరాటానికి సిద్ధంగా ఉన్నట్టు శశి వెల్లడించారు. దేశవ్యాప్తంగా కల్ట్ ఫిట్నెస్ సెంటర్లను నిర్వహిస్తుందన్నారు. ఒక్కొక్క బ్రాంచ్‌లో 500 మందికి జిమ్ చేసుకునే అవకాశం కల్పిస్తున్నారని.. కానీ ఆన్లైన్లో మాత్రం 1800 మంది వరకు స్లాట్స్ ఇస్తున్నారని వ్యాఖ్యానించారు. ఎక్కువ మంది బుకింగ్ తీసుకోవడంతో అందరికి స్లాట్స్ ఇవ్వడం లేదని బాధితుడు ఆరోపిస్తున్నారు. -
టెస్ట్ డ్రైవ్ పేరుతో మోసం..అరెస్ట్
-
టెస్ట్ డ్రైవ్ పేరుతో మోసం..అరెస్ట్
హైదరాబాద్ : టెస్ట్ డ్రైవ్ పేరుతో కార్లను దొంగిలిస్తున్న ముఠాను పోలీసులు అరెస్ట్ చేశారు. నగరంలోని కూకట్పల్లి కేపీహెచ్‌బీ పోలీస్ స్టేషన్ పరిధిలో టెస్ట్ డ్రైవ్ చేస్తామని వచ్చిన ముగ్గురు సభ్యులు కారుతో ఉడాయించారు. ఓఎల్ఎక్స్లో సెకండ్ హ్యాండ్ కారు తీసుకోవడానికి వచ్చిన ముగ్గురు వ్యక్తులు కారు టెస్ట్ చేస్తామని చెప్పి కారుతో చెక్కేశారు. దీంతో బాధితులు పోలీసులకు ఫిర్యాదు చేశారు. రంగంలోకి దిగిన పోలీసులు దర్యాప్తు చేసి ముగ్గురు సభ్యుల ముఠాను గురువారం అదుపులోకి తీసుకున్నారు. వారి వద్ద నుంచి మూడు కార్లను పోలీసులు స్వాధీనం చేసుకున్నారు.