
సాక్షి, హైదరాబాద్ : బాలీవుడ్ ప్రముఖ హీరో హృతిక్ రోషన్ తెలంగాణ హైకోర్టును ఆశ్రయించారు. కూకట్‌పల్లిలో తనపై నమోదైన కేసును కొట్టివేయాలని హైకోర్టు ధర్మాసనాన్ని కోరారు. ఈ మేరకు ఆయన క్వాష్ పిటిషన్ దాఖలు చేశారు. కూకట్‌పల్లిలోని కల్ట్‌పిట్ జిమ్ సెంటర్‌కు హృతిక్ బ్రాండ్ అంబాసిడర్‌గా వ్యవహరిస్తున్నారు. అయితే బరువు తగ్గుతారంటూ తప్పుడు ప్రకటనలతో మోసం చేశారంటూ శ్రీకాంత్ అనే యువకుడు కల్ట్ ఫిట్ హెల్త్ కేర్ ప్రైవేట్ లిమిటెడ్ డైరెక్టర్లతో పాటు హృతిక్ రోషన్‌పైనా పోలీసులకు ఫిర్యాదు చేశాడు. దీంతో కూకట్‌పల్లి పోలీసులు ఆ సంస్థ డైరెక్టర్లు ముకేశ్ బన్సాల్, అంకిత్ నగోరి, నిర్వహణాధికారి మణి సుబ్బయ్యతో పాటు హృతిక్ రోషన్‌పై కేసు నమోదు చేశారు.
(చదవండి : బాలీవుడ్ స్టార్ హీరోపై హైదరాబాద్‌లో కేసు)
ఈ నేపథ్యంలో తమపై చేసిన ఫిర్యాదులో వాస్తవంలేదని.. ఆ కేసు కొట్టివేయాలని డైరెక్టర్లతో పాటు హృతిక్ రోషన్ క్వాష్ పిటిషన్ దాఖలు చేశారు. వాదనలు విన్న న్యాయస్థానం.. పూర్తి వివరాలతో కౌంటర్లు దాఖలు చేయాలని పోలీసులకు, ఫిర్యాదుదారుడు శ్రీకాంత్‌కు నోటీసులు జారీచేసింది. తదుపరి విచారణను నాలుగు వారాలపాటు వాయిదా వేసింది.
Comments
Please login to add a commentAdd a comment